న్యూస్ రౌండప్ టాప్ 20

Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News November 29 2021

1.జగన్ పై లోకేష్ కామెంట్స్

రాజ్యాంగం ఇచ్చిన నిరసన తెలిపే హక్కుని కాలరాస్తున్న జగన్ కంటే ఉత్తరకొరియా కిమ్ బెటర్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కామెంట్స్ చేశారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News November 29 2021-TeluguStop.com

2.వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు కి లోక్ సభ ఆమోదం

వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది.

3.టిఆర్ఎస్ పై ఈటెల రాజేందర్ కామెంట్స్

టిఆర్ఎస్ పార్టీలో అందరూ భజనపరులే ఉన్నారని  టీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే  ఈటెల రాజేందర్ విమర్శించారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News November 29 2021-న్యూస్ రౌండప్ టాప్ 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.కుప్పం లో ఎన్టీఆర్ అభిమానుల ధర్నా

చిత్తూరు జిల్లా కుప్పం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ నాయకుల విమర్శలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.

5.  కేసీఆర్ కు షర్మిల విజ్ఞప్తి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కామెంట్స్ చేశారు.  కరోనా తో జనం పిట్టల్లా రాలిపోయారు అని, దొర గారు పట్టించుకోవాలి అని వైఎస్ షర్మిల కేసీఆర్ పై విమర్శలు చేశారు.

6.  ఏపీలో భారీ వర్షాలు ప్రభుత్వం అలర్ట్

ఏపీలో భారీ వర్షాలు మళ్లీ కోల్పోతున్నట్లు తుఫాన్ హెచ్చరికల కేంద్రం అలర్ట్ తో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది .ఈ మేరకు అనంతపురం,  చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల కలెక్టర్లతో జగన్ సమీక్ష నిర్వహించారు.

7.నేటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు

నేటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి వచ్చే నెల 23 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి.

8.తెలంగాణలో ఆటోల బంద్

వచ్చే నెల డిసెంబర్ 15న తెలంగాణ వ్యాప్తంగా ఆటోలు బంద్ నిర్వహించబోతున్నట్టు  తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ మహమ్మద్ అమానుల్లా ఖాన్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

9.ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఏపీలోని నెల్లూరు,  చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు పోతున్న నేపథ్యంలో అధికారులు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.

10.తెలంగాణ క్యాబినెట్ సమావేశం

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రగతి భవన్ లో ప్రారంభమయ్యింది.

11.బిగ్ బాస్ షో రద్దు చేయాలి : రాజసింగ్

బిగ్ బాస్ షో ను వెంటనే రద్దు చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు.కుటుంబ సభ్యులతో కలిసి షో చూడలేని పరిస్థితి ఉందన్నారు.

12.సంగారెడ్డి జిల్లా లో కరోనా కలకలం

సంగారెడ్డి జిల్లా మత్తంగి జ్యోతిరావు పూలే కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది.ఇక్కడ ఉపాధ్యాయుడితో పాటు 42 మంది విద్యార్థులు కరోనా ప్రభావానికి గురయ్యారు.

13.అమరావతి పాదయాత్ర రైతులను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే

మహా పాదయాత్ర చేపడుతూ నెల్లూరు జిల్లాకు చేరుకున్న అమరావతి ప్రాంత రైతులు,  మహిళలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలవడం సంచలనం రేపింది.

14.జగన్ పై బాబు విమర్శలు

ఏపీ సీఎం జగన్ తీరు, చేస్తున్న అప్పుల కారణంగా ఏపీ బ్రాండ్ దెబ్బతింటోంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు

15.డాలర్ శేషాద్రి మృతి పై జగన్, చంద్రబాబు సంతాపం

టీటీడీ ఈవో డాలర్ శేషాద్రి మృతి పై  ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు తమ సంతాపాన్ని తెలియజేశారు.

16.నేటి నుంచి సాగర్, శ్రీ శైలం మధ్య లాంచీ ప్రయాణం

నేటి నుంచి నాగార్జున సాగర్, శ్రీ శైలం మధ్య  లాంచీ ప్రయాణం ను అధికారులు ప్రారంభించారు.

17.ఎన్.ఆర్.ఐ స్కాలర్ షిప్ .30 తో ఆఖరు

ప్రవాస భారతీయుల పిల్లల చదువు కోసం కేంద్రం అందిస్తున్న స్కాలర్ షిప్ ప్రోగ్రాం ఫర్ డైసా ఫోర చిల్డ్రన్ కి దరఖాస్తు చేసుకునే సమయం 2021 నవంబర్ 30 తో ముగుస్తోంది.

18.వివేకా హత్య కేసు

వివేక హత్య కేసు లో సీబీఐ అధికారుల నుంచి తనకు ప్రాణ హాని ఉందని బాధితుడు గంగాధర్ రెడ్డి అనంతపురం ఎస్పీ ఫకిరప్పకు ఫిర్యాదు చేశారు.

19.డాలర్ శేషాద్రి మరణం పై సీజేఐ రమణ సంతాపం

టీటీడీ ఓఎస్డి డాలర్ శేషాద్రి మరణం పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ సంతాపం తెలిపారు.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,310

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర –  48,310

.

#CM Jagan #Todays Gold #Lokesh #Tealngana #Raja Singh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube