న్యూస్ రౌండప్ టాప్ 20- Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News January 19 2021

AP and Telangana Breaking News, Top headlines, news Roundup,Andhra Pradesh Breaking News, Telangana Politics News, KTR, Smart Phones to Students, Cholleti Vinay, Sonusood, Ambulance - Telugu Ambulance, Andhra Pradesh Breaking News, Ap And Telangana Breaking News, Cholleti Vinay, Ktr, News Roundup, Smart Phones To Students, Sonusood, Telangana Politics News, Top Headlines

1.ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు ప్రారంభం

ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తెలంగాణలో స్కూళ్లు ప్రారంభం అవుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News January 19 2021-TeluguStop.com

2.పవన్ రామ్ చరణ్ కాంబినేషన్ లో శంకర్ సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో శంకర్ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రం ప్రారంభం కాబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

3.గుడివాడ టూ టౌన్ ఎస్ ఐ ఆత్మహత్య

కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్ ఎస్ ఐ పిల్లి విజయ్ కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News January 19 2021-న్యూస్ రౌండప్ టాప్ 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.లవ్ అగర్వాల్ సోదరుడి మృతి

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి , సీనియర్ ఐఏఎస్ అధికారి లవ్ అగర్వాల్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

లవ్ అగర్వాల్ సోదరుడు అంకుర్  అగర్వాల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సహ్రాన్ పూర్ లో జరిగింది.

5.మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్

టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఈ రోజు అరెస్ట్ అయ్యారు.విజయవాడలోని గొల్లపూడి లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టేందుకు ప్రయత్నించిన ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

6.ఉద్రిక్తంగా మారిన ఛలో రాజ్ భవన్

ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ, అలాగే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇది ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు దీనిని అడ్డుకున్నారు.

7.డిగ్రీ విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్స్

ఫోన్ సౌకర్యం లేక ఆన్లైన్ క్లాసులకు హజరుకాలేక పోతున్న డిగ్రీ విద్యార్థినులకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్మార్ట్ ఫోన్లు అందించారు.గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో సిరిసిల్ల సోషల్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలోని 22 మందికి వీటిని అందించారు.

8.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

9.తెలుగు వర్సిటీ ప్రవేశాలకు 21 వరకు గడువు

పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయంలో ఈ నెల 21 వరకు ప్రవేశాలకు గడువును విధించారు.

10.చైనా కు పారిపోయిన లోన్ యాప్ కంపెనీల డైరెక్టర్లు

ఆన్లైన్ లోన్ యాప్స్ కంపెనీ డైరెక్టర్లు చైనాకు పారిపోవడంతో, వారిని తిరిగి ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

11.ఫిబ్రవరి లో బాయో ఏషియా సదస్సు

బయో ఏషియా 2021 అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 22,23 తేదీల్లో జరగనుంది.

12.ఎమ్మెల్సీ  అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

హైదరాబాద్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏకాభిప్రాయానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.

13.కేసిఆర్ భారీ బహిరంగ సభ

ఈ నెల 22 , 24 తేదీల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు.

14.ప్రగతి భవన్ లో రేపు ఖమ్మం టిఆర్ఎస్ నేతల సమావేశం

ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి  ప్రగతి భవన్ లో ఖమ్మం జిల్లా నేతలు సమావేశం మంత్రి కేటీఆర్ అధ్వర్యంలో జరగనుంది.

15.కరోనాతో ఎమ్మెల్యే మృతి

కేరళకు చెందిన సిపిఎం ఎమ్మెల్యే కేయే విజయదాస్ కరోనా తో మృతి చెందారు.

16.బైడన్ బృందంలో తెలంగాణ వాసి

అమెరికా నూతన అధ్యక్షుడు బైడన్ బృందం లో తెలంగాణ వాసి, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామానికి చెందిన చోల్లేటి వినయ్ రెడ్డి అమెరికా అధ్యక్షుడు బైడన్ కు స్పీచ్ రైటింగ్ డైరెక్టర్ గా నియమితులు అయ్యారు.

17.ఆటా నూతన అధ్యక్షుడిగా భువనేష్

అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) నూతన అధ్యక్షుడిగా మహబూబ్ నగర్ జిల్లా గుమ్మడం గ్రామానికి చెందిన భువనేష్ బుజాల ఎన్నికుయారు.

18.ఇన్ సైడర్ ట్రేడింగ్ పై కేసు కొట్టివేత

అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లుగా పోలీసులు కేసు నమోదు చేయగా , వాటిని కొట్టివేయాలంటూ కిలారి రాజేష్ హై కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది.

19.ట్యాంక్ బండ్ పై సోనూసూద్ సందడి

ప్రముఖ సినీ నటుడు, రియల్ హీరో సోను సూద్ ట్యాంక్ బండ్ పై సందడి చేశారు.శవాల శివ సోనూసద్ పేరుతో ఏర్పాటుచేసిన అంబులెన్స్ సర్వీసును సోను సూద్ ప్రారంభించారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,000

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,000.

#AndhraPradesh #Ambulance #APAnd #Sonusood #Cholleti Vinay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు