న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఎంపీ సంతోష్ ను అభినందించిన అమితాబ్

టిఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ‘ కార్యక్రమాన్ని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News July 27 2021-TeluguStop.com

2.దళిత బంధు పై దామోదర రాజనర్సింహ స్పందన

హుజురాబాద్ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళిత బంధు ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ విమర్శించారు.

3.ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి వద్దు

ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేయవద్దని తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ ఆయా ఇంజనీరింగ్ కాలేజీలకు సూచించింది.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News July 27 2021-న్యూస్ రౌండప్ టాప్ 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.టిఆర్ఎస్ పై ఈసీకి ఫిర్యాదు

హుజురాబాద్ కు వెంటనే ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ లేఖ రాశారు.హుజూరాబాద్ లో గెలిచేందుకు అధికార పార్టీ టిఆర్ఎస్ కోట్లాది రూపాయల సొమ్ము ఖర్చు చేస్తోందని ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేశారు.

5.టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఉపరాష్ట్రపతి ప్రశంస

టిఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు.తలసేమియా బాధితుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరంలో 2,425 మంది రక్తదానం చేశారు ఈ సందర్భంగా గోపీనాథ్ ను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.

6.తెలంగాణలో బిసి ఉద్యమానికి కేంద్రమంత్రి మద్దతు

ఓబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని , జనగణనలో కులాల వారీగా గణన చేపట్టాలని ప్రధానిని కోరుతానని అప్నా దళ్  పార్టీ అధ్యక్షురాలు , కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అనుప్రియ పటేల్ హామీ ఇచ్చారని బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు విక్రం గౌడ్ తెలిపారు.

7.రైతు రుణమాఫీ ప్రతిపాదన లేదు

రైతు రుణమాఫీ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద పరిశీలనలో లేదని కేంద్రమంత్రి భగవత్ కరడ్ స్పష్టం చేశారు.

8.జగన్ కేసులో వాదనలకు సిద్ధమవ్వండి : సీబీఐ కోర్టు

జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్లలో ని అభియోగాలపై వాదనలకు సిద్ధపడాలని ప్రత్యేక కోర్టు ఏపీ సీఎం జగన్ తదితరులకు స్పష్టం చేసింది.

9.ఆగస్టు 12న రాష్ట్ర స్థాయి డాక్ అదాలత్

వచ్చే నెల 12న రాష్ట్ర స్థాయి డాగ్ నిర్వహించనున్నట్లు పోస్టల్ సర్వీస్ ల విభాగం తెలిపింది.

10.ఇంటింటికి రేషన్ అద్భుతం

ఏపీలో అమలవుతున్న ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని జైపూర్ కు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ అండ్ స్టడీస్ బృందాలు ప్రశంసించాయి.

11.వేదపండితుల నియామకం పై తెలంగాణ మంత్రి ఆరా

దేవాదాయ శాఖలో వేదపండితుల నియామకం చోటు చేసుకున్న గందరగోళం పై ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంబంధిత అధికారులను ఈ విషయమై ఆరా తీశారు.

12.అశోక్ గజపతిరాజు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

టిడిపి నేత మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పిటిషన్ పై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.తదుపరి ఈ కేసు విచారణ మంగళవారం కు వాయిదా వేసింది.

13.వివేకా హత్య కేసు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ  విచారణ 51వ రోజు కొనసాగుతోంది.

14.విద్యార్థులకు ల్యాప్ టాప్ లు

జగన్ అన్న వసతి దీవెన పథకం కింద ఆర్థిక సహాయానికి ప్రత్యామ్నాయంగా లాప్ టాప్ లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.దీనిపై ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.

15.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగుతుంది.సోమవారం తిరుమల శ్రీవారిని 16,675 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

16.ఆవు కాలుని నరికిన వ్యక్తి అరెస్ట్

చిత్తూరు జిల్లా పుత్తూరు గోసంరక్షణ లో ఉన్న నాలుగు ఆవులు సోమవారం మేత కోసం డిఎం పురం గ్రామం లోని  మామిడి తోటలో కి వెళ్ళాయి.ఈ సమయంలో తోట యజమాని గాంధీ ఆగ్రహంతో ఆవు కాలును కత్తితో నరికాడు ఈ వ్యవహారంపై గాంధీ పై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

17.తిరుపతిలో రేపు జాబ్ మేళా

తిరుపతి అర్బన్ మండలం రెవెన్యూ కార్యాలయం వెనుకున్న టీటిడిసీ శిక్షణా కేంద్రంలో బుధవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని డి ఆర్ డి ఏ పథకం సంచాలకులు డీఎంకే తులసి తెలిపారు.

18.అగ్రిగోల్డ్ బాధితులకు ఎమ్మెల్సీల మద్దతు

Telugu Agrigold Victims, Amitab Bachchan, Ap And Telangana Breaking News, Ashok Gajapathi Raju, Corona Cases, Geen India Challenge, News Roundup, Telangana Headlines, Telugu News Headlines, Tirumala Tirupati Information, Todays Gold Rate, Top20news, Viveka Murder Case, Ys Jagan Bail Petition-Latest News - Telugu

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం, వారి ఉద్యమానికి మద్దతుగా రాబోయే శాసన మండలి సమావేశాల్లో ఏడుగురు ఎమ్మెల్సీలతో కలిసి వాయిదా తీర్మానం ప్రవేశపెడతామని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వెల్లడించారు.

19.‘ఆన్లైన్ రమ్మి ‘ … 3న తుది తీర్పు

ఆన్లైన్ రమ్మీ క్రీడపై విధించిన నిషేధం తొలగించాలంట దాఖలైన కేసులో ఆగస్టు 3వ తేదీన   తుది తీర్పు వెలువరించనున్న ట్లు మద్రాసు హైకోర్టు ప్రకటించింది.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,660

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,660

#AP Telangana #Todays Gold #Amitab Bachchan #GeenIndia #Corona

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు