న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై త్వరలోనే నిర్ణయం

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించే అంశంపై ఒకటి రెండు రోజుల్లో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.ఈ విషయంపై ఇంటర్ బోర్డ్ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News September 14 2021-TeluguStop.com

2.జే ఎన్ యూ ఎంట్రెన్స్ టెస్ట్ అడ్మిషన్ కార్డు విడుదల

జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లోని వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష అడ్మిషన్ కార్డును విడుదల చేశారు.

3.గణేష్ నిమర్జనం పై మంత్రి తలసాని స్పందన

గణేష్ నిమజ్జనం పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News September 14 2021-న్యూస్ రౌండప్ టాప్ 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

3.ఐటిఐ మార్కుల జాబితాలో తప్పులు

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐటీఐ విద్యార్థులకు గరిష్ట మార్కులు కంటే అధికంగా మార్కులు వచ్చాయి.దీనిపై స్పందించిన బోర్డు మార్కుల జాబితాను సరిచేసి పంపుతామని తెలియజేసింది.

4.డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు ప్రకటన 16 న

ఏపీలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు ఈ నెల 16న ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేయనుంది.

5.అక్టోబర్ 1 నుంచి రాయలసీమ వర్సిటీలో తరగతులు

కర్నూలు జిల్లాలోని రాయలసీమ వర్సిటీలో అక్టోబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

6.కెసిఆర్ పై షర్మిల విమర్శలు

హనుమకొండ లో నిరుద్యోగ దీక్ష లో పాల్గొన్న వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.నిరుద్యోగి బోడ సునీల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.ఇంకా ఎంత మంది చనిపోతే కెసిఆర్ స్పందిస్తారు అంటూ ఆమె మండిపడ్డారు.

7.ఎల్లంపల్లి ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టు కు ఉన్న 27 గేట్లను అధికారులు ఎత్తివేశారు.

8.ఫైబర్ నెట్ కేసులో విచారణ

ఫైబర్ నెట్ కేసులో అక్రమాలు పై ఈరోజు విచారణ మొదలైంది మంగళగిరి సిఐడి ప్రధాన కార్యాలయంలో ఈ విచారణ జరుగుతోంది.

9.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.  సోమవారం తిరుమల శ్రీవారిని 27,323 మంది భక్తులు దర్శించుకున్నారు.

10.త్వరలో కాపు కులాల జేఏసీ ఏర్పాటు

కాపు కులాల అన్నిటినీ ఐక్యం చేసి త్వరలో కాపు గర్జన ను ఏపీ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నట్లు కాపునాడు జాతీయ అధ్యక్షుడు తాడివాక రమేష్ నాయుడు వెల్లడించారు.

11.చెత్త కుప్పలో ఆడశిశువు

భద్రాచలం స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ వెనుక ఖాళీ స్థలంలోని చెత్త కుప్పలు ఆడశిశువును స్థానికులు గుర్తించారు.పాప కుడికన్ను వీపు వెనుక భాగంలో స్వల్ప గాయాలు అయ్యాయి ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

12.చిరంజీవికి చంద్రబాబు ఫోన్

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మెగాస్టార్ చిరంజీవి కి ఫోన్ చేశారు.ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం పై ఆరా తీశారు.

13.ఐసీసీ లో కొనసాగుతున్న సాయిధరమ్తేజ్ చికిత్స

బైక్ ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్ తేజ్ కు కాలర్ బోన్ శస్త్రచికిత్స పూర్తయింది 36 గంటల పాటు అబ్జర్వేషన్ లో పెట్టడంతో ఇంకా ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

14.ఆసుపత్రిలో చేరిన కృష్ణంరాజు

టాలీవుడ్ దిగ్గజం నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆస్పత్రిలో చేరారు.సోమవారం ఆయన నివాసంలో ప్రమాదవశాత్తు కాలుజారి పడడంతో ఆయన కాళ్ళు ఎముకకు ప్యాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు.ఈ మేరకు ఆయన శస్త్ర చికిత్స కోసం జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.

15.ప్రివిలేజ్ కమిటీ ముందుకు అచ్చెన్నాయుడు

ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు హాజరయ్యారు.

16.రాప్తాడు లో పరిటాల శ్రీరామ్ నిరసన

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ అనంతపురం జిల్లా రాప్తాడు లో టిడిపి నేత పరిటాల శ్రీరామ్ నిరసనకు దిగారు.

17.త్వరలో టూరిజం యాప్

పర్యాటకుల కోసం ప్రత్యేక టూరిజం మొబైల్ యాప్ ను అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ సత్యనారాయణ తెలిపారు.

18.నీట్ కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో బిల్లు

నీట్ కు వ్యతిరేకంగా తమిళనాడు శాసనసభలో సోమవారం ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టారు.

19.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 25,404 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46000

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,000

.

#YS Sharmila #Todays Gold #Corona #Paritala Sriram #APAssembly

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు