న్యూస్ రౌండప్ టాప్ 20

1.పిఈటి అభ్యర్థుల ఆందోళన

Telugu Ap Telangana, Drnori, Posanikrishna, Gold, Top-Latest News - Telugu

తెలంగాణ అసెంబ్లీని గురుకులాల పీఈటీ అభ్యర్థులు ముట్టడించారు.  వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. 

2.ఇంటర్ ప్రవేశాల గడువు పొడగింపు

  తెలంగాణలో ఇంటర్ మొదటి ఏడాది అడ్మిషన్ల గడువు ను మరోసారి పొడిగించారు అక్టోబర్ 20 వరకు అవకాశం కల్పించారు. 

3.పులి సంచారం

Telugu Ap Telangana, Drnori, Posanikrishna, Gold, Top-Latest News - Telugu

  తెలంగాణలోని మంచిర్యాల జిల్లా ఒడ్డగూడెం అటవీ ప్రాంతంలో పులి సంచారం తో సమీపంలో నివాసముంటున్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు.ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు పులి జాడను కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. 

4.హైదరాబాద్ నుంచి ఏపీకి ఆర్టిసి డోర్ డెలివరీ

  ఏపీఎస్ఆర్టీసీ నేటి నుంచి ఏపీ లోని జిల్లా కేంద్రాలు ప్రధాన నగరాలకు డోర్ డెలివరీ సేవలను ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, ఏలూరు ,మచిలీపట్నం గుంటూరు, విశాఖపట్నం ,ఒంగోలు, నెల్లూరు చిత్తూరు, కడప, కర్నూలు అనంతపురం జిల్లా కేంద్రంతోపాటు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి పట్టణాల్లో 50 కేజీల వరకు పార్సిల్ ను  పోస్టల్ పిన్ కోడ్ ఆధారంగా డోర్ డెలివరీ చేయబోతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. 

5.అసెంబ్లీలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం

Telugu Ap Telangana, Drnori, Posanikrishna, Gold, Top-Latest News - Telugu

  ఈ రోజు శాసనసభ శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ అసెంబ్లీ కౌన్సిల్ లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. 

6.యాదాద్రి జిల్లా లో హర్యానా గవర్నర్ పర్యటన

Telugu Ap Telangana, Drnori, Posanikrishna, Gold, Top-Latest News - Telugu

  నేడు యాదాద్రి జిల్లాలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పర్యటించారు. 

7.జగన్ ను కలిసిన కొత్త సీఎస్

  రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. 

8.తిరుమల సమాచారం

Telugu Ap Telangana, Drnori, Posanikrishna, Gold, Top-Latest News - Telugu

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.గురువారం తిరుమల శ్రీవారిని 28,422 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 

9.నేడు జుక్కల్ లో షర్మిల పర్యటన

  వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల శుక్రవారం కామారెడ్డి జిల్లా  జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద మండలం షెట్లుర్ గ్రామం లో పర్యటించారు మంజీరా నదిలో ఇసుక.అక్రమ తవ్వకాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించనున్నారు. 

10.  బతుకమ్మ చీరల పంపిణీ

Telugu Ap Telangana, Drnori, Posanikrishna, Gold, Top-Latest News - Telugu

  తెలంగాణలో రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ సంచాలకులు శైలజా రామయ్యర్ తెలిపారు. 

11.పెద్దపులిని ఎదుర్కొన్న వృద్ధుడు

  మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన 65 ఏళ్ల శంకర్ ( పై గురువారం సాయంత్రం పెద్ద పులి దాడి చేసింది.ఆయన వడ్డిగూడెం సమీపంలో మేకలు మేపుతూ పొదల చాటున ఉన్న పులి దాడి చేయడంతో చేతిలో ఉన్న గొడ్డలితో పులి ముఖం పై కొట్టగా అది పడిపోయిందని వృద్ధుడు శంకర్ తెలిపారు. 

12.పోసాని కృష్ణ మురళి బహిష్కరించాలి: జనసేన

Telugu Ap Telangana, Drnori, Posanikrishna, Gold, Top-Latest News - Telugu

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణ మురళి ని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని ఆ పార్టీ తెలంగాణ ఇన్చార్జి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. 

13.తెలంగాణలో కరోనా

  గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా కొత్తగా 214 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 

14.మదర్ డైరీ చైర్మన్ గా గంగుల కృష్ణారెడ్డి

Telugu Ap Telangana, Drnori, Posanikrishna, Gold, Top-Latest News - Telugu

  నల్గొండ రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ అధ్యక్షుడిగా గంగుల కృష్ణా రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

15.పవన్ కళ్యాణ్ శ్రమదానం వేదిక మార్పు

  గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2న ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ పై జనసేన ఆధ్వర్యంలో శ్రమదానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.దీనికి ఇరిగేషన్ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో తూర్పుగోదావరి జిల్లా హుకుంపేట కు వేదికను మార్చుకున్నారు. 

16.ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు

Telugu Ap Telangana, Drnori, Posanikrishna, Gold, Top-Latest News - Telugu

  ఏపీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు క్యాబినెట్ మంత్రి హోదా లో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

17.క్లాప్ కార్యక్రమం నిర్వహణ పై బీజేపీ అభ్యంతరం

  స్వచ్ భారత్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పేరుతో క్లాప్ కార్యక్రమం నిర్వహించడం పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

18.3 నుంచి పాలీసెట్ కౌన్సిలింగ్

Telugu Ap Telangana, Drnori, Posanikrishna, Gold, Top-Latest News - Telugu

  పాలిసెట్ 2021లో అర్హత సాధించిన వారికి ఈనెల మూడు నుంచి ఏడో తేదీ వరకు కౌన్సెలింగ్ జరగనుంది. 

19.భారత్ లో కరోనా

  దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 26,727 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Ap Telangana, Drnori, Posanikrishna, Gold, Top-Latest News - Telugu

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,470   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,470

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gol-TeluguStop.com
.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube