న్యూస్ రౌండప్ టాప్ 20

1.వీడని ఏ2 పులి భయం

 కొమరం భీం జిల్లా లోని పెంచికల్ పేట , బెజ్జూరు, దహేగాం ప్రాంతాల్లో యథేచ్ఛగా ఏ 2 పులి సంచరిస్తుండడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.మొత్తం ఈ ప్రాంతంలో 6 పులుల సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News March 07 2021-TeluguStop.com

2.మహిళలకు యశోద ఆసుపత్రి ప్రత్యేక ప్యాకేజీ

ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన మహిళా పోలీసులు, వైద్యులకు ‘ మహిళా సంరక్షణ ప్రత్యేక ప్యాకేజీని ‘ యశోద ఆసుపత్రి ప్రకటించింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 5,210 విలువ గల ఆరోగ్య పరీక్షలను ఉచితంగా అందిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.మిగతా మహిళలందరికీ ఈ పథకంలో 999 కి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నట్లు చెప్పారు.

3.రైతు సమస్యలకు టోల్ ఫ్రీ నెంబర్

వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులు సందేహాలు నివృత్తి చేసుకునేందుకు గుంటూరు ‘ఆత్మ ప్రాజెక్ట్ ‘ ప్రధాన కార్యాలయంలో సమీకృత రైతు సమాచార కేంద్రాన్ని ‘ 155251 ‘ టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేశారు.చీడపీడల ఫొటోలను వాట్సప్ నెంబర్లు 83310100%28, 149, 154 కు పంపవచ్చు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News March 07 2021-న్యూస్ రౌండప్ టాప్ 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.ఏపీ లో కరోనా

గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 115 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

5.టీకా వేయించుకున్న మోహన్ భగవత్

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సంఘ్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషి ఈరోజు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.

6.11 న కుంభమేళాలో తొలి పుణ్యస్నానాలు

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళాలు మార్చి 11న పుణ్యస్నానాలు జరగనున్నాయి.

7.రెండో టీకా డోసు తీసుకున్న వైద్యుడికి కరోనా

రెండో కరోనా టీకా డోసు తీసుకున్న కొద్ది రోజులకు గుజరాత్ వైద్యాధికారి బారిన పడ్డారు.

8.కరోనా కలకలం రంగంలోకి కేంద్ర బృందాలు

పంజాబ్ మహారాష్ట్రలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది ఈ మేరకు ఈ రెండు రాష్ట్రాలకు కేంద్ర బృందాలు తరలి వెళ్ళాయి.

9.మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి మృతి

మహబూబ్ నగర్ జిల్లా అమరచింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కన్నుమూశారు.గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

10.మహాశివరాత్రికి 3,777 ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలోని 98 శైవ క్షేత్రాలకు మొత్తం 3777 ప్రత్యేక బస్సులను నడపనుంది.

11.వారంలో పది లక్షల మందికి కరోనా

గత వారం రోజుల్లో ఐరోపా వ్యాప్తంగా పది లక్షల మంది కరోనా వైరస్ బారిన పడినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యుహెచ్వో ప్రకటించింది.

12.తెలంగాణ లో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 158 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

13.సైకిల్ పై ఎన్నికల ప్రచారం

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లా అంతటా సైకిల్ పై ఎన్నికల ప్రచారాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రారంభించారు.

14.డీఎంకే కాంగ్రెస్ మధ్య పొత్తు

ఏప్రిల్ 6వ తేదీన తమిళనాడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డి.ఎం.కె ,కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.

15.షర్మిల అనుచరుల ఆందోళన

హైదరాబాద్ లోని పంజాగుట్ట వైఎస్ఆర్ విగ్రహం వద్ద షర్మిల అనుచరులు ఆందోళనకు దిగారు.ఖమ్మం లో విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని షర్మిల ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు.

16.కారుణ్య నియామకాలపై హై కోర్టు కీలక తీర్పు

వివాహమైన కుమార్తె కారుణ్య నియామకం కి అర్హురాలే అని ఏపీ హైకోర్టు ఓ కేసులో తీర్పు ఇచ్చింది.

17.వైసీపీ టీడీపీ లతో పొత్తు లేదు

మున్సిపల్ ఎన్నికల్లో తమకు వైసీపీ , టీడీపీ లతో పొత్తు లేదని , సిపిఐ తో కూడా పొత్తు లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు.

18.పశ్చిమ బెంగాల్ సీఎం అభ్యర్ధిగా మిథున్ చక్రవర్తి

పశ్చిమ బెంగాల్ లో బిజెపి సీఎం అభ్యర్థిగా బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని ప్రకటించేందుకు బిజెపి సిద్ధమవుతున్నట్లు సమాచారం.ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీలో మిధున్ చక్రవర్తి పాల్గొని బీజేపీలో చేరనున్నారు.

19.మూడు పొరల మాస్క్ తోనే వైరస్ కట్టడి

మూడు వందల మార్పులే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం లోని భారతీయ విజ్ఞాన సంస్థ (  ఐఐఏస్సీ) వెల్లడించింది.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 41,710

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,500.

#Corona Cases #Top20 Headlines #Gold Rates #APAnd

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు