న్యూస్ రౌండప్ ... టాప్20  

1.భాగ్యలక్ష్మి ఆలయం లో అమిత్ షా

గ్రేటర్ ఎన్నికల ప్రచారం నిమిత్తం  హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

TeluguStop.com - Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News November 29 2020

2.తెలంగాణ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు


బీజేపీ కార్యకర్తల పై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ పై హిమాయత్ నగర్ డివిజన్ బిజెపి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

TeluguStop.com - న్యూస్ రౌండప్ … టాప్20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

3.ఏపీ మంత్రి పై హత్యాయత్నం


ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని పై ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది.అయితే ఆ ప్రమాదం నుంచి నాని తృటిలో తప్పించుకున్నారు.ఈ ఘటన మంత్రి నివాసం వద్ద చోటు చేసుకుంది.

4.కామారెడ్డి జిల్లాలో చిరుత పులి


కామారెడ్డి జిల్లాలని సదాశివ నగర్ మండలం లింగం పల్లి గ్రామ శివారులో చిరుతపులి సంచారం ఆందోళన రేపుతోంది.

5.తెలంగాణలో కరోనా


తెలంగాణలో గడచిన 24 గంటల్లో 805 కరోనా కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

6.ధరణి పేరుతో నకిలీ యాప్


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి యాప్ పేరుతో నకిలీ యాప్ ను తయారు చేసిన ఇద్దరు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

7.భారత్ లో ఉన్న కరోనా


గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 41,810 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 496 మంది మృతి చెందారు.

8.లైఫ్ సర్టిఫికెట్ కు గడువు పెంపు


పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల జీవన ప్రమాణ పత్రం ( లైఫ్ సర్టిఫికెట్) సమర్పించే గడువును ఫిబ్రవరి 28 వరకు పెంచారు.

9.ఎయిర్ టెల్ ఫ్రీ డేటా ఆఫర్


కొత్త ఎయిర్టెల్ 4g కస్టమర్లకు 5 జిబి డేటా ను ఉచితంగా అందించబోతున్నట్లు భారతి ఎయిర్ టెల్ ప్రకటించింది.

10.ఒమన్ లో వలస కార్మికులకు క్షమాభిక్ష


ఉపాధి కోసం వచ్చి సరైన పత్రాలు లేక చట్టవిరుద్ధంగా తమ దేశంలో ఉంటున్న వలస కార్మికులకు ప్రభుత్వం క్షమాబిక్ష ప్రకటించింది.వీసా గడువు ముగిసిన వలస కార్మికులు తమ స్వ దేశానికి వెళ్లేందుకు డిసెంబర్ 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది.

11.తిరుమల సమాచారం


 తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాన్ని పది రోజుల పాటు తెరుస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు.డిసెంబర్ 25న వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామని వెల్లడించారు.

12.ఇరాన్ అణు పితామహుడు హత్య


ఇరాన్ పితామహుడు మొషిన్ ఫక్ర జాదే దారుణ హత్య కలకలం రేపుతోంది.ట్రంప్ పై  ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

13.ఏపీ లో భారీ వర్షాలు


 బంగాళాఖాతంలో రెండు తుపాన్లు ఏర్పడబోతున్నట్టు ,  ఆ ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా ఆంధ్రా లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

14.ఆపరేషన్ రోహింగ్యాస్


జిహెచ్ఎంసి ఎన్నికల్లో వివాదాస్పదంగా మారిన రోహింగ్యాల అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు.హైదరాబాద్ ,సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్షుణ్ణంగా తనిఖీ లు చేస్తూ , ఓటర్ ఐడి లను స్వాధీనం చేసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

15.వైన్ షాపులు బంద్


నేటి నుంచి డిసెంబర్ 31 వరకు గ్రేటర్ పరిధిలో ని వైన్ షాపుల్లో మద్యం అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

16.ఈరోజు బంగారం ధరలు


22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,010

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,100

17.ఒంటరిగానే బీజేపీ


వచ్చే ఎన్నికల్లోనూ తెలంగాణలో ఒంటరిగానే బిజెపి పోటీ చేస్తుందని రాష్ట్ర బిజెపి వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ ప్రకటించారు.

18.కెసిఆర్ దీక్షకు పదకొండేళ్లు


తెలంగాణ సాధించడమే లక్ష్యంగా కెసిఆర్ చేపట్టిన దీక్షకు నేటితో 11 ఏళ్లు పూర్తయ్యాయి.2009 నవంబర్ 29న కెసిఆర్ నిరాహార దీక్ష చేపట్టారు.ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ లోనూ పోస్ట్ చేశారు.

19.మోదీ ‘ మన్ కీ బాత్ ‘


ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ కార్యక్రమం లో ప్రసంగించారు.

20.యూట్యూబ్ లో చూసి బ్యాంక్ చోరీ


గుంటూరు జిల్లా తంగెడ ఎస్బిఐ లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు.యూట్యూబ్ లో చూసి దొంగతనానికి పాల్పడినట్లు నిందితులు కేదారి ప్రసాద్, వినయ్ రాములు పేర్కొన్నారు.

#AssassinationOf #AmnestyFor #ElevenYears #LeopardIn #ExtensionTo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News November 29 2020 Related Telugu News,Photos/Pics,Images..