న్యూస్ రౌండప్ టాప్ - 20 - Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News January 23 2021

AP and Telangana Breaking News, Andhra Pradesh headlines, News Roundup,Top20 Today News, Pawan kalyan in Ongole, PM Modi, Today Gold rates ,Janasena Leader Jangaiah - Telugu Andhra Pradesh Headlines, Ap And Telangana Breaking News, Janasena Leader Jangaiah, News Roundup, Pawan Kalyan In Ongole, Pm Modi, Today Gold Rates, Top20 Today News

1.ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్

ఏపీలో పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News January 23 2021-TeluguStop.com

ఈ మేరకు ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు.నాలుగు విడుతల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి.

2.సంపూర్ణేష్ బాబు క్షేమం

ఓ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో హీరో సంపూర్ణేష్ బాబు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News January 23 2021-న్యూస్ రౌండప్ టాప్ – 20 -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

3.100 నోటు రద్దు ?

త్వరలోనే 100 రద్దు నోట్లు చేయబోతున్నట్లు ఆర్బిఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మహేష్ హింట్ ఇచ్చారు.

4.శ్యామ్ కే నాయుడి పై నటి ఫిర్యాదు

శ్యామ్ కె.నాయుడు నుంచి తనకు ప్రాణ హాని ఉందని, సినీ నటి శ్రీ సుధ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

5.25 నుంచి పీజీ ఈ సెట్ సెట్

ఎం ఈ, ఎం టెక్ , ఎం ఆర్క్, ఎం ఫార్మసీ , ఫార్మ్ డి ప్రవేశాలకు పీజీ ఈ సెట్ ప్రత్యేక నోటిఫికేషన్ ను శుక్రవారం విడుదల చేశారు.ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లు 25 నుంచి ప్రారంభం అవుతాయి.

6.తెలంగాణ లో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 221 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

7.స్వామీజీ కిడ్నాప్

కర్ణాటకలో అమ్మాజీ అనే స్వామీజీ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది.కపిలాపురం గ్రామం, బార్లీ జిల్లా నుంచి స్వామీజీని దుండగులు కిడ్నాప్ చేశారు.

8.కోల్గేట్ సంస్థకు జరిమానా

ఎక్కువ ధరకు కోల్గేట్ పేస్ట్ ను అమ్ముతూ వినియోగదారులను మోసం చేస్తున్న కోల్గేట్ సంస్థకు సంగారెడ్డి న్యాయస్థానం 10 వేల జరిమానా విధించింది.

9.కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, పేద కమ్మవారికి, విదేశాల్లో చదువుకునే వారికి తగిన సహాయం అందించాలని మంత్రి కేటీఆర్ కు కమ్మ సంఘం కుత్బుల్లాపూర్ అధ్యక్షుడు బొడ్డు రవిశంకర్ తదితరులు మంత్రి కేటీఆర్ కు వినతి పత్రం అందించారు.

10.వీఆర్వోల ఆత్మగౌరవ సమావేశం

తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన వివిధ శాఖలలో సర్దుబాటు వ్యవహారంపై ఇంకా మీనమేషాలు లెక్కించడం పై ఈనెల ఇరవై నాలుగు విఆర్వోలు ఆత్మగౌరవ సదస్సు నిర్వహించబోతున్నారు.

11.ఎఫ్ సీ ఐ ప్రారంభోత్సవానికి మోదీ

తెలంగాణలోని రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించువారు శ్రీమతి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

12.ఇద్దరు మిలిషియ సభ్యుల అరెస్ట్

సీపీఐ , మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మిలీషియా సభ్యులను అరెస్ట్ చేసినట్టు తెలంగాణలోని వెంకటాపురం పోలీసులు తెలిపారు.

13.ఐదు నెమళ్లు మృతి

మహారాష్ట్రలో కొన్నిచోట్ల బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.తాజాగా ఆ రాష్ట్రంలోని బీద్ జిల్లాలో ఐదు నెమళ్లు , ఆరు పక్షులు మృతి చెందాయి.

14.నెల్లూరు లో టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య

టిక్ టాక్ ద్వారా మంచి ఫేమస్ అయిన రఫీ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

15.ఒంగోలు ఎస్ పి ని కలిసిన పవన్

ఒంగోలు ఎస్ పి సిద్దార్థ్ కౌశల్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు.జనసేన కార్యకర్త వెంగయ్య మృతికి కారకులైన వారిని అరెస్టు చేయాలని పవన్ కోరారు.

16.వైసీపీ ఎమ్మెల్యే కు పవన్ వార్నింగ్

శనివారం ఒంగోలు నుంచి జనసేన కార్యకర్త జంగయ్య మృతి చెందడంతో ఆ కుటుంబం ను  పవన్ కళ్యాణ్ పరామర్శించారు ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కు పవన్ వార్నింగ్ ఇచ్చారు.మళ్లీ ఎలా గెలుస్తావు అంటూ పవన్ హెచ్చరించారు.

17.భారత్ లో కరోనా

 గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 14,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

18.కరోనా తో మంత్రి మృతి

జింబాబ్వే రవాణా శాఖ మంత్రి జోయల్ మటిజా కరోనా వైరస్ ప్రభావం తో మృతి చెందారు.

19.అన్నా హజారే తో ఫడ్నవీస్ భేటీ

మహారాష్ట్ర మాజీ సీఎం , బిజెపి సీనియర్ నేత దేవేందర్ పట్నం ఫడ్నవీస్ ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే తో భేటీ అయ్యారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,950

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,130

.

#PawanKalyan #JanasenaLeader #PM Modi #AndhraPradesh #APAnd

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు