న్యూస్ రౌండప్ టాప్ 20 

1.తెలంగాణలో ప్రారంభమైన బీఏసీ సమావేశం

తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ఈరోజు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News September 24 2021-TeluguStop.com

2.నేడు ఎడ్ సెట్ ఫలితాలు

ఎడ్ సెట్ 2021 ఫలితాలను శుక్రవారం ప్రకటించనున్నట్లు సెట్ కన్వీనర్ రామకృష్ణ తెలిపారు.

3.బీఏసీ సమావేశం ఆహ్వానం అందకపోవడం పై మండిపాటు

బీఏసీ సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News September 24 2021-న్యూస్ రౌండప్ టాప్ 20 -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.కొమరం భీం జిల్లాలో పులి సంచారం

తెలంగాణలోని కొమురం భీం జిల్లా లోని కాగజ్ నగర్ మండలం విలేజ్ 9 అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది.

5.దర్గా ఉత్సవాలు ప్రారంభం

బోధన్ పట్టణంలో జలాల్ బుఖారి దర్గా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

6.యూపీఎస్సీ పరీక్షల కోసం ఆన్లైన్ శిక్షణ

తెలంగాణలోని గిరిజనుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ పరీక్షలకోసం ఎస్సీ ఎస్టీ బిసి అభ్యర్థులకు హైదరాబాద్ రాజేందర్ నగర్ గిరిజన ఐఎఎస్ స్టడీ సర్కిల్ ద్వారా 9 నెలలు ఆన్లైన్ పద్ధతిలో ఇంటిగ్రేటెడ్ ఇవ్వబోతున్నట్లు డిడి సంధ్యారాణి తెలిపారు.

7.ఆన్లైన్ లోనే వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు

గత ఏడాది మాదిరిగానే ఈ విద్యా సంవత్సరంలో కూడా ఇన్స్పైర్  మనక్ జిల్లా స్థాయి వైజ్ఞానిక పోటీలను ఆన్లైన్ లో నిర్వహించనున్నారు.

8.జగ్గారడ్డి సంచలన వ్యాఖ్యలు

తాను టిఆర్ఎస్ లోకి వెళ్ళాలి అనుకుంటే అడ్డుకునేది ఎవరు అంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు.

9.బంగాళాఖాతంలో అల్పపీడనం

ఈశాన్య తూర్పు బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

10.రాష్ట్రమంతా దళిత బంద్

రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో ని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అమలయ్యే విధంగా సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

11.అయ్యన్నపాత్రుడు పై కేసు నమోదు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది.

12.దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక వాయిదా

దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక శనివారం మధ్యాహ్నానికి వాయిదా పడింది.

13.ఆన్లైన్ లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు

అక్టోబర్ మాసానికి సంబంధించి 2.31 లక్షలు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేసింది.

14.రేపు ఢిల్లీకి ఏపీ సీఎం

ఏపీ సీఎం జగన్ రేపు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

15.భారత్ లో కరోనా

కలిసిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 31, 382 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

16.పి ఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వ నిధి కాదు

పీఎంకేర్ ఫండ్ ప్రభుత్వం నిది కాదు ఇందుకోసం వసూలు చేసే నిధులు భారత సంచిత నిధిలో జమకావు.ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

17.ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

టిఆర్ఎస్ లో తానెప్పుడూ సీఎం పదవి కోసం పోటీ పడలేదని, రెండు గుంటల భూమి ఉన్నోడు 200 కోట్లు ఖర్చు చేస్తున్నారని ,కెసిఆర్ అక్రమ సంపాదనకు అహంకారానికి మధ్య జరుగుతున్నవే హుజురాబాద్ ఎన్నికలని ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

18.ఏ ఐ టీ టీ లో రాష్ట్ర విద్యార్థికి మొదటి ర్యాంక్

ఆలిండియా ట్రేడ్ టెస్ట్ .ఏ ఐ టీ టీ లో తెలంగాణ విద్యార్థి సొనమోని సురేష్ ఎలక్ట్రిషన్ ట్రేడ్ నుంచి మొదటి ర్యాంకు సాధించారు.

19.9 నెలలో పెన్ గంగ లిఫ్ట్ సిద్ధం

తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో పెన్ గంగ నదిపై నిర్మిస్తున్న  చనకా కొరాటా ఎత్తిపోతల పథకం నిర్మాణం తుది దశకు చేరుకుంటోంది.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45, 240

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర –  46,240

.

#Telangana #Etela Rajendar #TopNews #CM Jagan Delhi #Raghunandan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు