న్యూస్ రౌండప్ టాప్ 20

1.నేటి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు

కరుణ కారణంగా నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైలు హైదరాబాదులో ఈరోజు పట్టాలు ఎక్కనున్నాయి.121 సర్వీసులకు గాను 10 సర్వీసులకు దక్షిణ మధ్య రైల్వే అనుమతులు ఇచ్చింది.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News June 23 2021-TeluguStop.com

2.18 న గురుకుల సెట్

బీసీ సంగీత గిరిజన ఇతర కులాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు సంబంధించిన వీటీజి సెట్ – 2021 జూలై 18 న జరగనుంది.

3.నేటి నుంచి అంబేద్కర్ వర్సిటీలో ప్రవేశాలు

అండర్ గ్రాడ్యుయేట్ లో బి.ఎ , బికాం, బిఎస్సి తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సి, ఎంబీఏ, పలు డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆగస్టు 12 వరకు ప్రవేశాలు పొందవచ్చునని పూర్తి వివరాలు వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని ఒక ప్రకటనలో వర్సిటీ అధికారులు తెలిపారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News June 23 2021-న్యూస్ రౌండప్ టాప్ 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.జగన్ అక్రమాస్తుల కేసు విచారణ

జగన్ అక్రమాస్తులు కు సంబంధించిన కేసులపై విచారణను సిబిఐ ఈడి ప్రత్యేక కోర్టు జూలై 2 కు వాయిదా వేసింది.

5.కరోనా తో మరణిస్తే ఈఎస్ఐ పెన్షన్

కరోనా తో మృతి చెందిన చందాదారుల కుటుంబాలను ఆదుకునేందుకు కువైట్ ఉపశమ పథకాన్ని కేంద్రం ప్రకటించింది ఈ ఎస్ ఐ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం తెలిపింది.మృతుల కుటుంబ సభ్యులకు ఈఎస్ఐ పెన్షన్ వస్తుందని, 2020 మార్చి 24 నుంచి రెండేళ్ల పాటు వర్తిస్తుందని పేర్కొంది.మరణించిన ఉద్యోగి సగటు వేతనం 90శాతం పెన్షన్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు పేర్కొంది.

6.వాక్సిన్ కు పిఎన్జి విరాళం 5 కోట్లు

తెలంగాణ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ( పి అండ్ జి ) రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు కోట్లు విరాళం అందించింది.

7.సీమ ప్రాజెక్టు పై కేంద్రానికి ఫిర్యాదు

ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ప్రాజెక్టు పై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది.

8.త్వరలోనే భారత్ తో ఫైజర్ ఒప్పందం

భారత్ కు కరోనా వ్యాక్సిన్ విక్రయించే ఒప్పందం పై చర్చలు తుదిదశకు చేరాయని అమెరికా ఫార్మా దిగ్గజం ‘ ఫైజర్ ‘ తెలిపింది.

9.ఆర్టీసీ ఉద్యోగులకు వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్

 ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.

10.స్పోర్ట్స్ వర్సిటీ వీసీ గా కరణం మల్లేశ్వరి

పద్మశ్రీ కరణం మల్లేశ్వరి ని ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కేంద్రం నియమించింది.

11.స్త్రీనిధి రుణాలపై వడ్డీ మాఫీ కి ఆధార్

స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు పొందిన మహిళా స్వయం సహాయక సంఘాలు వడ్డీ రాయితీ పొందడానికి బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ ను అనుసంధానం చేయాలని తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.

12.ధరణి ద్వారా ఈసీ

ధరణి పోర్టల్ లో ఎన్ కంబరెన్స్ సర్టిఫికేట్ పొందే ఆప్షన్ వచ్చింది.ఈ సేవలు మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు.

13.మత్స్యకారుల కుటుంబాలకు ఆరు లక్షలు

మరణించిన మత్స్యకార కుటుంబాలకు ఆరు లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారని దానికి అనుగుణంగా నూతన విధానాన్ని రూపొందించాలని మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.

14 ఏపీకి కరోనా డోసులు

ఏపీకి మరో 4.12 లక్షల కోవిడ్ టీకా డోసులు కేటాయించారు.వీటిలో 3.12 లక్షల కోవి షీల్డ్ డోసులు మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్నాయి.

15.ఆరు జిల్లాల్లో డెల్టా వేరియంట్

మహారాష్ట్రలోని రత్నగిరి, జలగావ్ జిల్లా లు, కేరళలోని పాలక్కడ్ , పాతనంతిట్ట జిల్లాలు , మధ్యప్రదేశ్ లోని భోపాల్, శివపురి జిల్లాల నుంచి సేకరించిన శాంపిల్స్ లో డెల్టా వేరియంట్ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

16.అచ్చెన్నాయుడు సోదరుడు అనుచరులపై రౌడీషీట్

టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోదరుడు కింజారపు హరి వరప్రసాద్, ప్రసాద్ కుమారుడు కింజారపు సురేష్, అనుచరుడు కింజరపు కృష్ణమూర్తి పై రౌడీ షీట్ నమోదు చేసినట్లు టెక్కిలి సిఐ నీలయ్య తెలిపారు.తెలిపారు.

17.30 న ఏపీ కేబినెట్ భేటీ

ఏపీ మంత్రివర్గ సమావేశం ఈనెల 30న సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఉదయం 11 గంటలకు సచివాలయ తొలి భవనంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

18.గ్రామ సచివాలయాల్లోనూ ఆధార్ సేవలు

ఆధార్ నమోదు మార్పుచేర్పులు వంటి సేవలు గ్రామ సచివాలయంలో కూడా అందుబాటులో ఉండనున్నాయి.ఈ సేవలను వచ్చేనెల రెండోవారంలో జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.మొదటగా 500 గ్రామ సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు.

19.టెన్త్ ఇంటర్ పరీక్షల పై ఏపీ మంత్రి స్పందన

ఏపీ లో టెన్త్ ఇంటర్ మీడియట్ పరీక్షలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తప్పక పాటిస్తూ,  నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,120

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,120

.

#MMTSTrains #CoronaCases #Pfizer #APAnd #Atchennaidu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు