న్యూస్ రౌండప్ ... టాప్20   

న్యూస్ రౌండప్  టాప్ – 20


TeluguStop.com - Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News November 27 2020

1.బంజారాహిల్స్ లో నెమలి మృతి


బంజారాహిల్స్ లో ని కెబిఆర్ పార్క్ దగ్గర రోడ్డుపై నెమలి మృతి చెందింది.

రోడ్డు ప్రమాదంలో మరణించిందా లేక విద్యుత్ షాక్ తో మృతి చెందిందా అనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

2.తెలంగాణలో కరోనా


గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా 761 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందారు.ప్రస్తుతం తెలంగాణలో 10, 839 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

3.సోలార్ పవర్ ప్రాజెక్ట్ పై సీబీఐ కేసు


బ్యాంకు రుణం తీసుకుని తిరిగి చెల్లించే లేకపోయిన పృథ్వి సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తో పాటు మరికొందరు పై సిబిఐ కేసు నమోదు చేసింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సికింద్రాబాద్ రీజియన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిబిఐ కేసు నమోదు చేసుకుంది.

4.విదేశీ జంతువులకు అనుమతి తప్పనిసరి


తెలంగాణలో విదేశీ జంతువులను పక్షులను పెంచుకునేవారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తెలంగాణ అటవీశాఖ పేర్కొంది.డిసెంబర్ 2 లోగా, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ వెబ్ సైట్ లోని ‘పరివేష ‘ లో అనుమతుల కోసం నమోదు చేసుకోవాలి అని సూచించింది.

5.పెద్ద పులి సంచారం


తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, పెంచికలపేట మండలం అగర్ గూడా పెద్ద వాగు సమీపంలో గురువారం పెద్దపులి కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందారు.

6.హైదరాబాద్ కు ప్రధాని నరేంద్ర మోదీ


కరోనా వైరస్ ప్రభావం దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో, వాక్సిన్ పురోగతిని పరిశీలించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ  హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ను సందర్శించనున్నారు.

7.భారత్ లో కరోనా


గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 43,082 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 492 మంది మృతి చెందారు.ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.దేశవ్యాప్తంగా కరోనా ప్రభావానికి గురైన వారి సంఖ్య 93,09,788 మందికి చేరింది.

8.కూలిన శిక్షణ విమానం


అరేబియా సముద్రంలో మిగ్ 29 శిక్షణ యుద్ధ విమానం కూలిపోయింది.అందులో ఇద్దరు పైలట్ల లో ఒకరి ఆచూకీ లభించలేదు.

8.ఛత్ర పతి డైరెక్టర్ గా వివి.వినాయక్


బాలీవుడ్ లో తెరకెక్కనున్న చత్రపతి సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహించబోతున్నట్లు చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.

9.ఆర్ ఆర్ ఆర్ లో మెగాస్టార్ ?


ఆర్ ఆర్ ఆర్ పై ఓ ఆసక్తి కరమైన అప్డేట్ తెరపైకి వచ్చింది.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సైతం నటించబోతున్నట్టు సమాచారం.

10.కరోనా టీకా కోసం పూజలు


కరోనా వైరస్ టీకా త్వరలోనే అందుబాటులోకి రావాలని కోరుతూ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గురువారం పూజలు నిర్వహించారు.

11.కుమార్తె తో స్టెప్పులు వేసిన ధోనీ


టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని తన భార్య, కుమార్తె జీవా తో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోను ఐపీఎల్ జట్టు చెన్నై ట్విట్టర్ ద్వారా పంచుకుంది.

12.19 మంది మహిళా ఖైదీలు


ఏపీలో ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు లో జీవిత ఖైదీ అనుభవిస్తున్న 19 మంది మహిళా ఖైదీలు విడుదలయ్యారు.కొన్ని పూచీకత్తులపై వీరిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.

13.వాగులో కొట్టుకుపోయిన కారు వైసీపీ నేత మృతి


చిత్తూరు జిల్లా ఐరాల మండలం లో వైసీపీ నేత వినయ్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఓ వాగులో చిక్కుకుని కొట్టుకుపోగా అందులో ప్రయాణిస్తున్న వినయ్ రెడ్డి మృతి చెందారు.

14.రాజధాని కేసులపై విచారణ


ఏపీ రాజధాని కేసులు శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

15.స్వర్ణ ప్యాలస్ అగ్నిప్రమాదంపై విచారణకు అనుమతి


విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కువైట్ సెంటర్ లో అగ్ని ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేష్ బాబు ను విచారించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

16.ఏపీ కేబినెట్ సమావేశం


ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.డిసెంబర్ 25వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కి కేబినెట్ ఆమోదం తెలిపింది.

17.బాలీవుడ్ లోకి ఊసరవెల్లి


ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి చిత్రాన్ని బాలీవుడ్ లో నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తోంది.

18.30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు


30వ తేదీ సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి.ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు.

19.ఉచితంగా కరోనా టీకా


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలు అందరికీ ఉచితంగా టీకా అందిస్తామని బిజెపి తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది.

20.ఈరోజు బంగారం ధరలు


22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,450.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,580.

#WorshipFor #APAssembly #InquiryInto #PrimeMinister #AMiG-29

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు