న్యూస్ రౌండప్ టాప్ - 20- Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News January 24 2021

Andhra and Telangana Breaking News, Telangana Headlines, Paritala Ravi, Today Gold rate, Today Top20, Today Top News,Breaking News - Telugu Andhra And Telangana Breaking News, Breaking News, Paritala Ravi, Telangana Headlines, Today Gold Rate, Today Top News, Today Top20

1.చిరుత కలకలం

కొమరం భీమ్ జిల్లా లో చిరుతపులి సంచారం ఆందోళన కలిగిస్తోంది.తాజాగా సిర్పూర్ అడవి ప్రాంతంలో చిరుత పులి కదలికలపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News January 24 2021-TeluguStop.com

2.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 197 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

3.ఉపకార వేతనాలకు గడువు పెంపు

కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువును పొడిగించారు.అర్హులైన అభ్యర్థులు ఈ నెల 31 వరకు వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అని ఇంటర్ బోర్డ్ తెలిపింది.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News January 24 2021-న్యూస్ రౌండప్ టాప్ – 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.బెయిల్ పై అఖిలప్రియ విడుదల

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పై విడుదలయ్యారు .

5.బీజేపీ రథయాత్ర

పశ్చిమ బెంగాల్ లో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో రథయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు.

6.డేటింగ్ యాప్ లపై ఇంటర్ పోల్ హెచ్చరిక

ఆన్లైన్ డేటింగ్ యాప్ లపై అప్రమత్తంగా ఉండాలని ఇంటర్ పోల్ 194 దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది.

7.రేపు ఓటర్ల దినోత్సవం

భారత ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో రేపు 11 వ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుగనుంది.

8.డీఎంకే ఎంపీ ల సమావేశం

ఈనెల 26న డీఎంకే ఎంపీల సమావేశం ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ ఆధ్వర్యంలో 26 వ తేదీన జరగబోతున్న విషయాన్ని ఆ పార్టీ కార్యాలయం తెలిపింది.

9.తగ్గుముఖం పట్టిన వింత వ్యాధి కేసులు

పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల ప్రభలిన వింత వ్యాధి కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి.

10.గవర్నర్ విరాళం

అయోధ్య రామమందిర నిర్మాణానికి ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ విరాళం ఇచ్చారు.

11.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,849 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

12.చైనా యాప్స్ పై నిషేధం పొడిగింపు

టిక్ టాక్ తో పాటు మరికొన్ని చైనా యాప్స్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని మరికొంతకాలం పాటు పొడిగించారు.

13.మొబైల్ ఫోన్ల లో ఓటర్ కార్డులు

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి ఈ ఎపిక్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.ఇకపై మొబైల్ ఫోన్ లలోనే ఓటర్ కార్డులు డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

14.కొట్టుకున్న బీజేపీ టీఆర్ఎస్ నేతలు

కరీంనగర్ లో బీజేపీ టీఆర్ఎస్ నేతలు మధ్య ఘర్షణ కొట్టుకునే వరకు వెళ్ళింది.బండి సంజయ్ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేసే క్రమంలో ఈ ఘర్షణ నెలకొంది.

15.వరుణ్ నటాశాల వివాహం నేడు

వరుసగా వాయిదాలు పడుతూ వచ్చిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ వివాహం నేడు నటాషా తో జరగనుంది.

16.క్షీణిస్తున్న లాలూ ఆరోగ్యం

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది.దీంతో ఆయనను ఢిల్లీ లోని ఎయిమ్స్ కి తరలించారు.

17.రాజధాని ఉద్యమంలో ఆగిన మరో గుండె

ఏపీ రాజధాని గా అమరావతిని కొనసాగించాలని చేస్తున్న ఉద్యమం లో మరో గుండె ఆగింది.మంగళగిరి మండలం నీరు కొండ కు చెందిన నన్నపనేని అప్పారావు ( 65) గుండె పోటుతో  మృతి చెందారు.

18.నేడు పరిటాల రవి వర్ధంతి

మాజీ మంత్రి టీడీపీ కీలక నేత పరిటాల రవి 16 వ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా, రామగిరి మండలం వెంకటాపురం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు.

19.మరో ఏడు రాష్ట్రాల్లో కోవిడ్ వాక్సిన్

ఛత్తీస్ ఘడ్, గుజరాత్, జార్కండ్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, తదితర రాష్ట్రాల్లో కోవిడ్ వాక్సిన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,940

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 50,120

.

#Today Top News #Today Top20 #Paritala Ravi #AndhraAnd #Today Gold Rate

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు