1.నేడు జగన్ పర్యటన
నేడు విశాఖ అనకాపల్లి జిల్లా లో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు.సబ్బవరం మండలం పైడివాడ లో 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాలు జగన్ ఇవ్వనున్నారు.
2.గవర్నర్ తో జగన్ సమావేశం
ఏపీ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ తో నేడు ఏపీ సీఎం జగన్ భేటీ కానున్నారు.
3.నేడు అసోం లో ప్రధాని పర్యటన
నేడు అసోం లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించ నున్నారు.ఈ సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
4.మంత్రి తలసాని కి 50 వేల జరిమానా
నిబంధనలకు విరుద్ధంగా టీఆర్ఎస్ ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయడం పై జీహెచ్ఎంసి అధికారులు జరిమానాలు విధించారు.మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు 50 వేల జరిమానా విధించారు.
5.టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పై కేసు నమోదు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ తాండూర్ సీఐ ను దూషించిన కేసులో ఆయన పై పోలీసులు కేసు నమోదు చేశారు.
6.రేపు నాగార్జున సాగర్ కు రేవంత్ రెడ్డి
టి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు నాగార్జున సాగర్ లో పర్యటించనున్నారు.
7.గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు 33 సెంటర్లు
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల ను తెలంగాణా వ్యాప్తంగా 33 కేంద్రాల లో నిర్వహించనున్నారు.
8.ఆ ఆడియో నాది కాదు : పట్నం మహేందర్ రెడ్డి
తాండూరు టౌన్ సిఐ రాజేందర్ రెడ్డి ని తాను దూషించలేదని, ఆ ఆడియో తనది కాదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
9.డీజీపీ కి వర్ల రామయ్య లేఖ
మైనింగ్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీ కి లేఖ రాశారు.
10.జగన్ కు లోకేష్ లేఖ
ధాన్యం రైతుల దైన్యం పై ఏపీ సీఎం జగన్ కు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు.రాజన్న రాజ్యం అంటే రైతన్న రాజ్యమని ఇచ్చిన భరోసా ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు.
11.పదో తరగతి పరీక్షా పేపర్ల లీకేజీ కలకలం
శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్ష పేపర్లు లీకేజీ కలకలం రేపింది.సరుబుజ్జిలి మండలం రొట్ట వలస, షలంత్రి సెంటర్ల నుంచి హిందీ పేపర్ బయటకు రావడం కలకలం రేపింది.అయితే ఇదంతా వదంతులేనని విచారణకు ఆశిస్తున్నట్టు కలెక్టర్ శ్రీ కేష్ లాటకర్ తెలిపారు.
12.సినిమాలపై ఉపరాష్ట్రపతి కామెంట్స్
సినిమాల్లో అశ్లీలత వైలెన్స్ పెరిగిపోతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
13.నేటి నుంచి విజయవాడ బిట్రగుంట మధ్య ప్యాసింజర్ రైళ్లు
విజయవాడ బిట్రగుంట మధ్య ప్యాసింజర్ రైళ్లను రైల్వే శాఖ అధికారులు గురువారం నుంచి పునః ప్రారంభించారు .
14.వైద్య శాఖలో కాంట్రాక్టు సిబ్బంది సేవలు 6నెలల పొడగింపు
కోవిడ్ క్లిష్టసమయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నియమించుకున్న సిబ్బందికి కర్ణాటక మంత్రి సుధాకర్ శుభవార్త చెప్పారు.వీరిని మరో ఆరు నెలల పాటు కొనసాగించబోతున్నట్లు తెలిపారు.
15.మోదీ పై రాహుల్ గాంధీ ఆగ్రహం
రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ పై పన్నులను తగ్గించడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోది చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఖండించారు.
16.పట్నం మహేందర్ రెడ్డి కి అవమానం జరిగింది : కోమటిరెడ్డి
ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వ్యవహారం పై కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.పట్నం మహేందర్ రెడ్డి కి అవమానం జరిగిందని, ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఎక్కువని వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు.మహేందర్ రెడ్డి పోలీసులను బూతులు తిట్టడం తప్పే అయినా , పోలీసులు పద్ధతి కూడా మారాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
17.బాపు మ్యూజియం ను సందర్శించిన రోజా
ఏపీ టూరిజం మంత్రి రోజా గురువారం ఉదయం బాపు మ్యూజియం ను సందర్శించారు.పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు నివాళులు సమర్పించారు.
18.పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ .12 మంది అరెస్ట్
ఏపీ లోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లె లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయిన ఘటనలో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
19.తార్నాక టిఎస్ ఆర్టీసీ ఆసుపత్రిలో నర్సింగ్ కాలేజీ ప్రారంభం
తార్నాకలోని టిఎస్ఆర్టిసి ఆస్పత్రి ఆవరణలో నూతన నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి వీసీ సజ్జనార్ తో కలిసి శంకుస్థాపన చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,000 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,370
.