న్యూస్ రౌండప్ ... టాప్20   

1.ఓల్డ్ మలక్ పేట్ లో పోలింగ్ రద్దు


TeluguStop.com - Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News 02 December 20

ఓల్డ్ మలక్ పేట్ డివిజన్ 26లో పోలింగ్ రద్దయింది.

మలక్ పేట్ డివిజన్ బ్యాలెట్ పేపర్ లో సిపిఎం , సిపిఐ పార్టీల గుర్తు తారుమారు కావడంతో, ఇక్కడ పోలింగ్ రద్దుచేసి మూడో తేదీకి వాయిదా వేశారు.ఓల్డ్ మలక్ పేట్ లో 1,2,3,4,5 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిలిపివేస్తున్నట్లు ఈ మేరకు ఈసీ ప్రకటించింది.

TeluguStop.com - న్యూస్ రౌండప్ … టాప్20 -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

2.మాదాపూర్ లో బిజెపి టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య వార్


మాదాపూర్ డివిజన్ పోలింగ్ బూత్ లలో పోలీసుల సాయంతో ఓటర్లకు టిఆర్ఎస్ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని, బిజెపి ఆరోపిస్తున్న తరుణం లో బిజెపి టిఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

3.ఎంబీబీఎస్ యాజమాన్య కోటాకు నోటిఫికేషన్


ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది.డిసెంబర్ ఒకటి నుంచి ఏడో తేదీ వరకు బి,సి కేటగిరి సీట్లకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

4.తెలంగాణలో కరోనా


గడచిన 24 గంటల్లో తెలంగాణలో 502 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు ఈ ప్రభావంతో మృతి చెందారు.

5.కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న కిమ్


ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ కి అతన కుటుంబానికి ప్రయోగాత్మక కరోనా వైరస్ వ్యాక్సిన్ ను చైనా అందించినట్లు అమెరికా విశ్లేషకుడు జపాన్ ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ చెప్పారు.

6.టిఎస్పిఎస్సీ ప్రాథమిక కీ విడుదల


వెటర్నరీ అసిస్టెంట్ , ల్యాబ్ టెక్నీషియన్, వాటర్ బోర్డు లో మేనేజర్ పరీక్షల ప్రాథమిక కీని లను  టిఎస్పిఎస్సీ విడుదల చేసింది.

7.కరోనా నిర్ధారణ పరీక్షకు రూ.800


కోవిడ్ పరీక్ష కు 800 ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించినట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

8.కెసిఆర్ పై వంద కోట్లు పరువు నష్టం దావా


తనపై తప్పుడు క్రిమినల్ కేసు పెట్టినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్,  సీపీ అంజనీ కుమార్ ల పై వంద కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్లు బిజెపి నేత మాజీ ఎంపీ వివేక్ ప్రకటించారు.

9.ప్రమాణ స్వీకారం చేసిన కొత్త ఎంపీలు


ఉత్తరప్రదేశ్ , ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్రం నుంచి కొత్తగా ఎన్నికైన 10 మంది రాజ్యసభ సభ్యులు తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు.

10.జేసీ దివాకర్ రెడ్డి కి 100 కోట్ల జరిమానా


టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ అధికారులు 100 కోట్లు జరిమాన విధించాలని నిర్ణయించారు.జెసి కి చెందిన త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

11.ఢిల్లీలో రైతుల ఆందోళన.చర్చలకు పిలిచిన కేంద్రం


కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో గత ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది.

12.చిన్నారులకు సచిన్ సహాయం


వివిధ వ్యాధులతో బాధపడుతున్న ఆరు రాష్ట్రాలకు చెందిన 100 మంది చిన్నారులకు ఓ సేవా సంస్థ ద్వారా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహాయం చేసేందుకు ముందుకు వచ్చినట్లు ఈ కామ్ ఫౌండేషన్ పేర్కొంది.

13.యాపిల్ కు 88 కోట్ల పెనాల్టీ


యాపిల్ కంపెనీకి చెందిన ట్రస్ట్ ఆధారిటీ ‘ ఏ జి సి ఎమ్ ‘ 88 కోట్ల అపరాధ రుసుమును విధించింది.

14.రికార్డు లో బిట్ కాయిన్


బిట్కయిన్ సోమవారం 19864 డాలర్ల రికార్డు గరిష్ఠ స్థాయికి చేరింది.

15.హీరో శింబు కు కార్ గిఫ్ట్


లాక్ డౌన్ సమయంలో భారీగా వర్కర్స్ చేసి 101 కేజీల నుంచి 71 కేజీల వరకు బరువు తగ్గిన సినీ హీరో శింబు ను మెచ్చుకుంటూ ఆయన తల్లి బ్రిటిష్ రేసింగ్ కార్ మినీ కూపర్ ను బహుమతిగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

16.గ్రేటర్ ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేధం


 ఓల్డ్ మలక్ పేట లో ఎన్నికల గుర్తు తారుమారు అయిన కారణంగా అక్కడ ఎన్నికలను వాయిదా వేసిన నేపథ్యంలో ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ నిషేధిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.

17.గుంటూరు అర్బన్ ఎస్పీ పై లోకేష్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు


గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ను టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ఇచ్చారు.సోషల్ మీడియా వేదికగా తన ఎస్పి బెదిరించారని శాసన మండలి చైర్మన్ కు లోకేష్ ఫిర్యాదు చేశారు.

18.ఈరోజు బంగారం ధరలు


22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,900.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,980.

19.పాతబస్తీలో బిజెపి వర్సెస్ ఎంఐఎం


పాతబస్తీలోని జంగం మెట్ డివిజన్, చాంద్రాయణగుట్ట లో బిజెపి ఎంఐఎం నేతల మధ్య వాగ్వాదం జరిగింది.బిజెపి నేతలు చట్టవిరుద్ధంగా ఓటర్లను ప్రభావితం చేసేలా తిరుగుతున్నారు అంటూ ఆందోళన చేపట్టి బిజెపి నాయకులతో వాగ్వివాదానికి దిగింది .

20.వృద్ధురాలికి కేటీఆర్ థాంక్స్


80 ఏళ్ల వయసులో ఓ సీనియర్ సిటిజన్ టిఆర్ఎస్ కు ఓటు వేసేందుకు బయటకు వచ్చినట్లుగా సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్ మీరే మాకు స్ఫూర్తి అంటూ ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

#WarBetween #Rs100 #Rs100 #CoronaIn #KTRThanks

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు