న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజీనామా

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News June 12 2021-TeluguStop.com

2.యాదాద్రికి సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు యాదాద్రి ని సందర్శించనున్నారు.యాదాద్రి పనుల పురోగతిని ఆయన పరిశీలించనున్నారు.

3.నేడు రేపు భారీ వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News June 12 2021-న్యూస్ రౌండప్ టాప్ 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.నేడు జగిత్యాలకు ఎల్.రమణ

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ఈరోజు జగిత్యాలకు వెళ్లనున్నారు.పార్టీ మార్పు విషయమై తన శ్రేయోభిలాషులతో ఆయన చర్చించనున్నారు.

5.డ్రోన్ల ద్వారా మందులు టీకాల పంపిణీ

తెలంగాణలో ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్డ్ ప్రయోగానికి సిద్ధమైంది.మెడిసిన్స్ ప్రమ్ ది స్కై పేరుతో డ్రోన్ల ద్వారా ఔషధాలు గమ్యస్థానాలకు చేర్చనుంది.

6.జర్నలిస్టు రఘు అరెస్టుపై కలెక్టర్ కు నోటీసులు

జర్నలిస్టు రఘు అరెస్టుపై జాతీయ బీసీ కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రాచకొండ సీపీ మహేష్ భగవత్ జిల్లా కలెక్టర్ ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది.

7.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 1,707 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

8.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 84,332 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

9.జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ వాయిదా

జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో అరబిందో ఫార్మా , హెటెరో సంస్థలపై దాఖలైన కేసు విచారణ జూన్ 22 కి వాయిదా పడింది.

10.కృష్ణా బోర్డు చైర్మన్ గా ఎంపీ సింగ్

కృష్ణా బోర్డు చైర్మన్ గా ఎంపీ సింగ్ ను నియమించారు.ఈ మేరకు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఏకే దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

11.బీజేపీ లోకి రమేష్ రాథోడ్

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాధోడ్ బిజెపిలో చేరే అవకాశం ఉంది.

12.జగన్ కు మరో లేఖ రాసిన రఘు రామ

వైయస్సార్ పెళ్లి కానుక, షాది ముబారక్ పథకాలపై ఏపీ సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు.

13.కొనసాగుతున్న సిబిఐ విచారణ

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.

14.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.నిన్న స్వామివారిని 11,210 మంది భక్తులు దర్శించుకున్నారు.

15.బంగాళాఖాతంలో అల్పపీడనం

ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది.

16.26 న రైతుల రాజ్ భవన్ ముట్టడి

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 26వ తేదీన రైతులు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

17.రేపు యాదాద్రికి ఎస్ వి రమణ

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ వి రమణ రేపు యాదాద్రిలో స్వామివారిని దర్శించుకోనున్నారు.

18.రఘురామ కృష్ణంరాజు సంచలన స్టేట్మెంట్

తనపై అనర్హత వేటు వేసే అవకాశం లేదని తాను ఏ పార్టీతోనూ జట్టు కట్టలేదని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు తనకు అనర్హత వేటు వర్తించదని అన్నారు.

19.కీలక బిల్లులకు పాక్ ఆమోదం

పాక్ అధీనంలో ఉన్న భారత నావికా దళ మాజీ అధికారి కులబూషన్ జాదవ్ విడుదల పై పాక్ కీలక నిర్ణయం తీసుకుని దానికి ఆమోదముద్ర వేసింది.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,770

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,770

.

#TeluguNews #JournalistRaghu #APAnd #CoronaCases #KCR At Yadradri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు