న్యూస్ రౌండప్ టాప్ 20

1.ప్రగతి భవన్ గోడలు పగలగొడతా : తీన్మార్ మల్లన్న

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న సంచలన విమర్శలు చేశారు.బరాబర్ వస్తా, ప్రగతి భవన్ గోడలు బద్ధలు కొట్టే రోజు తీసుకువస్తానని మల్లన్న అన్నారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News, Mallana-TeluguStop.com

2.నాగాలాండ్ లో భూకంపం

నాగాలాండ్ లో ఈరోజు ఉదయం భూమి కంపించింది.ఉదయం 10.06 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి.ఈ విషయాన్ని నేషనల్  సెంటర్ ఫర్ సిస్మాలజి తెలిపింది.

3.ఆదాని చేతికి తెలంగాణ పవర్ ప్రాజెక్ట్

అధాని గ్రూప్ అనుబంధ సంస్థ అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ తెలంగాణలోని 50 మెగా వాట్ల సోలార్ ప్రాజెక్ట్ ను చేజిక్కించుకుంది.

4.మెగాస్టార్ తో సోనాక్షి

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో డైరెక్టర్ బాబీ, మెగాస్టార్ చిరంజీవి కామంబినేషన్ లో  చేయబోతున్న సినిమాలో కథానాయకి గా సోనాక్షి సిన్హాను ఎంపిక చేశారు.

5.ఫేక్ అకౌంట్స్ నమ్మొద్దు : వరుణ్ తేజ్

ఓపెన్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఓ విషయంలో కంగారు పడుతున్నాడు.తన పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, వీటిని ఎవరు నమ్మవద్దని ప్రెస్ నోట్ విడుదల చేసారు.

6.10 కే ఎల్ఈడి బల్బు పథకం

రూ.10 కే ఎల్ఈడీ బల్బులను గ్రామీణులకు అందించే కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభిచింది.

7.హైకోర్టు ఆదేశాలపై ఫ్యూచర్ గ్రూప్ సవాల్

ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఫ్యూచర్ గ్రూప్ హై కోర్టు కి వెళ్ళింది.సింగపూర్ అర్బి ట్రేడర్ ఆదేశాలను సమర్ధిస్తూ రిలయన్స్ తో ఒప్పందం విషయంలో ముందుకు వెళ్ళరాదు అంటూ ఫ్యూచర్ రిటైల్ కు ఢిల్లీ ఏకసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

8.టెలికాం చార్జీల పెంపు ఇప్పట్లో లేనట్టే

దేశీయ మొబైల్ రంగంలో టారిఫ్ పెంపు రేపో మాపో పెరుగుతాయని అంతా భావించగా టెలికాం కంపెనీలు మాత్రం ఆ దిశగా అడుగులు లేకపోవడంతో చార్జీల పెంపు ఇప్పట్లో లేదనే విషయం అర్థం అవుతోంది.

దేవాన్ష్ పుట్టినరోజు : 30 లక్షల విరాళం

నారా లోకేష్ తనయుడు దేవాన్స్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి 30 లక్షల విరాళం అందించారు.

10.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 43, 846 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

11.సీఎం కేసీఆర్ కు హరీష్ రావు ఫోన్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు మంత్రి హరీష్ రావు ఫోన్ చేశారు.కొడగంట్ల కెనాల్ ను హరీష్ రావు పరిశీలించారు.కెనాల్ నుండి కూడవెల్లి వాగులోకి నీళ్ళు వదలాలి అని హరీష్ రావు కోరగా నీళ్ళు వదలాలి అని అధికారులను హరీష్ రావు ఆదేశించారు.

12.అమరావతి ఉద్యమం ఏపీ రాజధానిని అమరావతిలో నే కొనసాగించాలి అని కోరుతూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసన దీక్షలు నేటికీ 460 వ రోజుకి చేరుకున్నాయి.

13.బిఎస్సి నర్సింగ్ వెబ్ కౌన్సిలింగ్

బీఎస్సీ నర్సింగ్, ఎం ఎల్ టి కోర్సుల్లో కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీకి వెబ్ కౌన్సిలింగ్ నేటి నుంచి ప్రారంభం అయ్యింది.

14.జై భీమ్ భారీ బహిరంగ సభ

ఏపీలో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం ఏర్పడిందని, హై కోర్టు మాజీ న్యాయమూర్తి, న్యాయవాది జై భీమ్ యాక్సెస్ అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ అన్నారు.ఏప్రిల్ 14 వ తేదీన గుంటూరు లో జై భీమ్ పేరిట భారీ బహిరంగ సభ ను నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.

15.తెలంగాణ భవన్ లో తుపాకీ కలకలం

తెలంగాణ భవన్ లో ఓ నేత తుపాకితో హడావుడి చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవ సంబరాలు సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ గన్ తో హల్ చల్ చేశారు.

16.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగాగడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 394 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

17.విద్యుత్ చార్జీలు పెంచట్లేదు

తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు ఇప్పట్లో పెంచడం లేదని మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

18.12 కోట్ల కరోనా వాక్సిన్ డోసులకు ఆర్డర్

12 కోట్ల కరోనా వాక్సిన్ డోసులకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ లకు కేంద్రం ఆర్డర్ ఇచ్చింది.

19.శ్రీకాకుళం ఎంపీ కి సంసద్ రత్న అవార్

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కి సంసద్ రత్న అవార్డు లభించింది.

చెన్నై కు చెందిన ప్రైమ్ పాయింట్ పౌండేషన్ ఇచ్చిన ఈ అవార్డుని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా, సుప్రీం కోర్టు న్యాయ మూర్తి జస్టీస్ ఏకే పట్నాయక్ చేతుల మీదుగా రామ్మోహన్ నాయుడు అందుకున్నారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 43,920

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -44,920.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube