న్యూస్ రౌండప్ టాప్ 20

1.ప్రధాని మోదీ కి రేవంత్ రెడ్డి లేఖ

Telugu Ap Telangana, Chandrababu, Narendra Modi, Omi Cron India, Sai Teja, Sharm

ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు.సింగరేణి బొగ్గు గనుల లో నాలుగు గనులను ప్రైవేటు పరం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వెనక్కి తీసుకోవాలని కోరారు.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.ఒమి క్రాన్ తెలంగాణ లోకి రాలేదు

ఒమి క్రాన్ వైరస్ తెలంగాణలో ఏ మాత్రం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు.

3.నేడు మెదక్ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

Telugu Ap Telangana, Chandrababu, Narendra Modi, Omi Cron India, Sai Teja, Sharm

వైయస్సార్ టిడిపి అధ్యక్షురాలు షర్మిల ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు.హవేలి ఘనపూర్ మండలం లోని భూపతిపూర్ గ్రామానికి షర్మిల వెళ్లనున్నారు.

4.ఢిల్లీ నుంచి బయలుదేరిన సాయి తేజ పార్థీవ దేహం

హెలికాఫ్టర్ ప్రమాదంలో సీడీ ఎస్ జనరల్ బిపిన్ రావత్ తో పాటు ఆయన సంరక్షకుడు సాయి తేజ మృతి చెందిన సంగతి తెలిసిందే.డిఎన్ఎ పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో ఏపీకి చెందిన సాయి తేజ పార్థివదేహం నేడు ఢిల్లీ నుంచి బయలుదేరింది.

5.41వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర

Telugu Ap Telangana, Chandrababu, Narendra Modi, Omi Cron India, Sai Teja, Sharm

ఏపీ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని రైతులు, మహిళలు చేపట్టిన అమరావతి మహాపాదయాత్ర నేటికి 41 రోజుకు చేరుకుంది.

6.సింగరేణి కార్మికుల సమ్మె

బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు సమ్మె చేపట్టారు.నేడు మూడో రోజు కూడా సింగరేణి కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు.

7.ఉత్తరప్రదేశ్ లో నేడు ప్రధాని మోదీ పర్యటన

Telugu Ap Telangana, Chandrababu, Narendra Modi, Omi Cron India, Sai Teja, Sharm

ఉత్తరప్రదేశ్లో నేడు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు.ఈ పర్యటనలో ప్రధాని 14 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందించనున్న సరయూ సహార్ జాతీయ ప్రాజెక్టు ను ప్రారంభించనున్నారు.

8.15 ముగియనున్న అమరావతి రైతుల పాదయాత్ర

అమరావతి రైతు మహా పాదయాత్ర ఈ నెల 15న ముగియనుంది.

9.టాలీవుడ్ పబ్ పై పోలీసుల ఆకస్మిక దాడులు

Telugu Ap Telangana, Chandrababu, Narendra Modi, Omi Cron India, Sai Teja, Sharm

పంజాగుట్టలోని టాలీవుడ్ ముప్పై వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించార.

10.తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు.ఇటీవల కురిసిన వర్షాల నుంచి తేరుకోక ముందే మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవ పోతున్నట్లు తెలిపింది.

11.తిరుమలలో మద్యం సీసాల కలకలం

తిరుమలలో మద్యం సీసాలు కలకలం రేపుతున్నాయి.శ్రీవారి ఆలయానికి సమీపంలో  మద్యం సీసాలు లభించడంతో విజిలెన్స్ అధికారులు దీనిపై విచారణ చేపట్టారు.

12.తిరుమల లో టీటీడీ బోర్డ్  సమావేశం

Telugu Ap Telangana, Chandrababu, Narendra Modi, Omi Cron India, Sai Teja, Sharm

తిరుమల లో నేడు పాలకమండలి సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది.ఈ సంవత్సరంలో సుమారు 55 సంవత్సరాల పై చర్చిస్తున్నారు.

13.ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ఆరుగురు మృతదేహాల గుర్తింపు

తమిళనాడు లోని కూన్నూర్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అమరులైన సాయుధ దళాలకు చెందిన మరో ఆరుగురు మృతదేహాలను గుర్తించారు.

14.మహారాష్ట్రలో ఒమి క్రాన్ అలర్ట్

Telugu Ap Telangana, Chandrababu, Narendra Modi, Omi Cron India, Sai Teja, Sharm

మహారాష్ట్రలో ఒక్కరోజే ఏడు ఒమి క్రాన్ కేసులు నమోదయ్యాయి.

15.పాపాగ్ని నది పై నడకదారికి ఏర్పాట్లు

ఇటీవల కురిసిన వర్షాలకు పాపాగ్ని నది పై ఉన్న వంతెన వరద ప్రవాహంతో వంతెన కు ప్రమాదం ఏర్పడడం తో కడప తాడిపత్రి జాతీయ రహదారిని మూసివేశారు.పాపాగ్ని నది పై నుంచి వెళ్లేందుకు వంతెన ఏకైక మార్గం కావడంతో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి.దీంతో పాఠశాల విద్యార్థులు , ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వంతెనపై నుంచి తాత్కాలిక రహదారిని అధికారులు ఏర్పాటు చేశారు.

16.ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులు పరిశీలన

Telugu Ap Telangana, Chandrababu, Narendra Modi, Omi Cron India, Sai Teja, Sharm

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో  కురిసిన వర్షాలు కారణంగా తిరుమల ఘాట్ రోడ్ దెబ్బతినడంతో మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి ఈ పనులను తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి పరిశీలించారు.

17.ముంబై లో ఒమి క్రాన్ కర్ఫ్యూ

ఒక్క రోజులోనే ఏడు ఒమి క్రాన్ కేసులు నమోదైన నేపథ్యంలో ముంబైలో మూడు రోజులపాటు కర్ఫ్యూ విధించారు.

18.వైసీపీకి చంద్రబాబు సవాల్

Telugu Ap Telangana, Chandrababu, Narendra Modi, Omi Cron India, Sai Teja, Sharm

ఏపీ విషయంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నా ప్రభుత్వం నోరు మెదపడం లేదని, వైసీపీ కి నిజంగా చిత్త శుద్ది ఉంటే  ఎంపీలు రాజీనామా చేయాలని తమ పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని ఈ సవాల్ కు సిద్ధమా అంటూ వైసీపీకి టీడీపీ నేత చంద్రబాబు సవాల్ విసిరారు.

19.భారత్ లో ఒమి క్రాన్

Telugu Ap Telangana, Chandrababu, Narendra Modi, Omi Cron India, Sai Teja, Sharm

భారత్ లో ఒమి క్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి.ఇప్పటివరకు భారత్ లో ముప్పై మూడు కేసులు నమోదయ్యాయి.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర –  46,790

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,790

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube