న్యూస్ రౌండప్ టాప్ 20

1.నేటి నుంచి సిపిఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలు

భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సీపీఐఎం) తెలంగాణ రాష్ట్ర మహాసభలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold Rate, Corona Cases, Ap, Monkey Fever, Karnataka,somu Veerraju, Cm Jagan, Ttd,arun Singh, Hyderabad, Yellow Alert-TeluguStop.com

2.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,33,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

3.మూడో రోజుకు చేరుకున్న ఫీవర్ సర్వే

తెలంగాణలో చేపట్టిన ఫీవర్ సర్వే నేటికి మూడో రోజుకు చేరుకుంది.

 Telangana Headlines, News Roundup, Top20News, Telugu News Headlines, Todays Gold Rate, Corona Cases, AP, Monkey Fever, Karnataka,Somu Veerraju, CM Jagan, TTD,Arun Singh, Hyderabad, Yellow Alert -న్యూస్ రౌండప్ టాప్ 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.‘ అఖండ ‘ పై ట్రాఫిక్ పోలీసులు ప్రశంసలు

అఖండ సినిమా ద్వారా రోడ్డు భద్రత ప్రోత్సహించినందుకు హీరో నందమూరి బాలకృష్ణ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను తో పాటు,  సినిమా టీమ్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

5.ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు పెడుతున్నారు : చాడా

ఏడున్నరెళ్ళ బిజెపి పాలనలో కార్పొరేట్లకు పెద్దపీట వేశారని,  ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై రాజద్రోహం కేసులు పెడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరడ్డి విమర్శించారు .

6.కర్ణాటకలో మంకీ ఫీవర్

కర్ణాటకలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది.కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో అరుదైన మంకీ ఫీవర్ కేసు బయటపడింది.

7.మార్చి నెలాఖరు నుంచి ఐపీఎల్ 15

ఐపీఎల్ 15 సీజన్ ఈ ఏడాది మార్చి నెలాఖరు నుంచి ప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.

8.తెలంగాణకు మరో నాలుగు జాతీయ రహదారులు మంజూరు

తెలంగాణ రాష్ట్రానికి మరో నాలుగు జాతీయ రహదారులు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

9.తిరుమలలో ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ముగిసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

10.హైదరాబాద్ లో పెరిగిన చలి.ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.ఈ నేపథ్యంలో ఎల్లో అలెర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది.

11.జగన్ ప్రభుత్వానికి జబర్దస్త్ నటుడి డిమాండ్

ఏపీలో చింతామణి నాటకం పై ప్రభుత్వం నిషేధం విధించడానికి నిరసనగా విశాఖలోని మద్దిలపాలెం జంక్షన్ లో తెలుగుతల్లి విగ్రహం వద్ద నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో జబర్దస్త్ నటుడు అప్పారావు పాల్గొన్నారు.ఏపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా అప్పారావు డిమాండ్ చేశారు.

12.  ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

నేడు ఏపీ లోని అన్ని జిల్లాల్లో ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది.

13.జగన్ పై పరిపూర్ణానంద వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ పై పరిపూర్ణానందస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు .జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు.

14.  మంత్రి మేకపాటి కి రెండోసారి కరోనా

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కి రెండోసారి కరోనా గా నిర్ధారణ అయింది.

15.ఏపీలో కరోనా

గడచిన 24 గంటల్లో ఏపీ లో కొత్తగా 12,926 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

16.వాలంటీర్లకు ఇన్సూరెన్స్ చేయించిన ఎమ్మెల్యే జక్కంపూడి

తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలో గ్రామ సచివాలయం వాలంటీర్లకు వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇన్సూరెన్స్ చేయించారు.

17.సోము వీర్రాజు పై మంత్రి వెల్లంపల్లి కామెంట్స్

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు  పై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.సోము వీర్రాజు ను ఇప్పుడు అంతా సారాయి వీర్రాజు అంటున్నారంటూ మంత్రి ఎద్దేవా చేశారు.

18.ఏపీ ప్రభుత్వంపై అరుణ్ సింగ్ కామెంట్స్

ఏపీ ప్రభుత్వం పై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సంచలన కామెంట్స్ చేసారు.ఏపీ ప్రభుత్వం దమనకాండక చెప్పడానికి తాను వచ్చానని ఆయన వ్యాఖ్యానించారు.

19.వంతెనను పేల్చేసిన మావోయిస్టులు

జార్ఖండ్లో మావోయిస్టులు వరుసగా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.అధికారుల వివరాలు ప్రకారం గిరిడి జిల్లా డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వంతెన ను మావోయిస్టులు తెల్లవారుజామున పేల్చివేశారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,520

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,520

.

Video : Telangana Headlines, News Roundup, Top20News, Telugu News Headlines, Todays Gold Rate, Corona Cases, AP, Monkey Fever, Karnataka,Somu Veerraju, CM Jagan, TTD,Arun Singh, Hyderabad, Yellow Alert

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube