1.కేటీఆర్ తో చర్చలకు సిద్ధం : బిజెపి ఎమ్మెల్యే
కేంద్ర నిధుల పై మంత్రి కేటీఆర్ తో చర్చించేందుకు తాను సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు.
2.కెసిఆర్ చేతిలో అందరూ మోసపోయారు : షర్మిల
తెలంగాణ సీఎం కేసీఆర్ చేతిలో మోసపోయిన వర్గం అంటూ లేదని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు విమర్శించారు.
3.ప్రాణహిత పుష్కరాలు
ప్రాణహిత పుష్కరాలు నేటికి పదకొండో రోజుకు చేరుకున్నాయి.
4.వేములవాడలో భక్తుల రద్దీ
వేములవాడ లోని రాజరాజేశ్వరి క్షేత్రం భక్తులతో రద్దీగా మారింది.
5.తల్లి కొడుకుల ఆత్మహత్య కేసు నివేదిక రాజ్ భవన్ కు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన తల్లీకొడుకుల ఆత్మహత్య కేసులో గవర్నర్ కు పూర్తి నివేదిక చేరింది.
6.పవన్ కళ్యాణ్ పరామర్శ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు .ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు.ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు.
7.ఢిల్లీకి చేరుకున్న ఏపీ గవర్నర్
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీకి వెళ్లారు.
8.త్వరలోనే తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల నుంచి తిరుపతికి నడిపేందుకు పైలెట్ ప్రాజెక్టుగా 100 ఎలక్ట్రిక్ బస్సులు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు.
9.వైసిపి ఆధ్వర్యంలో జాబ్ మేళా
నేటి నుంచి మూడు రోజుల పాటు వైసీపీ ఆధ్వర్యంలో విశాఖలో జాబ్ మేళా నిర్వహించనున్నారు.ఈ మేళా ద్వారా 23,935 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు.
10.స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘం ఎన్నికలు
ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి.దీని కోసం 17 బూత్ లను ఏర్పాటు చేశారు.
11.ఖైదీలతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ముఖా ముఖి
నేడు రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అషానుద్దిన్ అమానుల్లా భేటీ అయ్యారు.
12.నేడు విశాఖలో ఢిల్లీ డిప్యూటీ సీఎం పర్యటన
నేడు విశాఖపట్నంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పర్యటించనున్నారు.
13.శ్రీకాకుళం వైసీపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న ధర్మాన
నేడు శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
14.జీవిత రాజశేఖర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
జీవిత రాజశేఖర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది చిత్తూరు జిల్లా నగరి కోర్టు.జోస్టర్ ఎండి హేమ ఫిర్యాదుతో ఈ వారెంట్ జారీ అయింది.
15.నారా లోకేష్ తో భేటీ పై స్పందించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
తాను నారా లోకేష్ తో భేటీ అయినట్లు ఒక్క సాక్ష్యం అయిన ఉంటే బయట పెట్టాలని మీడియా ముఖంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సవాల్ విసిరారు.ఎట్టి పరిస్థితుల్లోనూ తాను టిడిపిలో చేరే అవకాశం లేదంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.
16.సమస్యల పరిష్కారం కోసం ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడి
ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో కార్యాలయాన్ని ముట్టడించారు.
17.నా పరువు ఎవరైనా చూస్తే ఊరుకోం : జీవిత రాజశేఖర్
‘గరుడ వేగ’ సినిమా విషయంలో జీవిత రాజశేఖర్ తమను మోసం చేశారని జోస్టార్స్ ప్రొడక్షన్స్ కు చెందిన కోటేశ్వరరావు, హేమ ఆరోపణలు చేసిన నేపథ్యంలో జీవిత రాజశేఖర్ ఈ వ్యవహారంపై స్పందించారు .తమ పరువు తీసేందుకే ఈ విధంగా వారు వ్యవహరిస్తున్నారని, చూస్తూ ఊరుకోబోమని వారు హెచ్చరించారు.
18.గ్రామ పంచాయతీల్లో క్రీడా మైదానాలు , జిమ్ లు
100 గ్రామపంచాయతీలు క్రీడా మైదానాలు, జిమ్ ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
19.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2527 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -49,000 24.క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -53,450
.