న్యూస్ రౌండప్ … టాప్20  

1.పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ధర్నా


TeluguStop.com - Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News November 30 2020

గ్రేటర్ లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేస్తు న్నా, పోలీసులు పట్టించుకోవడం లేదంటూ, బిజెపి నాయకులు తెలంగాణ ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.

2.  బీఏసీ సమావేశం


TeluguStop.com - న్యూస్ రౌండప్ … టాప్20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది.అసెంబ్లీ సమావేశాలను ఐదు రోజుల పాటు నిర్వహించాలని తీర్మానించింది.డిసెంబర్ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.

3.ఎన్నికల సంఘం లొంగిపోయింది రాజాసింగ్ ఫైర్


తెలంగాణ ఎన్నికల సంఘం తీరుపై బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన విమర్శలు చేశారు .టిఆర్ఎస్ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్న పట్టించుకోవడంలేదని , ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం లొంగిపోయిందని విమర్శించారు.

4.ప్రాణం తీసిన పెద్దపులి


కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లోని పెంచికల పేట మండలం కొండపల్లి ప్రాంతంలో ఆదివారం చేనులో పత్తి తీస్తున్న నిర్మల (15) అనే యువతిపై పెద్ద పులి దాడి చేసి హతమార్చింది.

5.ఏ ఆర్ రెహమాన్ కు అరుదైన గౌరవం


ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్.రెహమాన్ కు అరుదైన గౌరవం దక్కింది.ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ సంస్థ ఇండియన్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్ గా రెహమాన్ ను నియమించినట్లు ప్రకటించింది.

6.అర్ధరాత్రి అమిత్ షా, నడ్డా భేటీ


కొత్త వ్యవసాయ చట్టాన్ని నిరసిస్తూ ఢిల్లీ వేదికగా రైతులు ఆందోళన తీవ్రతరం చేసిన నేపథ్యంలో , బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, వ్యవసాయ మంత్రి తోమర్ సమావేశమయ్యారు.

7.కరోనాతో బిజెపి ఎమ్మెల్యే మృతి


రాజస్థాన్ లోని రాజన్ మంధ్ నియోజకవర్గానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కరోనా  ప్రభావానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

8.బైడెన్ కు గాయం


అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడన్ కు స్వల్ప గాయం అయ్యింది.ఆయన తన పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న సమయం ఈ గాయం అయింది.

9.తిరుమల సమాచారం


తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ ఈ రోజు విడుదల చేసింది.డిసెంబర్ నెలకు సంబంధించిన కోటాను టిటిడి వెబ్సైట్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

10.వాయుగుండం


ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రానున్న 24 గంటల్లో బలపడుతోంది.బుధవారం సాయంత్రానికి శ్రీలంక సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.ఈ ప్రభావంతో బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తు నివారణ శాఖ ప్రకటించింది.

11.బైడన్ బృందంలో మరో భారతీయ అమెరికన్


అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బై డన్ బృందంలో మరో భారతీయ అమెరికన్ కు అవకాశం దక్కింది.బడ్జెట్ చీఫ్ గా నీరా టండెన్ ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది.

12.రజనీకాంత్ కీలక భేటీ


రజనకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఉత్కంఠ కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో ‘ రజనీ మక్కల్ మండ్రం ‘ నిర్వాహకులతో రజనీకాంత్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

13.భారత్ లో కరోనా


భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.గడచిన 24 గంటల్లో 38, 772 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 443 మరణాలు సంభవించాయి.

14.తెలంగాణలో కరోనా


తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు 593 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

15.శివసేన లోకి ఊర్మిళ


సినీనటి కాంగ్రెస్ మాజీ నాయకురాలు ఊర్మిళ నేడు శివసేన పార్టీలో చేరబోతున్నారు.

16.కార్పొరేటర్ గా షకలక శంకర్


స్టార్ కమెడియన్ షకలక శంకర్ నటిస్తున్న సినిమా టైటిల్ ను ‘ కార్పొరేటర్ ‘ గా పెట్టారు.

17.మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద భద్రత పెంపు


నిన్న ఏపీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద హత్య యత్నం జరగడంతో ఆయన ఇంటి పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

18.ఆన్లైన్ లో ఇంటర్ పరీక్షలు


కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎస్ ఎస్ సీ, హెచ్ ఎస్ సీ బోర్డు పరీక్షలకు ఆన్లైన్ ద్వారా నిర్వహించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది.

19.భద్రాచలం రామాలయం వద్ద వింత పక్షి


భద్రాద్రి రామాలయం వద్ద ఓ వింత పక్షి కనిపించడంతో దానిని చూసేందుకు జనం బారులు తీరారు.

20.ఈరోజు బంగారం ధరలు


22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,700.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,764.

#OngoingCyclone #MidnightAmit #CoronaIn #TheTiger #BAC Meeting

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News November 30 2020 Related Telugu News,Photos/Pics,Images..