న్యూస్ రౌండప్ టాప్ 20

1.నకిలీ డిఎస్పీ అరెస్ట్

కామారెడ్డి జిల్లాలో నకిలీ డిఎస్పి అవతారమెత్తి అమాయకులను మోసగిస్తున్న బీబీ పేట మండలం తుజాల్ పూర్ గ్రామానికి చెందిన నెల్లూరు స్వామి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News July 17 2021-TeluguStop.com

2.కార్పొరేట్ కు ధీటుగా గురుకులాలు

కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ గురుకులాల్లో బోధిస్తున్నాము అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

3.ఈనెల 19 నుంచి పట్టాలెక్కనున్న సాధారణ రైళ్లు

ఈ నెల 19వ తేదీ నుంచి కొత్త నెంబర్లతో సాధారణ ప్యాసింజర్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి.కరుణ కారణంగా దాదాపు పదహారు నెలలుగా ఈ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News July 17 2021-న్యూస్ రౌండప్ టాప్ 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.కొత్త మార్గాలు 8 విమాన సర్వీసులు

8 మార్గాల్లో కొత్త విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు.

5.టిడిపి కి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

 విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదంటూ ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.

6.21న అల్పపీడనం

ఈనెల 21 న వాయువ్య బంగాళాఖాతంలో,  దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

7.ఏపీలో కరోనా

గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా  81,740 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

8.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 715 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

9.రంగా వర్సిటీ శాస్త్రవేత్తలకు ఐసిఎఆర్ అవార్డు

అత్యుత్తమ గిరిజన వ్యవసాయ విధానం పై పరిశోధన సాగించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కి చెందిన డాక్టర్ టి ఎస్ ఎస్ కె పాత్రో ఆయన బృందానికి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకృతిం అలీ అహ్మద్ అవార్డు 2020 లభించింది.

10.వారంలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు

ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు వారం రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉందని ఏపీ విద్యాశాఖ అధికారులు తెలిపారు.

11.అక్రమ మైనింగ్ పై ఎన్జీటీ ఆదేశాలు

సింగరేణి అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఎన్జీటీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.పర్యావరణ అనుమతులు లేకుండా అదనపు మైనింగ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

12.టీటీడీ చైర్మన్ గా మళ్లీ సుబ్బారెడ్డే

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా మళ్లీ సుబ్బారెడ్డి నే కొనసాగిస్తున్నట్టు వైసీపీ ప్రభుత్వం తెలిపింది.

13.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 38079 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

14.పోలవరానికి 19 న జగన్

ఈ నెల 19 న ఏపీ సీఎం జగన్ పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు.

15.ప్రధానితో శరద్ పవార్ భేటీ

ప్రధాని నరేంద్ర మోడీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు.సుమారు యాభై నిమిషాల పాటు వివిధ అంశాలపై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి.

16.డీఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు

టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఒక కుమారుడు ధర్మపురి అరవింద్ బిజెపి ఎంపీ గా ఉండగా, మరో కుమారుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ లో  చేరుతుండడం పై ఆయన స్పందించారు.తన కుమారులు ఇద్దరు రెండు కళ్ళు లేని వారు ఏ పార్టీలో ఉన్న ప్రజాసేవకే అంకితం అవుతారు అంటూ వ్యాఖ్యానించారు.

17.నిరుద్యోగులకు అండగా జనసేన

నిరుద్యోగులకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.ఏపీలో నిరుద్యోగ సమస్యపై తాము పోరాడుతామని ఆయన చెప్పారు.

18.కెసిఆర్ మూడు నియోజకవర్గాలకే సీఎం

తెలంగాణ సీఎం కేసీఆర్ కేవలం మూడు నియోజకవర్గాలకు సీఎంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెసు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు చేశారు.

19.త్వరలోనే పాదయాత్ర : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా లోని గందమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి త్వరలోనే పాదయాత్ర చేపడతానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,000

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49,010

.

#JanasenaAbout #CoronaCases #Top20News #APAnd #TeluguNews

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు