న్యూస్ రౌండప్ టాప్ 20  

AP and Telangana Breaking News, Telangana Headlines, Top news, News Roundup,Andhra Pradesh Breaking News, Janasena BJP Key Meeting, Today Gold Rate, Donald Trump New Office - Telugu Andhra Pradesh Breaking News, Ap And Telangana Breaking News, Donald Trump New Office, Janasena Bjp Key Meeting, News Roundup, Telangana Headlines, Today Gold Rate, Top News

1.అడవి పందులను చంపొచ్చు

మనుషుల ప్రాణాలను తీయడమే కాకుండా, పంటలను నాశనం చేస్తున్న అడవి పందులను చంపేందుకు ప్రభుత్వ నిబంధనలను సడలించింది.అడవి పందులను అవసరం మేరకు చంపేందుకు గ్రామ సర్పంచులకు అధికారం కట్టబెట్టింది.

TeluguStop.com - Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News January 27 2021

2.తెలంగాణలో కరోనా

వచ్చిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

3.ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు.

TeluguStop.com - న్యూస్ రౌండప్ టాప్ 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

4.ప్రభుత్వ ఉద్యోగులకు టీకా

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు 63.6 శాతం మంది మాత్రమే టీకా తీసుకున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.

5.మరో ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలకు అస్వస్థత

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మరో ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలు అస్వస్థతకు గురయ్యారు.

6.నేడు శశికళ విడుదల

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చిలి శశికళ నేడు జైలు నుంచి విడుదల అవుతున్నారు.

7.వ్యర్థాల రవాణా వాహనాలకు జిపిఎస్

తెలంగాణలోని పట్టణాల్లో వ్యర్థాలను రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు.

8.ఎస్ ఈ సీ వీడియో కాన్ఫరెన్స్

ఏపీలో సాంగ్స్ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్రంలోని ముఖ్య శాఖల అధికారులతో ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫిరెన్స్ సమావేశం నిర్వహించారు.

9.బీజేపీ జనసేన కీలక సమావేశం

విజయవాడలోని ఏపీ బీజేపీ కార్యాలయంలో  జనసేన బీజేపీ కీలక నాయకుల సమావేశం నిర్వహిస్తున్నారు.

10.ఏపీలో అన్నిచోట్ల పోటీ చేస్తాం : జనసేన

ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల  ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేస్తామని జనసేన పార్టీ ప్రకటించింది.

11.గవర్నర్ తో ఎస్ఈసీ భేటీ

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ భేటీ అయ్యారు.

12.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,689 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

13.విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ

రాజస్థాన్ లో శరవేగంగా బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది.తాజాగా ఒకేసారి 90 పక్షులు కరోనాతో మృతి చెందాయి.

14.కరోనా తో మంత్రి మృతి

కొలంబియాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది.తాజాగా కొలంబియా రక్షణ శాఖ మంత్రి కార్లోస్ హోమ్స్ కరోనా తో మృతి చెందినట్టు ఆ దేశ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

15.ట్రంప్ కొత్త కార్యాలయం ఏర్పాటు

అమెరికా ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చే క్రమంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

16.తెలంగాణ పి ఆర్ సి కమిటీ రిపోర్టు విడుదల

తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం రిపోర్ట్ బుధవారం విడుదలయ్యింది.

17.కొవ్వలిలో వింత వ్యాధి

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వలి లో వింత వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి.దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

18.ఢిల్లీ అల్లర్ల పై ఐక్య రాజ్య సమితి స్పందన

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు చేపట్టిన దీక్ష ఉద్రిక్తంగా మారడంపై ఐక్యరాజ్య సమితి స్పందించింది.శాంతియుత , అహింసా మార్గంలో చేపట్టే దీక్షలను గౌరవించాలని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.

19.ఎన్నికల రద్దు పిటిషన్ పై హోం శాఖ  విచారణ

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.అయితే అంతకుముందే దీనిపై పిటిషన్ దాఖలు కావడంతో రేపు దీనిపై విచారణ జరగనుంది.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,000

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,000.

#DonaldTrump #JanasenaBJP #AndhraPradesh #APAnd #Today Gold Rate

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు