న్యూస్ రౌండప్ టాప్ 20

1.న్యూజిలాండ్ లో భూకంపం సునామీ హెచ్చరిక జారీ

న్యూజిలాండ్ లో భారి భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.2 గా నమోదైంది.న్యూజిలాండ్ తీరప్రాంతం నగరం గిస్ బార్న్ కు ఈశాన్యాన 180 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News March 05 2021-TeluguStop.com

2.ఫ్రీ వాక్సిన్ ప్రారంభించిన రిలయన్స్

రిలయన్స్ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత కరోనా వ్యాక్సిన్ అందించేందుకు రిలయన్స్ యాజమాన్యం సిద్దమని నితా అంబానీ ప్రకటించారు.

3.కూలిన ఆర్మీ హెలికాప్టర్ : 11 మంది మృతి

ప్రమాదవశాత్తు మిలటరీ హెలికాప్టర్ కూలిన ఘటనలో 11 మంది మృత్యువాత పడిన సంఘటన టర్కీ లో చోటు చేసుకుంది.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News March 05 2021-న్యూస్ రౌండప్ టాప్ 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.జగిత్యాలలో కొత్తరకం కరోనా

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కొత్తరకం కరుణ లక్షణాలు బయటపడ్డాయి.

దీంతో అతడిని జిల్లా వైద్య అధకారులు హైదరాబాద్ కు తరలించారు.బాధితుడు కొన్ని రోజుల క్రితం గల్ఫ్ నుండి వచ్చారు.

5.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,838 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

6.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా కొత్తగా 166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

7.దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ అరెస్ట్

సిద్దిపేట జిల్లాలోని ఏటిగడ్డ కృష్ణాపూర్ కు వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ను మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్ద అరెస్టు చేశారు.

8.బాసర లో నారా దేవాన్ష్ కు అక్షరాభ్యాసం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి ల కుమారుడు నారా దేవాన్ష్ కు  ఈరోజు బాసరలో అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేశారు.

9.హైదరాబాద్ మెట్రో కు జాతీయ అవార్డు

ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా 2020 సంవత్సరానికి ప్రకటించిన అవార్డుల్లో సోషల్ మీడియా ఫర్ పిఆర్ అండ్ బ్రాండింగ్ విభాగం లో హైదరాబాద్ మెట్రో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది.

10.తెలంగాణ గవర్నర్ కు అవార్డు

తెలంగాణ గవర్నర్ పుదుచ్చేరి ఇన్చార్జి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళ సై సౌందరరాజన్ ప్రతిష్టాత్మక గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్స్ లెన్స్ అవార్డు 2021 కి ఎంపికయ్యారు.

11.విజయవాడ టిడీపి మేయర్ అభ్యర్ధిగా శ్వేత

విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేసినేని శ్వేత ను తమ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.

12.పిక్కి అవార్డుల ప్రధానం

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 7వ తేదీన చౌమోహల్లా ప్యాలెస్ లో వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు పిక్కి అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని పిక్కి ఎఫ్ఎల్ఓ  జాతీయ మాజీ అధ్యక్షురాలు పింకి రెడ్డి తెలిపారు.

13.నేటి నుంచి ఆన్ లైన్ లో భద్రాద్రి ‘ నవమి ‘ టిక్కెట్లు

భద్రాచలంలో ఏప్రిల్ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలి అనుకునే భక్తులకు శుక్రవారం నుంచి ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి తెలిపారు.

14.వరంగల్ అభిమానులతో 10 న షర్మిల భేటీ

ఈనెల 10న ఉమ్మడి వరంగల్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో షర్మిల సమావేశం కానున్నారు.

15.కె ఏ పాల్ చిత్రపటానికి పాలాభిషేకం

కూర్మన్నపాలెం జంక్షన్ దగ్గర కె ఏ పాల్ చిత్రపటానికి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్ వేశారు.దీంతో సంతోషించిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

16.నేడు ఆదోని కర్నూలు లో ఎంఐఎం నేత అసదుద్దీన్ పర్యటన

నేడు ఆదోని కర్నూలు లో ఎంఐఎం నేత అసదుద్దీన్ పర్యటించనున్నారు.

17.అమరావతిలో 140 మంది ఉద్యోగులకు కరోనా

అమరావతి జిల్లాలో covid-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.అమరావతి జిల్లా మెజిస్ట్రేట్, మున్సిపాలిటీ కార్యాలయాల్లో 140 మందికి కరోనా వైరస్ సోకింది.

18.మూడు కాళ్ల శిశువు జననం

ఏపీ లోని నూజివీడు ఏరియా ఆస్పత్రిలో గురువారం మూడు కాళ్ళ ఆడ శిశువు జన్మించింది.జన్యులోపం కారణంగా శిశువుల జన్మించిందని, బిడ్డ ఆరోగ్యంగా ఉందని, వైద్య చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి పంపించామని ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేందర్ సింగ్ తెలిపారు.

19.విశాఖలో నేడు, రేపు చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు రేపు విశాఖలో పర్యటించనున్నారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 43,890

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,890

.

#YS Sharmila #APAnd #CovidCases #Today Gold Rate

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు