న్యూస్ రౌండప్ ... టాప్20  

1.తెలంగాణ లో కరోనా


TeluguStop.com - Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News November 26 2020

తెలంగాణ లో కొత్తగా 862 కరోనా కేసులు నమోదయ్యాయి.గడచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతి చెందారు.ప్రస్తుతం తెలంగాణలో 10, 784 యక్టివ్ కేసులు ఉన్నాయి.

2.నేటి నుంచి ఆయుష్ తొలివిడత కౌన్సిలింగ్


TeluguStop.com - న్యూస్ రౌండప్ … టాప్20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

నీటిలో అర్హత సాధించిన వారికి ఆయుష్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది.ఈనెల 26 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ తెలిపింది.డిసెంబర్ 1 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

3.ఢిల్లీ సరిహద్దుల మూసివేత


వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలో అనేక చోట్ల ఉద్యమిస్తున్న లక్షలాది మంది రైతులు ఉద్యమించేందుకు ” చలో ఢిల్లీ” ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో, ముఖ్యమైన ఢిల్లీ పోలీసులు ఢిల్లీ సరిహద్దు రహదారులు అన్నిటినీ మూసివేశారు.

4.కృతజ్ఞతలు తెలిపిన బైడన్


బుధవారం డెలావేర్ లోని విల్మింగ్టన్ లో ‘ థాంక్స్ గివింగ్’ ప్రసంగంలో అమెరికా నూతన అధ్యక్షుడు బైడన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ, ప్రజలు భారీ సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనడంతో వారికి ఈ విధంగా కృతజ్ఞతలు తెలిపారు.

5.వికారాబాద్ ఎస్పీ పై బదిలీ వేటు ?


అవినీతి ఆరోపణలతో పాటు కింది స్థాయి సిబ్బంది నివేదించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్పీ నారాయణ పై పోలీసు ఉన్నతాధికారులు బదిలీ వేటు వేసినట్లు సమాచారం.ఈ మేరకు ఆయనను డిజిపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

6.భారత్ లో కరోనా


పార్క్ లో గడచిన 24 గంటల్లో 44,489 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.524 మంది ఈ ప్రభావంతో మృతిచెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.మొత్తం కేసుల సంఖ్య 92,66,706 కు చేరుకున్నాయి.

7.దిశ యాప్ డౌన్ లోడ్స్ 11 లక్షలు


ఏపీ పోలీస్ శాఖ అందుబాటులోకి తెచ్చిన దిశ మొబైల్ అప్లికేషన్ 11లక్షల డౌన్లోడ్స్ ను అధిగమించి రికార్డును సొంతం చేసుకుంది.

8.ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంలో నిరాశ


ఐపీఎస్ అధికారి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.ఏబీ వెంకటేశ్వరరావు ను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హైకోర్టు స్టే ఇవ్వగా, దానిపై ఇపుడు సుప్రీంకోర్టు స్టే విధించింది.

9.సైకిల్ తొక్కిన సోనియా గాంధీ


ఇటీవల ఢిల్లీ నుంచి గోవాకు మకాం మార్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, గోవా వీ ధుల్లో బాడీగార్డులు నడుమ సైకిల్ తొక్కుతూ సందడి చేశారు.దీంతో అభిమానులు సెల్ఫీల కోసం పోటీ పడ్డారు.

10.ఆరుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా


న్యూజిలాండ్ టూర్ కి వెళ్ళిన పాకిస్తాన్ టీం లో కరోనా కలకలం సృష్టించింది.మొత్తం 53 మంది పాక్ టీం సభ్యులు న్యూజిలాండ్ వెళ్లగా, వారిలో ఆరుగురికి పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లుగా పరీక్షల్లో తేలింది.

11.ఎస్బిఐ లో ఉద్యోగ అవకాశాలు


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1080 ఖాళీలు ఉన్నాయి.డిసెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది.

12.ఎస్సీ విద్యార్థులకు ‘ నీట్ ‘ లో ఉచిత శిక్షణ


‘ నీట్ ‘ ఇది ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల సంస్థ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

13.కెసిఆర్ గ్రేటర్ ప్రచార సభ


గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్ తరఫున పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 28వ తేదీన ఎల్బి స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

14.ముంబై దాడులకు పన్నెండేళ్లు


దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉగ్రదాడి జరిగి నేటికి పన్నెండేళ్లు అయ్యాయి.

15.బీజేపీ కి కేటీఆర్ 50 ప్రశ్నలు


బిజెపి కి 50 ప్రశ్నలు అంటూ.  జాతీయ, తెలంగాణ, హైదరాబాద్ కు సంబంధించిన అనేక అంశాలపై మంత్రి కేటీఆర్ ప్రశ్నలు కురిపించారు.

16.ఈ రోజు బంగారం ధరలు


22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45,610.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,760.

17.మాస్క్ పెట్టుకోకపోతే 5 వేల జరిమానా


హిమాచల్ ప్రదేశ్ లోని కులూ జిల్లాలో మాస్క్ ధరించిన వారికి ఐదు వేలు జరిమానా విధిస్తూ అక్కడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

18.‘ అమూల్ ‘ ప్రాజెక్ట్ 2 కి వాయిదా


నిఫర్ తుఫాన్ కారణంగా అమూల్ ప్రాజెక్ట్ మొదటి దశ కార్యక్రమాన్ని ప్రభుత్వం డిసెంబర్ 2 వ తేదీకి వాయిదా వేసినట్టు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.వాస్తవంగా ఈ ప్రాజెక్టు నేడు ప్రారంభం కావాల్సి ఉంది.

19.40 ఏళ్లు దాటిన వారికి తొలి కరోనా టీకా


కరోనా టీకా మొదటి విడతలో 50 ఏళ్లు దాటిన వారందరికీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

20.సచిన్ కు ఆటో డ్రైవర్ సాయం


క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు ఓ ఆటో డ్రైవర్ సాయం చేశారు.ఈ వ్యవహారం ఈ ఏడాది జనవరిలో జరిగినా, దానిని సచిన్ ఇప్పుడు బయట పెట్టారు.ముంబై లోని సబర్బన్ వీధుల్లో కారులో ప్రయాణిస్తున్న సచిన్ ప్రధాన రహదారికి వెళ్లే మార్గాన్ని మరచి పోవడం తో ఆటో డ్రైవర్ సహాయం చేశారు.టెక్నాలజీ ఎంత పెరిగిన మనుషుల సహాయానికి మించినది ఏదీ లేదు అంటూ సచిన్ ఆ ఘటనను ఇప్పుడు గుర్తు చేసుకున్నారు.

#CoroanaCases #TodayGold #SixCricketers #AyushCounciling #Joe Biden

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు