న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఎస్ఆర్ఎస్పి కాలువ లో పడి 25 గేదెల మృతి

ఎస్సారెస్పీ కారులో ప్రమాదవశాత్తు గేదెలు  గల్లంతైన సంఘటన 25 గేదెలు మృతి చెందాయి.రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

 Ap And Telangana News, Breaking News,top 20 Headlines, Andhra Pradesh Politics,-TeluguStop.com

2.టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల కు పిఆర్ ఇంజనీర్స్ మద్దతు

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్  అసోసియేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి , సురభి వాణి దేవిలకు తమ సంపూర్ణ మద్దతు తెలిపింది.

3.టెక్సాస్ లో కాల్పుల కలకలం .ముగ్గురు మృతి

Telugu Andhra Pradesh, Ap Telangana, Gold Rates, Mamata Banerjee, Telangana, Top

మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి.టెక్సాస్ లో రాత్రి 11 గంటల సమీపంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.

4.పింగళి కుటుంబానికి జగన్ సత్కారం

మాచర్లలో పర్యటించిన జగన్ ఈ సందర్భంగా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని పరామర్శించి, పింగళి వెంకయ్య కుమార్తెకు శాలువా కప్పి సన్మానం చేశారు.

5.స్పీకర్ సతీమణికి జగన్ ప్రశంసలు

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణి సీతారాం ను వైఎస్ జగన్ ప్రశంసించారు.శ్రీకాకుళం జిల్లా తోగరం సర్పంచ్ గా గెలుపొందిన ఆమె సీఎం ను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఆ సందర్భంగా అక్షయ పాత్ర పనితీరుపై స్పందించిన తీరు బాగుందని జగన్ ప్రశంసించారు.

6.ఉత్తరాఖండ్ బిజెపి చీఫ్ గా మదన్ కౌశిక్

Telugu Andhra Pradesh, Ap Telangana, Gold Rates, Mamata Banerjee, Telangana, Top

ఉత్తరాఖండ్ బిజెపి అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మదన్ కౌశిక్ నియమిస్తూ ఈరోజు ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

7.కోయంబత్తూరు సౌత్ నుంచి కమల్ పోటీ

మక్కల్ నీది మైయామ్ చీఫ్ కమహాసన్ కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

8.ప్రత్యక్ష రాజకీయాల్లోకి తమిళ హీరో

Telugu Andhra Pradesh, Ap Telangana, Gold Rates, Mamata Banerjee, Telangana, Top

ఏప్రిల్ 6 వ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఎన్నికల్లో స్టాలిన్ కుమారుడు తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు.గతంలో కరుణానిధి పోటీ చేసిన చేపాక్ నుంచి పోటీ చేస్తున్నారు.

9.మద్యం దుకాణాల మూసివేత

ఈ నెల 14న జరిగే పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జంటనగరాల్లో 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మధ్యాహ్నం వరకు మద్యం దుకాణాలను మూసి ఉంచాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

10.పంజాబ్ లో ఆరు జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ

పంజాబ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ పంజాబ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

11.జగిత్యాల లో స్ట్రెయిన్ కలకలం

జగిత్యాల లో ట్రైన్ కలకలం రేపుతోంది ఇటీవల జిల్లాకు వచ్చిన నలుగురికి నిర్ధారణ అయింది.వీరందర్నీ గచ్చిబౌలి టీమ్స్ కు తరలించారు.

12.నిలకడగా సీఎం మమత ఆరోగ్యం

Telugu Andhra Pradesh, Ap Telangana, Gold Rates, Mamata Banerjee, Telangana, Top

నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో గాయపడ్డ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎస్ ఎస్ కేఎం వైద్యులు శుక్రవారం తెలిపారు.

13.అనపర్తి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే టిడిపి నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ను పోలీసులు అరెస్టు చేశారు హత్యకేసులో ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

14.ప్రధానికి జేడీ లక్ష్మీనారాయణ లేఖ

Telugu Andhra Pradesh, Ap Telangana, Gold Rates, Mamata Banerjee, Telangana, Top

దేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కు లేని ప్రత్యేక హోదా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.సముద్రతీరంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖ ని ఆయన అన్నారు.స్టీల్ ప్లాంట్ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ కి లేఖ రాసినట్లు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

15.నామినేషన్ వేసిన పన్నీర్ సెల్వం

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి మంత్రి పన్నీర్ సెల్వం బొడినయకనూర్ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

16.మహారాష్ట్రలో కరోనా కేసులు.కేంద్రం ఆందోళన

మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండడంతో వ్యక్తం చేసింది.కేంద్ర వైద్య బృందాలు ఇప్పటికే మహారాష్ట్ర కు చేరుకున్నాయి.

17.మే నెలలో తెరుచుకోనున్న కేదార్నాథ్ బద్రీనాథ్ దేవాలయం

Telugu Andhra Pradesh, Ap Telangana, Gold Rates, Mamata Banerjee, Telangana, Top

మే నెలలో తెలుసుకొనుము కేదార్నాథ్ బద్రీనాథ్ దేవాలయలను మే నెలలో తెరవాలని ఉత్తరాఖండ్ ఛార్ థాం దేవస్థానం మేనేజ్మెంట్ బోర్డ్ ప్రకటించింది.

18.టీటీడీ కి మూడు వందల కోట్ల విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం కు ఓ భక్తుడు భారీ విరాళం ప్రకటించాడు.ముంబై కు చెందిన సంజయ్ సింగ్ అనే భక్తుడు 300 కోట్లతో 300 పడకల ఆసుపత్రి నిర్మించి ఇచ్చేందుకు ముందుకొచ్చాడు.

19.కర్ణాటకలో దక్షిణాఫ్రికా కరోనా స్ట్రెయి

కర్ణాటకలోని సివమోగ్గ జిల్లా కేంద్రం లో దక్షిణాఫ్రికా కరోనా స్ట్రెయిన్ కేసు బయటపడింది.కొద్ది రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈ లక్షణాలు బయటపడ్డాయి.

20.ఈ రోజు బంగారం ధరలు

Telugu Andhra Pradesh, Ap Telangana, Gold Rates, Mamata Banerjee, Telangana, Top

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 43,530

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 44,530.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube