న్యూస్ రౌండప్ టాప్ 20

1.మొహర్రం ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

మొహరం ఏర్పాట్లపై తెలంగాణ హోమ్ మంత్రి మహమూద్ అలీ , మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News August 02 2021-TeluguStop.com

2.యూరోప్ కు ఆర్ఆర్ టీమ్ ప్రయాణం

ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఆర్ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు.రాబోయే షెడ్యూల్ చిత్రీకరించనున్నారు.ఈ మేరకు త్వరలోనే ఆర్ ఆర్ ఆర్ టీమ్ మొత్తం యూరోప్ వెళ్లేందుకు సిద్ధం అవుతోంది.

3.ఆగస్టు 16 నుంచి దళిత బంధు అమలు

ఆగస్టు 16 నుంచి దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ నుంచి ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News August 02 2021-న్యూస్ రౌండప్ టాప్ 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.స్కూల్ కోసం సుకుమర్ ఏం చేశాడంటే

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చదువుకున్న పాఠశాల కోసం భారీ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.తూర్పుగోదావరి లోని ఆయన స్వగ్రామం మట్టపర్రు ప్రభుత్వ పాఠశాలను 18 లక్షలతో  నిర్మించారు.తాజాగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కలిసి సుకుమార్ ఈ భవనాన్ని ప్రారంభించారు.

5.నేడు నాగార్జున సాగర్ కు కేసిఆర్

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.

6.హెలికాప్టర్ కూలి నలుగురు మృతి

ఉత్తర కాలిఫోర్నియా లో హెలికాప్టర్ కూలిన ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.ఈ విషయాన్ని కేవీఎస్ టివి స్టేషన్ డిపార్ట్మెంట్ ధ్రువీకరించింది.

7.పెరిగిన తెలుగు రాష్ట్రాల జిఎస్టి ఆదాయం

గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జూలైలో తెలుగు రాష్ట్రాల జిఎస్టి ఆదాయం 25 శాతానికి పైగా పెరిగింది.

8.కొమరం భీమ్ జిల్లా లో పెద్దపులి కలకలం

కొమరం భీం జిల్లా లోని బెజ్జూర్ మండలం లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.తాజాగా ఓట్ల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

9.నాగార్జునసాగర్ ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తివేత

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పెరిగింది దీంతో ప్రాజెక్టు 22 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

10.సినీ నిర్మాత కు ఐదు కోట్ల జరిమానా

శాండల్వుడ్ నిర్మాత కె సుధాకర్ కు ఐదు కోట్ల జరిమానా తో పాటు ఏడాది జైలు శిక్ష ఖరారైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

11.నేటితో ముగియనున్న ఆషాడ మాస బోనాలు

ఆషాడ మాసం బోనాలు  హైదరాబాదులో ఈ రోజుతో ముగియనున్నాయి.

12.జమ్ము కాశ్మీర్ లో మరోసారి డ్రోన్ ల కలకలం

జమ్ము కాశ్మీర్లో డ్రోన్లు మరోసారి కలకలం సృష్టించాయి.ఆదివారం రాత్రి 8:30 సమయంలో ఆర్మీ క్యాంపు ఇవి కనిపించాయి.

13.నేడు రేపు ఢిల్లీలో ‘ఉక్కు ‘ ధర్నా

విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించం కు కేంద్రం మొగ్గు చూపిస్తున్నారు ఎంతో దానిని నిలిపి వేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని కార్మిక సంఘం నాయకులు తెలిపారు ఈ మేరకు ఢిల్లీలో ఈరోజు రేపు ధర్నా చేసేందుకు ఆదివారం కార్మికులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

14.ఏపీలో కరోనా

గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా 2,287 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 18 మరణాలు సంభవించాయి.

15.సెట్స్ పైకి ‘ బంగార్రాజు’

నాగార్జున డ్రీమ్ ప్రాజెక్ట్ ‘బంగార్రాజు ‘ సినిమా షూటింగ్ ఈ నెల 20 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

16.రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం : పాట్కర్

రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం తో ఆయా రాష్ట్రాల పై కేంద్రం పెత్తనం చేస్తోందని ప్రముఖ సామాజిక వేత్త మేధా పాట్కర్ అభిప్రాయపడ్డారు.ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

17.తిరుమల సమాచారం

 తిరుమలలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది.ఆదివారం శ్రీవారిని 20,796 మంది భక్తులు దర్శించుకున్నారు.

18.అగ్రవర్ణ పేదలకు సంక్షేమ పథకాలు : ఏపీ మంత్రి

ఏపీలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు త్వరలోనే సంక్షేమ పథకాలు నేరుగా అందించే సరికొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్ట బోతుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు తెలిపారు.

19.సుంకేసుల ప్రాజెక్టు కు భారీగా వరద

కర్నూలు జిల్లాలోని సుంకేసుల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.దీంతో జలాశయం 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,380

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48, 380

.

#APAnd #NagrajunaSagar #SukumarBuilds #TeluguNews #Top20News

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు