న్యూస్ రౌండప్ టాప్ - 20

1.ట్యాంక్ బండ్ పరిసరాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14వ తేదీన ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్న మని సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News April 13 2021-TeluguStop.com

2.బిజెపి నేతలకు వార్నింగ్

ఉద్యోగాల పేరుతో రాజకీయాలు చేయవద్దని,  కొందరు నాయకులు వీటిపై సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని , తెలంగాణ మంత్రి కేటీఆర్ బిజెపి ,కాంగ్రెస్ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

3.మంచిర్యాల లో నకిలీ ఐఏఎస్

తాను వైఎస్ ని అని చెప్పడమే కాకుండా అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడిన ఉదంతం మంచిర్యాల జిల్లా కేంద్రంలో సంచలనం రేపింది.తాను ఐఏఎస్ ని అని చెబుతూ, అనేక మంది దగ్గర లక్షలు వసూలు చేసిన జగిత్యాల జిల్లా బీరాపూర్ మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News April 13 2021-న్యూస్ రౌండప్ టాప్ – 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.అటవీ సిబ్బందిపై ఆదివాసీ మహిళల దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం రేంజి బి కొత్తూరు బీట్  చింత గుప్ప వద్ద అటవీ సిబ్బందిపై సోమవారం ఆదివాసి మహిళలు దాడి చేశారు.

5.ఢిల్లీకి తెలంగాణ మామిడి రైలు

తెలంగాణ నుంచి తొలిసారి మామిడికాయల లోడుతో కిసాన్ రైలు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళింది.

6.సీఎం సభ ,సాగర్ ఎన్నికను రద్దు చేయాలి

కరోనా సాకుతో ఏప్రిల్ 5న జగ్జీవన్ రామ్ జయంతి, 11న పూలే జయంతి, 14 న అంబేద్కర్ జయంతి వేడుకలను రద్దు చేసినందున, నాగార్జునసాగర్ ఉప ఎన్నికను రద్దు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కి ‘కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి’ జాతీయ అధ్యక్షుడు పరుశురాం కోరారు.

7.తెలుగులో ఉగాది శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని

ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు చెప్పారు.ఈ మేరకు ఆయన లో తెలుగులో శుభాకాంక్షలు పోస్ట్ పెట్టారు.

8.పంటల బీమాకు ఆధార్ తప్పనిసరి

రైతులు పంటల బీమా రాయితీ విత్తనాలు పొందడానికి ఆధార్ గుర్తింపు సంఖ్యను తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

9.టీడీపీకి స్థలం కేసు విచారణ వాయిదా

తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి గుంటూరు జిల్లా ఆత్మకూరు మండలం లో గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా స్థలం కేటాయించాలంటూ దాఖలైన పిటీషన్ పై సుప్రీం కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది.

10.483 వ రోజుకు చేరిన అమరావతి నిరసనలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు, రైతు కూలీలు, మహిళా రైతులు చేస్తున్న ఆందోళనలు మంగళవారం నాటికి 483 వ రోజుకి చేరుకున్నాయి.

11.పులివెందులకు సిబిఐ అధికారులు

జగన్ చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు పలువురిని విచారించారు.ఈ మేరకు వారు పులివెందులలోని వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు.

12.విశాఖలో పశు వ్యాధుల కాల్ సెంటర్

పశువుల పాదాలు నోటి వ్యాధుల నియంత్రణ కు కేంద్రం సాయంతో రాష్ట్ర ప్రభుత్వం కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది.కృష్ణాజిల్లా గన్నవరం లో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ఉన్నందున కొత్త కాల్ సెంటర్ రాష్ట్రస్థాయిలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

13.ఉగాది కానుకగా రాష్ట్రానికి కిసాన్ రైలు

ఏపీలో ఈ మామిడిపండ్ల రైతులకు ఉగాది కానుకగా రైలును ఏర్పాటు చేసినందుకు కేంద్ర మంత్రి గోయల్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం కృతజ్ఞతలు తెలిపారు.

14.తిరుమల సమాచారం

తెలుగు నూతన సంవత్సరాది, శ్రీ ప్లవ నామ ఉగాది సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం, పరిసర ప్రాంతాలను సుందరంగా అలంకరించారు.ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో ఉగాది ఆస్థానం జరగనుంది.

15.నేటి నుంచి భద్రాద్రి రాముడి బ్రహ్మోత్సవాలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నేటి నుంచి శ్రీరామనవమి, తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.ఇవి ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి.

16.రేపటి నుంచి ఊటీ హార్స్ రేస్

వేసవి సీజన్  ఉత్సవాల్లో  భాగంగా ఊటి హార్స్ రేస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.

17.మ్యూజిక్ ఇండస్ట్రీలోకి జెమిని గ్రూప్

75 సంవత్సరాల చరిత్ర ఉన్న జెమినీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు జెమిని సంస్థ సీఈఓ పి వి ఆర్ మూర్తి చేతుల మీదుగా జరిగాయి.ఈ సందర్భంగా జెమిని గ్రూప్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించింది.

18.ఆక్సిజన్ కొరతతో ఆస్పత్రిలో ఏడుగురు రోగుల మృతి

ఆక్సిజన్ కొరతవల్ల ఆసుపత్రిలో ఏడుగురు రోగులు మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో జరిగింది.

19.కుంభకోణం అన్నాడీఎంకే అభ్యర్థికి కరోనా పాజిటివ్

తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం శాసన సభ నియోజక వర్గం అన్నా డీఎంకే అభ్యర్థి ,  మువేద్రం మున్నేట్ర కళగం అధ్యక్షుడు శ్రీధర్ వండయార్ కరోనా పాజిటివ్ ప్రభావానికి గురయ్యారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -44,760

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,760.

#Gemini Group #Roundup #CoronaCases #APAnd #Today Gold Rate

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు