1.కేటీఆర్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
ఫామ్ హౌస్ వివాదంలో తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేశారు.
2.ఎల్ ఆర్ ఎస్ పై సుప్రీంకోర్టులో విచారణ

ఎల్ ఆర్ ఎస్ (లే అవుట్ క్రమబద్దీకరణ పథకం ) పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు సరైనా అధ్యయనం లేకుండా ఎల్ ఆర్ ఎస్ చేస్తున్నారని జనగాం వాసి జువ్వాడి సాగర్ రావు అనే వ్యక్తి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
3.సరిహద్దుల్లోనే రైతులు
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 21వ రోజుకు చేరింది.
4.అమరావతిలో బైక్ ర్యాలీ

అమరావతి ఉద్యమం 365 రోజులు పూర్తయిన సందర్భంగా రైతులు వరుసగా అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.దానిలో భాగంగానే బుధవారం అమరావతి ముఖద్వారం అయినా వెంకట పాలెం నుంచి తుళ్లూరు వరకు దళిత రైతులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
5.జలశక్తి మంత్రి తో ముగిసిన జగన్ భేటీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ తో బేటీ అయ్యారు ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు అన్ని విధాలుగా సహకరించాలని జగన్ కోరారు.
6.మరో కరోనా వాక్సిన్

Covid-19 కట్టడికి ఈ వారంలోనే మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది.యూఎస్ ఫార్మా దిగ్గజం మెడర్న్ ఇంక్ రూపొందించిన వాక్సిన్ అర్హత సాధించింది.దీని వినియోగం పై గురువారం నిపుణుల సలహా కమిటీ సమావేశం కాబోతోంది.
7.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 26,382 కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి.
8.సైనికుడు పాత్రలో విజయ్ దేవరకొండ

సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రాబోతోంది.2022 లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్.
9.పోలీస్ ఉద్యోగాల భర్తీ
తెలంగాణ పోలీస్ శాఖలో మరో 20 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్వం సిద్ధమైంది.ఎస్సైలు 425, కానిస్టేబుళ్లు 19,300 భర్తీ చేయబోతున్నారు.
10.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ను ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పరిధిలోని జై భవాని నగర్ రైతు బజార్ వద్ద నిర్మించిన 324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
11.పారిశ్రామిక ప్రదర్శన వాయిదా
ప్రతి ఏడాది అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ( నమాయిష్ ) ను జనవరి 1న జరగడం ఆనవాయితీ వస్తోంది.ఈ సారి కరోనా నేపథ్యం ఆ ఈ ప్రదర్శనను ను వాయిదా వేశారు.
12.సోనియాతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

పీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీతో భేటీ అయ్యారు.
13.మూడు రోజులు భారీ వర్ష సూచన
తమిళనాడు, పుదిచ్చేరిలలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం డైరెక్టర్ పురి అరసన్ ఒక ప్రకటనలో తెలిపారు.
14.ఒక్క ఓటు తేడాతో ఓడిన కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి

కేరళలోని కొచ్చి కార్పొరేషన్ ఎన్నికల్లో నార్త్ ఐలాండ్ వార్డు నుంచి పోటీచేసిన వేణు గోపాల్ అనే కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓటమి చెందారు.
15.ఎయిర్ ఇండియా బంపరాఫర్
60 ఏళ్లు లేదా అందుకు పైబడిన వయస్సు గల వారికి టికెట్ ధరలలో 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
16.ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ

డిసెంబర్ 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని జగన్ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
17.బిజెపి మెరుపు ధర్నా
విజయవాడలో బిజెపి మెరుపు ధర్నా చేపట్టింది.గతంలో కృష్ణా పుష్కరాల సందర్భంగా కూల్చివేసిన దేవాలయాలను వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ, ప్రకాశం బ్యారేజీ శనీశ్వర ఆలయం వద్ద నిరసనలు తెలిపారు.
18.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,200
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,400.
19.హైదరాబాద్ కు డబుల్ డెక్కర్ బస్సులు
త్వరలోనే హైదరాబాదులో డబల్ డెక్కర్ బస్సు పరుగులు పెట్టబోతున్నాయి.మొదటి దశలో 40 నుంచి 50 బస్సులు తయారు చేయిస్తున్నట్టు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.
20.వాయిదా పడిన సింగర్ సునీత పెళ్లి

సింగర్ సునీత పెళ్లి డిసెంబర్ 27 న జరగాల్సి ఉన్నా, వ్యక్తిగత కారణాల వల్ల దానిని వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
