1.తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు
రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి.ఈ వైరస్ పాతదే అయినప్పటికీ కరోనా సమయంలో తీవ్ర రూపం దాల్చడం తో జనాల్లో ఆందోళన నెలకొంది.
2.సోనుసూద్ సాయం కోరుతూ నెల్లూరు జిల్లా కలెక్టర్ లేఖ

నెల్లూరు జిల్లా లో ఆక్సిజన్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని, వారిని ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు రాసిన లేఖకు సోను సూద్ స్పందించారు.రెండు రోజుల్లో ఆక్సిజన్ జనరేటర్ సమకూర్చి ఇస్తానంటూ హామీ ఇచ్చారు.
3.హీరో రామ్ ఇంట విషాదం
టాలీవుడ్ హీరో రామ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది అనారోగ్యంతో రామ్ తాతయ్య మంగళవారం మృతి చెందారు.
4.టి ఎస్ ఈసెట్ దరఖాస్తు గడువు పెంపు
టిఎస్ ఈసెట్ 2021 దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది.అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువును ఈ నెల 24వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా పెంచారు.
5.మే చివరి వరకే సెకండ్ వేవ్
నెల రోజులుగా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ ప్రభావం క్రమ క్రమంగా తగ్గుతోందని ముంబై ప్రొఫెసర్లు చెబుతున్నారు .మే చివరి నాటికి ఈ వైరస్ ప్రభావం క్రమ క్రమంగా తగ్గుతుంది అని ప్రొఫెసర్ల బృందంలోని మునేంద్ర అగర్వాల్ పేర్కొన్నారు.
6.ఈటెల పై గంగుల సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.వెంట్రుక కూడా పీకలేవ్ అంటూ ఈటెలను ఉద్దేశించి గంగుల వ్యాఖ్యానించారు.
7.కరోనా, బ్లాక్ ఫంగస్ పై మంత్రి హరీష్ సమీక్ష
కరోనా, బ్లాక్ ఫంగస్ పై మంత్రి హరీష్ రావు, సోమేష్ కుమార్, బి ఆర్ కే భవన్ లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
8.వర్సిటీల్లో అసిస్టెంట్ పోస్టులకు గడువు పెంపు
తెలంగాణలోని వ్యవసాయ, వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో సీనియర్ ,జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువును టి ఎస్ పి ఎస్ సి పొడిగించింది.ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది.
9.మత్స్యకారుల భరోసా నిధులు విడుదల
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నిధులను జగన్ విడుదల చేశారు.మత్స్యకారుల ఖాతాల్లోకి నేరుగా పదివేలు చొప్పున నగదుని వారి ఖాతాల్లో జమ చేశారు.
10.ఎంసెట్ దరఖాస్తుల గడువు 26 వరకు పెంపు
ఇంజనీరింగ్ తో పాటు, అగ్రికల్చర్ వెటర్నరీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంసెట్ పరీక్ష దరఖాస్తు గడువు ఈనెల 26 వరకు పొడిగించారు.
11.భద్రాద్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరుణ రోగుల కోసం 70 లక్షల రూపాయల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు.
12.సింగపూర్ లో స్కూల్స్ బంద్

కరోనా కొత్త ట్రైన్ టు పిల్లలు ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది.బుధవారం నుంచి అక్కడ స్కూళ్లు, జూనియర్ కళాశాలను మూసివేయాలని నిర్ణయించింది.
13.లాక్ డౌన్ పై యడ్యూరప్ప ప్రకటన
ఈనెల 24 తర్వాత కూడా కర్ణాటక లో లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నట్లు ముఖ్యమంత్రి యడ్యూరప్ప సంకేతాలు ఇచ్చారు.
14.ఎంపీ రఘురామ కు వైద్య పరీక్షలు ప్రారంభం
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి లో ఎంపీ రఘురామకృష్ణంరాజు కు వైద్య పరీక్షలు ప్రారంభం అయ్యాయి.
15.నేడు , రేపు టీటీడీ ఉద్యోగులకు రెండో డోసు
టిటిడి ఉద్యోగులకు రెండు రోజులపాటు రెండోరోజు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.నేడు, రేపు ఈ వాక్సిన్ వేయనున్నారు.
16.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,63,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
17.విశ్వ సుందరిగా ఆండ్రియా మోజా

మెక్సికో కి చెందిన ఆండ్రియా మొజా 2020 ఏడాదికి మిస్ యూనివర్స్ గా ఎంపికయ్యింది.
18.ప్లాస్మా తెరఫి నిలిపివేత
కరోనా ట్రీట్మెంట్ లో ప్లాస్మా తెరఫీ ని కేంద్ర ప్రభుత్వం సోమవారం తొలగించింది.
19.20 న విజయన్ ప్రమాణ స్వీకారం
కేరళలో రెండోసారి విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ కేబినెట్ ఈ నెల 20 న ప్రమాణ స్వీకారం చేయబోతోంది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,640
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,640.