న్యూస్ రౌండప్ టాప్ 20  

Andhra Pradesh and Telangana Breaking Headlines, Andhra News, Today news Roundup, Breaking Headlines, Telangana News, Political news, Tenth Exams Date, Sasikala Health updates, Today Gold Rate - Telugu Andhra News, Andhra Pradesh And Telangana Breaking Headlines, Breaking Headlines, Political News, Sasikala Health Updates, Telangana News, Tenth Exams Date, Today Gold Rate, Today News Roundup

1.సిద్దిపేటకు రైలు.

హరీష్ హామీ మరో ఏడాది లోనే సిద్దిపేటకు రైలు సౌకర్యం అందే విధంగా ప్రయత్నిస్తున్నామని టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు ప్రకటించారు.

TeluguStop.com - Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News January 22 2021

2.తెలంగాణలో కరోనా

గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 214 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

3.రేపటి నుంచి ఐసెట్ కౌన్సిలింగ్

తెలంగాణలో రేపటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కాబోతోంది.ఈ మేరకు సాంకేతిక విద్యా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

TeluguStop.com - న్యూస్ రౌండప్ టాప్ 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

4.లాసెట్ కౌన్సిలింగ్

న్యాయ విద్యలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో విడత కౌన్సిలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యింది.

5.మే 17 నుంచి టెన్త్ పరీక్షలు

మే 17 నుంచి తెలంగాణ లో  టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

6.ధరణి పై స్టే పొడిగింపు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ పై స్టే ను తెలంగాణ హై కోర్ట్ పొడిగించింది.

7.జోగులాంబ ఆలయానికి 36 కోట్ల నిధులు

దేశంలోనే అత్యంత శక్తి పీఠమైన గద్వాల్ జిల్లాలోని జోగులాంబ ఆలయంలో భక్తుల మౌలిక సదుపాయాల కోసం 36.73 కోట్ల నిధులను విడుదల అయినట్టు స్థానిక ఎమ్మెల్యే అభ్రహం తెలిపారు.

8.తిరుపతిలో పవన్ సందడి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి లో హడావుడి చేస్తున్నారు.ఈరోజు ఉదయం కాషాయ వస్త్రాలతో పవన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

9.టి.కాంగ్రెస్ నేతలతో ఠాకూర్ సమావేశం

పార్టీ స్థితిగతుల పైన, ఎమ్మెల్సీ ఎన్నికల పైన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ ఈరోజు పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు.

10.జగన్ తో గోపాలకృష్ణ ద్వివేది భేటీ 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం పై ఏపీ సీఎం జగన్ తో పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది భేటీ అయ్యారు.

11.వింత వ్యాధిపై జగన్ సమీక్ష 

ఏపీలో ని పశ్చిమ గోదావరి జిల్లా లో ప్రబలిన వింత వ్యాధి పై ఏపీ సీఎం జగన్ తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

12.గవర్నర్ తో ముగిసిన ఎస్ ఈసీ భేటీ 

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ తో ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ ముగిసింది.స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం పై ఈ భేటీ జరిగింది.

13.జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు

జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఈ నెల 29 న  ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు ఏ ఐ సీ సీ వర్గాలు పేర్కొన్నాయి.

14.విషమం గా శశికళ ఆరోగ్యం

అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ ఆరోగ్యం విషమం గానే ఉంది.శ్వాస తీసుకోవడం లో ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం ఆమె విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

15.లాలూ ప్రసాద్ యాదవ్ కు అస్వస్థత

బీహార్ మాజీ ముఖ్యమంత్రి , ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ప్రస్తుతం ఆయన రాంచీ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

16.గాయపడిన ఏనుగు మృతి

వేటగాళ్ల దాడిలో గాయపడిన  ఏనుగు మరణించిన ఘటన తమిళనాడులోని ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్ లో చోటు చేసుకుంది.

17.కాకినాడలో బోటు దగ్ధం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఫిషింగ్ హార్బర్ వద్ద ఓ చేపల బోటు దగ్ధం అయ్యింది.ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

18.ఆర్టీసీ బస్సులో అనంత కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు విద్యార్థులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.గొంచిరెడ్డి పల్లె గ్రామం నుంచి బ్రహ్మ సముద్రం వరకు ఆయన బస్సులో ప్రయాణించారు.

19.ఢిల్లీలో రైతుల ఆందోళన అప్ డేట్స్

చంద్రబాబు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసన దీక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.ఈ మేరకు ఇప్పటికే కేంద్రం రైతులతో అనేకమార్లు చర్చలు జరపగా నేడు పదకొండోసారి చర్చలు ప్రారంభం అయ్యాయి.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,550

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,550.

#AndhraPradesh #SasikalaHealth #Today Gold Rate

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు