న్యూస్ రౌండప్ టాప్ 20 

Telangana Headlines, News Roundup, Top20News, Telugu News Headlines, Todays Gold Rate, Cm Kcr, Jagan Mohan Reddy, Union Minister Nithin Gadkari, Vangalapudi Anitha, Ramnath Kovind, Venkayya Naidu, Chandra Babu Naidu, Mamata Banerjee, Somu Veerraju, Hero Nikhil, Fci

1.తెలంగాణలో రెండు జాతీయ రహదారులు జాతికి అంకితం

Telugu Chandra Babu, Cm Kcr, Nikhil, Mamata Banerjee, Ramnath Kovind, Somu Veerr

తెలంగాణలో రెండు జాతీయ రహదారులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జాతికి అంకితం చేశారు. 

2.నేడు తెలంగాణ ప్రభుత్వం ఇస్తార్ విందు

  నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ముస్లింలకు ఇస్తారు విందు ఇవ్వనున్నారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. 

3.హైదరాబాద్ లో ఆసియా హ్యాండ్ బాల్

 

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com
Telugu Chandra Babu, Cm Kcr, Nikhil, Mamata Banerjee, Ramnath Kovind, Somu Veerr

ఆసియా పురుషుల క్లబ్ లీగ్ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ ఆతిథ్య హక్కులను హైదరాబాద్ దక్కించుకుంది. 

4.తెలంగాణలో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు

  రాగల మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

5.ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ సేకరణకు ఎఫ్.సీ.ఐ ఆమోదం

 

Telugu Chandra Babu, Cm Kcr, Nikhil, Mamata Banerjee, Ramnath Kovind, Somu Veerr

ఏ యాసంగి సీజన్ కు సంబంధించి ముడి బియ్యంతో పాటు , ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు ఎఫ్ సీ ఐ అంగీకరించింది. 

6.’ మల్లారెడ్డి ‘ లో 700 మందికి కృత్రిమ అవయవాలు

  వివిధ ప్రమాదాల్లో దివ్యాంగులు అయిన 700 మందికి మల్లారెడ్డి యూనివర్సిటీ, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కుత్రిమ కాళ్లు చేతులు అమర్చారు. 

7.కేసీఆర్ పై షర్మిల కామెంట్స్

 

Telugu Chandra Babu, Cm Kcr, Nikhil, Mamata Banerjee, Ramnath Kovind, Somu Veerr

తెలంగాణ సీఎం కేసీఆర్ మాట మీద నిలబడే మనిషి కాదని, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల విమర్శించారు. 

8.చిరుత సంచారం

  నర్సీపట్నం అర్బన్ బక్కన్నపాలెం లో చిరుత సంచారం కలకలం రేపింది.నిన్న రాత్రి రెండు ఆవులను పులి చంపి తినేసింది. 

9.నారీ సంకల్ప దీక్ష ప్రారంభం

 

Telugu Chandra Babu, Cm Kcr, Nikhil, Mamata Banerjee, Ramnath Kovind, Somu Veerr

 అనంతపురంలో ప్రారంభించిన నారీ సంకల్ప దీక్షకు ముఖ్యఅతిథిగా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత హాజరయ్యారు. 

10.వైసీపీ ప్రభుత్వం పై సుజనాచౌదరి కామెంట్స్

  రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ అందరినీ అతలాకుతలం చేసింది అని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. 

11.బిజెపి కోస్తా ఆంధ్ర ముఖ్య కార్యకర్తల సమావేశం

 

Telugu Chandra Babu, Cm Kcr, Nikhil, Mamata Banerjee, Ramnath Kovind, Somu Veerr

బిజెపి కోస్తాంధ్ర జూన్ ముఖ్య కార్యకర్తల సమావేశం గుంటూరులోని కన్వెన్షన్ సెంటర్ లో ప్రారంభమైంది.ఈ భేటీకి ముఖ్య అతిధులుగా కేంద్ర పశుసంవర్ధక , మత్స్య, సమాచార పౌరసంబంధాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, కేంద్ర విదేశీ వ్యవహారాలు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్, ఏపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు హాజరయ్యారు. 

12.రాష్ట్రపతికి పోస్ట్ కార్డులు పంపిన తాడేపల్లి రైతులు

  కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ , ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి తాడేపల్లి రైతులు పోస్ట్ కార్డులు పంపారు. 

13 విశాఖలో జనసేన వినూత్న నిరసన

 

Telugu Chandra Babu, Cm Kcr, Nikhil, Mamata Banerjee, Ramnath Kovind, Somu Veerr

పెంచిన విద్యుత్ చార్జీలు అప్రకటిత కరెంటు కోతలను నిరసిస్తూ జనసేన విశాఖలోని గురుద్వారా జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. 

14.కుప్పంలో గ్రానైట్ అక్రమ మైనింగ్ పై చంద్రబాబు లేఖ

  కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ మైనింగ్ పై చీఫ్ సెక్రటరీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. 

15.హీరో నిఖిల్ కు పితృ వియోగం

 

Telugu Chandra Babu, Cm Kcr, Nikhil, Mamata Banerjee, Ramnath Kovind, Somu Veerr

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రి కావలి శ్యాంప్రసాద్ సిద్ధార్థ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మరణించారు. 

16.ఢిల్లీకి జగన్

 ఏపీ సీఎం జగన్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు.సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ చేరుకుని ప్రధాని నరేంద్ర మోది తో ఆయన భేటీ కానున్నారు. 

17.నేడు హైదరాబాద్ కు నితిన్ గడ్కరీ

 

Telugu Chandra Babu, Cm Kcr, Nikhil, Mamata Banerjee, Ramnath Kovind, Somu Veerr

నేడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్ కు రానున్నారు.12 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్నారు. 

18.సాయి గణేష్ ఆత్మహత్య పై నేడు హైకోర్టులో విచారణ

  ఖమ్మం సాయి గణేష్ ఆత్మహత్య ఘటన పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.సిబిఐ దర్యాప్తు జరపాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారించనుంది. 

19.నేడు ఢిల్లీ కి మమతా బెనర్జీ

 

Telugu Chandra Babu, Cm Kcr, Nikhil, Mamata Banerjee, Ramnath Kovind, Somu Veerr

నేడు ఢిల్లీలో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ పర్యటించనున్నారు.రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఆమె మకాం వేయనున్నారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,550
  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,960

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube