న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఇంజినీరింగ్ విద్యార్థులకు ‘ వీఎల్ఎస్ఐ లో శిక్షణ

ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే వీఎల్ఎస్ఐ , ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ రంగంలో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేస్ రంజన్ తెలిపారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News July 26 2021-TeluguStop.com

2.యూఏఈలో భారత వ్యాపారికి అరుదైన గౌరవం

యూఏఈలో భారత్కు చెందిన వ్యాపారవేత్త కు అరుదైన గౌరవం దక్కింది. లులూ గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసఫ్ ఆలీ, అబుదాబి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కి వైస్ చైర్మన్ గా నియామకం అయ్యారు.

3.చండూర్ లో షర్మిల నిరాహార దీక్ష

ఉద్యోగం లేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలకు చెందిన పాక శ్రీకాంత్ కుటుంబ సభ్యులను వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పరామర్శించి ఆర్థిక సహాయం చేయనున్నారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News July 26 2021-న్యూస్ రౌండప్ టాప్ 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.ఎఫ్ ఎస్ ఎల్ లో పోస్టుల భర్తీకి ప్రకటన

తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ లో  కాంట్రాక్టు పద్ధతిలో 7 సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

5.దళిత బంధు పై తొలి అవగాహన సదస్సు

నేడు దళిత బంధు పథకం పై తొలి అవగాహన సదస్సు ప్రగతి భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించారు.

6.రెండోరోజు కొనసాగుతున్న బోనాల జాతర

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర రెండో రోజు కొనసాగుతోంది.

7.బీసీల డిమాండ్లపై దేశవ్యాప్త బస్సు యాత్ర

బీసీల డిమాండ్లపై దేశవ్యాప్త ఉద్యమం చేయాలని, కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు సామాజిక సంస్కరణలు కూటమి ఆవిర్భావ సభలో అఖిలభారత బీసీ నేతలు ప్రకటించారు.

8.లక్ష మందితో పార్లమెంటును ముట్టడిస్తాం

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని లేనిపక్షంలో బీసీ సంఘాల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, లక్ష మందితో పార్లమెంట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.

9.రేషన్ పంపిణీ కి 2772 కోట్లు

రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు నెలకు 231 కోట్ల చొప్పున, ఏడాదికి 2772 కోట్ల నిధులు వెచ్చిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

10.ఓబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

జాతీయ స్థాయిలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని కేంద్ర సహాయమంత్రి అనుప్రియా పటేల్ హామీ ఇచ్చినట్లు తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జుజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

11.ఓటుకు నోటు కేసు

ఓటుకు నోటు కేసు విచారణ సోమవారం నుంచి ఆగస్టు 13 వరకు జరగనుంది ప్రతిరోజు ముగ్గురు సాక్షుల వాంగ్మూలాలు ఏసీబీ ప్రత్యేక కోర్టు నమోదు చేయనుంది.దీనిలో భాగంగానే 48 మంది సాక్షులకు సమన్లు జారీ చేసింది.

12.శంషాబాద్ – శ్రీనగర్ విమాన సర్వీసు ప్రారంభం

శంషాబాద్ నుంచి శ్రీనగర్ కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం ఉదయం 6.15 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి శ్రీనగర్ కు బయలుదేరి వెళ్ళింది.

13.వివేకా హత్య కేసు పిటిషన్ పై హైకోర్టు విచారణ

వివేకా హత్య కేసులో సునీల్ కుమార్ యాదవ్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది.

నేరం ఒప్పుకోవాలని తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారని హైకోర్టుకు సునీల్ తరఫు న్యాయవాది చెప్పారు.వీటిని సిబిఐ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు.దీనిపై తదుపరి విచారణను ఈనెల 29కి హై కోర్టు వాయిదా వేసింది.

14.జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సోమవారం సిబిఐ కోర్టులో విచారణ జరిగింది.లిఖితపూర్వక వాదనలు సమర్పించడానికి మరింత గడువు కావాలని సిబిఐ కోరడంతో ఈ కేసును 30కి వాయిదా వేశారు.

15.యడియూరప్ప రాజీనామాకు గవర్నర్ ఆమోదం

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప రాజీనామాకు మహారాష్ట్ర గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు.

16.స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్రకటన

విశాఖ స్టీల్ ప్లాంట్ పై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.

17.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది సోమవారం తిరుమల శ్రీవారిని 18,153 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

18.ఈఏపీ సెట్ కు 2.5 లక్షల దరఖాస్తులు

ఏపీలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కు దాదాపు 2.5 లక్షల దరఖాస్తులు ఆన్లైన్ లో కన్వీనర్ కార్యాలయానికి అందాయి.ఆగస్టు 19 నుంచి 25 వరకు ఈఏపీ సెట్ నిర్వహిస్తారు.

19.గోవాలో ఆగస్టు 2 వరకు కర్ఫ్యూ

గోవాలో ఆగస్టు 2 వరకు కర్ఫ్యూను పొడిగిస్తు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,870

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,870

.

#Top20News #BC Quota Bill #Shamshabad #Dalit Bandhu #APAnd

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు