న్యూస్ రౌండప్ టాప్ .. 20  

1.ఏపీలో మహిళల కోసం ‘ అభయం ‘ ప్రాజెక్ట్


TeluguStop.com - Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News November 23 2020

ఆటోలు క్యాబ్ లో ప్రయాణించే మహిళల రక్షణ కోసం అభయం ప్రాజెక్టును ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.మహిళలు ఆపద సమయంలో పది నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే విధంగా దీనిని రూపొందించారు.

2.తెలంగాణలో కరోనా కేసు లు


TeluguStop.com - న్యూస్ రౌండప్ టాప్ .. 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు 24, 139 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 602 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,64,128 కి చేరింది.

3.బిజెపి బస్తీ నిద్ర


గ్రేటర్ పరిధిలో సామాన్యులు నివసించే ప్రాంతాల్లో  ‘ బస్తీ నిద్ర ‘ రేపట్నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.

4.ఎల్ఈడి స్క్రీన్ వాహనాలను అనుమతించవద్దు


గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీకి ఎల్ఈడి స్క్రీన్ వాహనాల ద్వారా ప్రచారం చేసుకునే అవకాశం కల్పించ వద్దు అంటూ తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి ని కాంగ్రెస్ కోరింది.

5.రేపు సీఎం లతో ప్రధాని మోది


దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పైన దాని నివారణకు అవసరమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, స్టోరేజ్ సామర్థ్యం పంపిణీ వ్యూహం పైన అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వర్చువల్ విధానం ద్వారా సమావేశం కాబోతున్నారు.

6.డిసెంబర్ నుంచి ఉచిత నీటి సరఫరా


గ్రేటర్ పరిధిలోని ప్రజలకు టిఆర్ఎస్ వరాల జల్లు కురిపిస్తోంది.డిసెంబర్ నుంచి గ్రేటర్ పరిధిలోని ప్రజలు నీటి బిల్లులు చెల్లించవద్దు అని, 20 వేల లీటర్ల వరకు ప్రజలకు అందిస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు

7.కరాచీ భారత్ లో భాగం అవుతుంది


ఏదో ఒకరోజు పాకిస్థాన్ లోని కరాచీ భారత్ లో భాగం అవుతుందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

8.వాట్సప్ మెసేజెలు ఇకపై ఆటో డిలీట్


వాట్సప్ లో ఇకపై మెసేజ్ లు వారం రోజుల్లోగా ఆటో డిలీట్ ఆప్షన్ భారత్ లో అందుబాటులో ఉండబోతున్న ట్లు ఆ సంస్థ ప్రకటించింది.

9.గాంధీ మునిమనవడు మృతి


కరుణ వైరస్ తో మహాత్మాగాంధీ ముని మనవడు సతీష్ దుఫెలియా ఆదివారం జోహాన్నెస్ బర్గ్ లో మరణించారు.

10.ఏపీలో ఐఏఎస్, ఐఆర్ ఎస్ ల బదిలీ


ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

11.నాలుగు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు


సర్వజన పరిస్థితిపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఢిల్లీ మహారాష్ట్ర గుజరాత్ అస్సాం రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది

12.ట్విట్టర్ లో ఆర్బిఐ రికార్డు


ట్విట్టర్ లో ఫాలోయర్ల పరంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రపంచ రికార్డు సాధించింది.10 లక్షల మందికి పైగా ఆర్బిఐ ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతుండడం తో ఈ రికార్డు సొంతమైంది.

13.బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ క్షమాపణలు


దివంగత రాజశేఖర్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు.

14.మాల్దీవుల్లో సమంత


తన భర్త నాగ చైతన్య పుట్టిన రోజును పురస్కరించుకుని స్టార్ హీరోయిన్ సమంత పర్యాటక కేంద్రం మాల్దీవులకు వెళ్లారు.

15.టీఆర్ఎస్ గ్రేటర్ మ్యానిఫెస్టో విడుదల


గ్రేటర్ ఎన్నికల్లో గెలిచేందుకు టిఆర్ఎస్ పార్టీ  ఎన్నో హామీలతో తమ పార్టీ మేనిఫెస్టో ను విడుదల చేసింది.

16.అమరావతి ఉద్యమం


ఏపీ రాజధాని అమరావతిని కొనసాగించాలని కో రుతూ రైతులు , మహిళలు చేపట్టిన ఉద్యమం నేటికి 342 రోజుకు చేరుకుంది.

17.తిరుమలకు రాష్ట్రపతి


తిరుమల శ్రీవారిని దర్శించుకునే నిమిత్తం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం తిరుమలకు రాబోతున్నారు.

18.ఈరోజు బంగారం ధరలు


22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,100.

24 కేరట్ల పది గ్రాముల బంగారం ధర 51,380.

19.తమిళనాడులో తెలుగు జర్నలిస్ట్ హత్య


తమిళ్ దిన పత్రికలో రిపోర్టర్ గా పని చేస్తున్న నాగరాజు అనే వ్యక్తిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో నరికి చంపారు.మృతుడిది ఏపీ లోని చిత్తూరు జిల్లా కుప్పం గా పోలీసులు పేర్కొన్నారు.

20 .కరోనా తో ఒడిశా గవర్నర్ భార్య మృతి


ఒడిశా గవర్నర్ గణేశీ లాల్ సతీమణి సుశీలాదేవి కరోనా వైరస్ ప్రభావంతో కన్ను మూసారు.ఈ విషయాన్ని గవర్నర్ కార్యాలయం వెల్లడించింది.

#DigitalScreen #AP IAS #TelanganaCorona #Samantha #RBI In Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు