1.పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు
జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు 80 ఏళ్లు దాటిన ఓటర్లు దివ్యాంగులు నవంబర్ ఒకటి తర్వాత కోవిడ్ నిర్ధారణ అయినవారు పోస్టల్ బ్యాలెట్ కోసం www.tsec.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ సూచించారు.
2.అసోం మాజీ సీఎం మృతి
అసోం మాజీ సీఎం కాంగ్రెస్ నాయకుడు తరుణ్ గోగొయ్ అనారోగ్యంతో గువాహాటిలోని మెడికల్ కాలేజీలో చికిత్సపొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు.
3.ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్ పరీక్షలు
వచ్చే ఏడాది జనవరిలో జరగాల్సిన జేఈఈ-మెయిన్ 2021 పరీక్షలు ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.
4.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్ లలో 921 మందికి పాజిటివ్ గా నిర్ధారణ కాగా, 1097 మంది హాజరయ్యారని, నలుగురు కరోనా బారినపడి మృతి చెందినట్లుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
5.సీఎం ను చంపేస్తా …
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చంపేస్తానని సోషల్ మీడియా ద్వారా బెదిరింపు సందేశాన్ని పంపినందుకు పోలీసులు ఆగ్రాలో 15 ఏళ్ల బాలుడు ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
6.నారా లోకేష్ కారు తనిఖీ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ను పోలీసులు తనిఖీ చేశారు.హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి అమరావతికి బయలుదేరిన సమయంలో పోలీసులు మార్గమధ్యంలో కాన్వాయ్ ను ఆపి చెక్ చేశారు.గ్రేటర్ లో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతోనే పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు.
7.గ్రేటర్ ప్రచారానికి అమిత్ షా
ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనాయకులు అమిత్ షా ను ఆహ్వానించాలని తెలంగాణ బిజెపి నాయకులు డిసైడ్ అయ్యారు.ఆయనతో పాటు పలువురు ప్రముఖులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బిజెపి నాయకులు ప్రకటించారు.
8.టిఆర్ఎస్ ప్రచారాన్ని అడ్డుకున్న ఎంఐఎం
అక్బర్ బాగ్ డివిజన్ సపోటా బాగ్ లో టిఆర్ఎస్ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని స్థానిక ఎంఐఎం నాయకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత కు దారి తీసింది.
9.కామారెడ్డి లో చిరుత సంచారం
కామారెడ్డి జిల్లాలోని పలు శివారు గ్రామాల్లో చిరుత సంచరించడం తో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.సదాశివనగర్ మండలం తుక్కు వాడి, తుక్కోజి వాడి, పద్మాజివాడి, భూంపల్లి, తిమ్మాజీ వాడి, మోడేగం తదితర ప్రాంతాల్లో చిరుత సంచారం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు ప్రకటించారు.
10.నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి పై చీటింగ్ కేసు
నాంపల్లి నియోజకవర్గంలోని విజయనగర్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఇనాయ ఫాతిమా పై చీటింగ్ కేసు నమోదయింది.ఫేక్ డాక్యుమెంట్స్ తో బీసీ ఈ సర్టిఫికెట్ పొందినట్లుగా ఆమెపై ఆరోపణలు వచ్చాయి.
11.రాష్ట్రపతికి రేణిగుంట లో ఘన స్వాగతం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిమిత్తం భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ సీఎం జగన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు.
12.బీసీసీఐకి 4 వేల కోట్ల ఆదాయం
భారత క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ) ఐపీఎల్ 2020 నిర్వహించడం ద్వారా నాలుగు వేల కోట్లు ఆదాయం ఆర్జించిన ట్లు ప్రకటించింది.
13.వివాదంలో నెట్ ప్లిక్స్ఏ
‘ సూటబుల్ బాయ్ ‘ అనే వెబ్ సిరీస్ ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బ తీసినందుకు నెట్ ప్లిక్స్ కి చెందిన ఇద్దరు ప్రతినిధులపై మధ్యప్రదేశ్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
14.టాలీవుడ్ లోకి కన్నడ పవర్ స్టార్క
న్నడ పవర్ స్టార్ గా పేరుపొందిన హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన యువరత్న అనే సినిమా ను తెలుగులో విడుదల చేయబోతున్నారు.
15.ఏపీకి వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్ గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆ ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో రేపు విస్తారంగా వర్షాలు కురిసే కసం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
16.కంగనా పై కామెంట్స్ – శివసేన ఎమ్మెల్యే ఇంటిపై ఏసీబీ దాడులు
నటి కంగనా రౌత్ పై దేశద్రోహం కేసు పెట్టాలని వ్యాఖ్యానించిన శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ ఇంటిపై మనీ లాండరింగ్ ఆరోపణలు కేసుపై ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
17.తెరుచుకోనున్న సినిమా థియేటర్లు
తెలంగాణలో సినిమా థియేటర్లు తెలుసుకునేందుకు షరతులతో కూడిన అనుమతి లను ప్రభుత్వం ఇచ్చింది.థియేటర్లు, మల్టీప్లెక్స్ లలో 50 శాతం ప్రేక్షకులకు అనుమతి ఇచ్చింది.
18.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,200.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,400.
19.ట్రూ కాలర్ కు పోటీగా గూగుల్ కాల్
ట్రూకాలర్ కు పోటీగా గూగుల్ కాల్ యాప్ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
20.పెరిగిన పత్తి ధర
తెలంగాణలోని జమ్మికుంట మార్కెట్లో పత్తి ధరలు పెరిగాయి.క్వింటాలు పత్తి 5,660 గా ఈ రోజు పలికింది.నిన్నటి కంటే ఈ రోజు 110 ధర పెరిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.