న్యూస్ రౌండప్ టాప్ 20

1.గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం

  హైదరాబాద్ లోని జలసౌదా లో గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం ప్రారంభం అయ్యింది. 

2.షర్మిల కామెంట్స్

 

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com
Telugu Cm Kcr, Elon Musk Deal, Godavaririver, Janasenapothina, Rajath Kumar, Tan

టీఆర్ఎస్ ప్రభుత్వం పై వైఎస్ షర్మిల కామెంట్స్ చేశారు.రైతులకు మద్దతు ధర ప్రకటించని ప్రభుత్వం ఎందుకు అంటూ షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. 

3.తెలంగాణ లో అవినీతి మంత్రులు లేరు

  తెలంగాణ రాష్ట్రంలో అవినీతి మంత్రులు లేరని పార్టీ ప్లీనరీలో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. 

3.జనసేన కార్యాలయంలో ఉద్రిక్తత

 

Telugu Cm Kcr, Elon Musk Deal, Godavaririver, Janasenapothina, Rajath Kumar, Tan

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.ముస్లిం ల సమస్యలపై వన్ టౌన్ నెహ్రూ సెంటర్ లో ధర్నాకు జనసేన నేత పోతిన మహేష్ పిలుపునిచ్చారు.అయితే ఆయన్ను పోలీసులు అడ్డుకోవడం తో ఉద్రిక్తత నెలకొంది. 

4.మహిళా కమిషన్ కార్యాలయం వద్ద టీడీపి ఆందోళన

  ఏపీ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపుడి అనిత ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 

5.విజయవాడ లో ట్రాఫిక్ ఆంక్షలు

 

Telugu Cm Kcr, Elon Musk Deal, Godavaririver, Janasenapothina, Rajath Kumar, Tan

విజయవాడ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.విజయవాడ నగరంలో జగన్ పర్యటించబోతున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించారు. 

6.కెనరా బ్యాంకు రుణం తీర్చేసిన ఏపీ నిట్

  ఏపీ నిట్ క్యాంపస్ శాశ్వత క్యాంపస్ నిర్మాణం కోసం కెనరా బ్యాంక్ లో తీసుకున్న 250 కోట్ల రుణాన్ని నిట్ తీర్చివేసింది. 

7.ఉప రాష్ట్ర వెంకయ్య కు ఘన స్వాగతం

 

Telugu Cm Kcr, Elon Musk Deal, Godavaririver, Janasenapothina, Rajath Kumar, Tan

నాలుగు రోజుల పర్యటన నేపథ్యంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి నెల్లూరు లో ఘన స్వాగతం లభించింది. 

8.టీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ట్వీట్

చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరాయని, అమరవీరుల , ఉద్యమకారుల త్యాగాలతో ఆవిర్భవించిన తెలంగాణ కు గులాబీ చీడ పట్టింది అంటూ టీఆర్ఎస్ ను ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

9.టీఆర్ఎస్ ఫ్లెక్సీ లపై హై కోర్ట్ లో కేఏ పాల్ పిటీషన్

 

Telugu Cm Kcr, Elon Musk Deal, Godavaririver, Janasenapothina, Rajath Kumar, Tan

టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీల పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ విమర్శలు చేశారు.దీనిపై తెలంగాణ హై కోర్టులో ఆయన పిటీషన్ దాఖలు చేశారు. 

10.గవర్నర్ వ్యవస్థ పై కేసీఆర్ కామెంట్స్

  గవర్నర్ వ్యవస్థ పై తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్స్ చేశారు.గవర్నర్ వ్యవస్థ దుర్మార్గపు వ్యవస్థ అంటూ అంటూ కేసీఆర్ మండిపడ్డారు. 

11.పెట్రో ధరల పెరుగుదల పై ప్రధాని కామెంట్స్

 

Telugu Cm Kcr, Elon Musk Deal, Godavaririver, Janasenapothina, Rajath Kumar, Tan

పెట్రోల్ ధరల పెరుగుదల కు రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమని ప్రధాని విమర్శించారు. 

12.మే 4 న ఎల్ ఐ సీ మెగా ఐపీవో

  భారత్ లో మెగా ఇపీవో ను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది.మే లో మెగా ఐపీవో మార్కెట్ లోకి రానుందని ప్రకటించింది. 

13.ఏపీ అభ్యంతరాలను జీఆర్ఎంబి చైర్మన్ తిరస్కరించారు : రజత్ కుమార్

 

Telugu Cm Kcr, Elon Musk Deal, Godavaririver, Janasenapothina, Rajath Kumar, Tan

హైదరాబాద్ లోని జలసౌదాలో నదీ యాజమాన్య బోర్డ్ సమావేశం ముగిసింది.బోర్డ్ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. 

14.వైద్య ఆరోగ్య శాఖ పై జగన్ సమీక్ష

 

Telugu Cm Kcr, Elon Musk Deal, Godavaririver, Janasenapothina, Rajath Kumar, Tan

వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. 

15.తెలంగాణ నీటిని ఏపీ వాడుకుంటోంది : రజత కుమార్

  తెలంగాణ నీటిని ఏపీ వాడుకుంటోందని తెలంగాణ నేటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి  రజత కుమార్ అన్నారు. 

16.యూరప్ లో మోదీ పర్యటన

 ప్రధాని నరేంద్ర మోదీ యూరప్ పర్యటన ఖరారైంది.వచ్చే నెల 2,4 తేదీల మధ్య యూరప్ లో పర్యటించనున్నట్టు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. 

17.ఈ దేశంలో కొత్త రాజకీయ శక్తి అవిర్భవించాలి

 

Telugu Cm Kcr, Elon Musk Deal, Godavaririver, Janasenapothina, Rajath Kumar, Tan

భారత దేశంలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. 

18.ట్విట్టర్ డీల్ తో టెస్లా కు 9 లక్షల కోట్ల నష్టం

  ట్విట్టర్ డీల్ తో టెస్లా కు 9 లక్షల కోట్ల నష్టం  వాటిల్లినట్టు సమాచారం. 

19.తంజావూరు లో 11 మంది సజీవ దహనం

 

Telugu Cm Kcr, Elon Musk Deal, Godavaririver, Janasenapothina, Rajath Kumar, Tan

తమిళనాడు లోని తంజావూరు లో కరిమేడు అప్సర్ ఆలయ రథం ఊరేగింపులో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది భక్తులు సజీవ దహనం అయ్యారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,450
  24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52,860

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube