న్యూస్ రౌండప్ ... టాప్20   

1.బండి సంజయ్ కు ప్రధాని ఫోన్


TeluguStop.com - Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News December 02 2020

నిన్న గ్రేటర్ లో జరిగిన పోలింగ్ ప్రక్రియ పై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు నరేంద్ర మోదీ ఫోన్ చేసి సుమారు పది నిమిషాలు మాట్లాడారట.

2.పులుల కోసం గాలింపు


TeluguStop.com - న్యూస్ రౌండప్ … టాప్20 -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తెలంగాణలోని కొమరం భీమ్ జిల్లాలో ని పెంచికలపేట మండలం కొండపల్లి పరిసర ప్రాంతాల్లో పులులు సంచరిస్తూ, ప్రజల ప్రాణాలు తీస్తూ ఉండడంతో, వాటిని పట్టుకునేందుకు మూడు బొన్లు, 10 సిసి కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు.

3.ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి కి స్కాచ్ అవార్డు


లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది అధికారులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇచ్చినందుకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం ( ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి ) కు ప్రతిష్టాత్మక స్కాచ్  అవార్డు దక్కింది.

4.తెలంగాణలో కరోనా


గడచిన 24 గంటల్లో తెలంగాణలో మొత్తం 565 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ వైరస్ ప్రభావంతో ఒకరు మృతి చెందారు.

5.యూజీసీ నెట్ ఫలితాలు విడుదల


యుజిసి జాతీయ అర్హత పరీక్ష ( నెట్) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం విడుదల చేసింది.

6.15 నుంచి ఆర్ఆర్ బి, టీచర్, స్టెనో మినిస్టిరియల్ పరీక్షలు


ఆర్ ఆర్ బి బి – ఎన్ టి పి సి , మినిస్టీరియల్, గ్రూప్ డి, వివిధ పోస్టుల ఎంపిక ప్రక్రియ ఈ నెల లో ప్రారంభం కాబోతోంది.ముందుగా స్టెనోగ్రాఫర్, టీచర్, లా అసిస్టెంట్, కుక్ తో పాటు, మినిస్టీరియల్, గ్రూప్ డి పరీక్షలు ఈ నెల 15న ప్రారంభం కాబోతున్నాయి.

7.పవన్ కళ్యాణ్ ర్యాలీలో అపశ్రుతి


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించే నిమిత్తం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కారు ర్యాలీలో ఓ వ్యక్తి గాయపడ్డారు.రెండు కార్ల మధ్య ఒక బైక్ ఇరుక్కోవడంతో, ఆ బైక్ పై ఉన్న వ్యక్తి కాలు విరిగింది.

8.ఏపీలో పెండింగ్ జీతాల చెల్లింపు పై జీవో


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు కరోనా నేపథ్యంలో, మార్చి ఏప్రిల్ నెలలో నిలిపివేసిన 50శాతం వేతన బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

9.స్పీడ్ పోస్ట్ లో శబరిమల ప్రసాదం


ఈ సీజన్ లో మాత్రమే దొరికే శబరిమల అరవణ పాయసం ను స్పీడ్ పోస్ట్ ద్వారా భక్తులకు డెలివరీ చేసేందుకు కేరళకు చెందిన పోస్టల్ సర్కిల్ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తో ఒప్పందం చేసుకుంది.

10.విదేశాల్లో భారతీయులకు పోస్టల్ బ్యాలెట్

విదేశాల్లో ఉండే భారతీయులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించాలని ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది.ఎలక్ట్రానికల్లి ట్రాన్స్ మీటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం ద్వారా అవకాశం కల్పించే విధానంపై ఈసీ కసరత్తు చేస్తోంది.

11.ఎమ్మెల్సీగా ఊర్మిళ

బాలీవుడ్ నటి ఊర్మిళ మంగళవారం శివసేన లో చేరారు.ఆమెను ఎమ్మెల్సీగా నియమించే ప్రక్రియకు శివసేన  శ్రీకారం చుట్టింది.

12.ఫైజర్ టీకా కు యుకే అనుమతి


ఫైజర్ బయో ఎన్ టెక్  తయారుచేసిన కొవిడ్ టీకా కు యునైటెడ్ కింగ్డమ్ అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేసింది.

13.ఢిల్లీలో ఆగని ఆందోళన- కేంద్ర మంత్రుల కీలక భేటీ


నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో పెద్దఎత్తున రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.దీనిపై ప్రభుత్వం రైతు ప్రతినిధులకు మధ్య చర్చలు ఒక కొలిక్కి రాలేదు.ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు మరోసారి ఈ అంశంపై భేటీ అయ్యారు.

14.హెచ్ 1 బీ వీసాలపై కీలక తీర్పు


హెచ్ 1 బీ వీసాల పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన నిబంధనలను కాలిఫోర్నియా సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

15.అమెరికాలో కరోనా మరణాలు


గడచిన 24 గంటల్లో అమెరికాలో 2500 మంది కరోనా ప్రభావం తో మృతి చెందారు.సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,80,000 కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

16.ఎమ్మెల్యే నోముల అంత్యక్రియల్లో కేసీఆర్


నిన్న మృతి చెందిన తెలంగాణ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో రేపు సీఎం కేసీఆర్ పాల్గొనబోతున్నారు.దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

17.పెరిగిన గ్యాస్ ధర


గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.పెరిగిన ధరలు నేటి నుంచే అమలు చేస్తున్నారు.

18.నటుడు సన్నీ డియోల్ కు కరోనా


బాలీవుడ్ నటుడు బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కు  కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

19.నంబర్ వన్ గా అల్లు అర్జున్


యాహూ సెర్చ్ లో టాలీవుడ్ లో అల్లు అర్జున్ మొదటి స్థానం సాధించారు.దేశవ్యాప్తంగా చూసుకుంటే అల్లు అర్జున్ కు పదో స్థానం లభించింది.

20.ఈరోజు బంగారం ధరలు


22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,150.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,260.

#JivoOn #UKPermission #RRB From 15 #MLACorona #PrimeMinister's

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News December 02 2020 Related Telugu News,Photos/Pics,Images..