న్యూస్ రౌండప్ టాప్ - 20 

1.తెలంగాణ ఏపీ మధ్య వాహన రాకపోకలపై ఆంక్షలు

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలు పై అధికారులు ఆంక్షలు విధించారు.మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News May 05 2021-TeluguStop.com

2.ఏపీలో కొత్త సమాచార కమిషనర్ల నియామకం

ఆంధ్ర ప్రదేశ్ సమాచార కమిషనర్లుగా హరి ప్రసాద్ రెడ్డి , చెన్నారెడ్డి నియమితులయ్యారు.

3.కేంద్ర సిబ్బందికి వర్క్ ఫ్రం హోం

కేంద్ర విభాగాల్లో పని చేసే సిబ్బంది పని వేళలు, హాజరు కు సంబంధించి గత నెలలో విడుదల చేసిన మార్గదర్శకాల మే నెలాఖరు వరకు అమల్లో ఉంటాయని కేంద్రం వెల్లడించింది.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News May 05 2021-న్యూస్ రౌండప్ టాప్ – 20 -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల పై హైకోర్టులో విచారణ ప్రారంభం అయ్యింది.

5.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 6,361 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

6.పెద్ద పులి సంచారం

తెలంగాణలోని కొమరం భీమ్ జిల్లాలోని దహెగం మండలం , దిగిడ పెంచికల్ పేట మండలాల పరిదిలోని కమ్మర్ గాం అట

వీ

ప్రాంతంలో పెద్ద పులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది.

7.జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం లో దర్శనాలు రద్దు

జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం లో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

8.ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ

నేటి నుంచి  ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతోంది.ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.

9.ఏపీలో ముందస్తు బస్ టికెట్ రిజర్వేషన్ సదుపాయం రద్దు

ఏపీలో కర్ఫ్యూ కారణంగా ఆర్టీసీ అధికారులు పలు చర్యలు చేపట్టారు .బస్సులో ముందస్తు టికెట్ రిజర్వేషన్ సదుపాయం ని రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

10.జువారి సిమెంట్ కంపెనీ మూసివేత ఆదేశాలను కొట్టేసిన ఏపీ హైకోర్టు

కడప జువారి సిమెంట్ కంపెనీ మూసివేత ఆదేశాలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

11.ఏపీపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు : లోకేష్

ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న ఆన్ లైన్ పరీక్షలు అభ్యర్థులకు న్యాయం జరిగేలా వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.

12.  ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ ను కలిసిన స్టాలిన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ చెన్నైలోని రాజ్ భవన్ లో గవర్నర్ భన్వారీలాల్  ఫురోహిత్ ను కలుసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు.

13.కర్ణాటకలో కరోనా విజృంభణ

 కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి తీవ్రం అవుతున్నాయి.మంగళవారం కర్ణాటక వ్యాప్తంగా 44,631 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

14.జేఈఈ మెయిన్స్ వాయిదా

ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాల కోసం మే 24 నుంచి 28 వరకు జరగాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.

15.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,82,315 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

16.గాంధీజీ వ్యక్తిగత కార్యదర్శి కళ్యాణం మృతి

జాతిపిత మహాత్మా గాంధీ కి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన తమిళనాడుకు చెందిన వి.కల్యాణం (99) వృద్ధాప్య సమస్యలతో మృతిచెందారు.

17.రాకేష్ మాస్టర్ పై కేసు నమోదు

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియా లో ఎక్కువ ప్రచారంలో ఉండే కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకృష్ణుడు పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తో

యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్

  తదితరుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయ్యింది.

18.ఒకే కాన్పు లో 9 మంది జననం

పశ్చిమ ఆఫ్రికా లోని మాలి లో అధ్బుతం చోటు చేసుకుంది.ఓ మహిళ ఒకే కాన్పులో 9 మంది శిశువులకు జన్మనిచ్చింది.

19.సిఎం గా ప్రమాణ స్వీకారం చేసిన మమత

పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 44,580

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,580.

#CovidCases #MamataBanerjee #APAnd #Today Gold Rate

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు