న్యూస్ రౌండప్ టాప్ 20

Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News 7 December 2021 Today

1.హుస్సేన్ సాగర్ లో సంగీత కచేరీ

Telugu Ap Telangana, Apgovernor, Jagan, Prabhas, Somu Veerraju, Gold, Top-Latest News - Telugu

హుస్సేన్ సాగర్ లోని బుద్ధ విగ్రహం వద్ద ఈ నెల 12 వ తేదీన సంగీత కచేరీ కార్యక్రమాన్ని ఉదయం 7 నుంచి 8.30 వరకు సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News 7 December 2021 Today-TeluguStop.com

2.ఉద్యమ బాట పట్టిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు

తమ డిమాండ్ల విషయంలో ఏపీ ప్రభుత్వం పట్టించుకోనట్లు గా వ్యవహరించడం పై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు.

3.సోము వీర్రాజు సంచలన ప్రకటన

Telugu Ap Telangana, Apgovernor, Jagan, Prabhas, Somu Veerraju, Gold, Top-Latest News - Telugu

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ప్రకటన చేశారు.2024 తరువాత తాను రాజకీయాల్లో ఉండను అంటూ ప్రకటించారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News 7 December 2021 Today-న్యూస్ రౌండప్ టాప్ 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.జగన్ పై సీపీఐ విమర్శలు

పోలవరం విషయంలో కేంద్రం వైఖరి సరిగా లేదని, అయినా జగన్ నోరు ఎందుకు మెదపడం లేదు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

5.ఏపీ కి భారీ వర్ష సూచన

Telugu Ap Telangana, Apgovernor, Jagan, Prabhas, Somu Veerraju, Gold, Top-Latest News - Telugu

ఏపీ లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అమరావతి వాతావరణం కేంద్రం అధికారులు తెలిపారు.

6.బీజేపీ లో చేరిన తీన్మార్ మల్లన్న

Telugu Ap Telangana, Apgovernor, Jagan, Prabhas, Somu Veerraju, Gold, Top-Latest News - Telugu

తెలంగాణ కు చెందిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బీజేపీ లో చేరారు.

7.ఆర్జీయూకేటి సీట్లకు  కౌన్సిలింగ్

ఆర్జీయూకేటి సీట్లకు 12, 13 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు ఆర్జీయూకేటి ఛాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు.

8.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ క్రమ క్రమంగా పెరుగుతోంది.సోమవారం తిరుమల శ్రీవారిని 29,367 మంది భక్తులు దర్శించుకున్నారు.

9.ఏపీ గవర్నర్ వినతి

Telugu Ap Telangana, Apgovernor, Jagan, Prabhas, Somu Veerraju, Gold, Top-Latest News - Telugu

సాయుధ దళాల పతాక నిధికి భారీగా విరాళం ఇచ్చి సహకరించాలని ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్  హరిచందన్ కోరారు.

10.9న కృష్ణ బోర్డ్ త్రిసభ్య కమిటీ భేటీ

కృష్ణ నదీ యాజమాన్య బోర్డ్ సమావేశం  ఈ నెల 9 వ తేదీన జరగనుంది.

11.జగన్ పై టీడీపీ విమర్శలు

Telugu Ap Telangana, Apgovernor, Jagan, Prabhas, Somu Veerraju, Gold, Top-Latest News - Telugu

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి చెందితే ఆయన పార్థీవ దేహాన్ని చూసేందుకు వెళ్లే తీరిక కూడా ఏపీ సీఎం జగన్ కు లేదా అని తెలుగు దేశం పార్టీ విమర్శించింది.

12.ఏపీలో పోలీస్ సంస్కరణలు చేపట్టాలి : కేశినేని

ఏపీలో పోలీసు సంస్కరణలు చేపట్టాలని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కేంద్రాన్ని కోరారు.

13.చింతామణి నాటకం నిషేధించాలి

Telugu Ap Telangana, Apgovernor, Jagan, Prabhas, Somu Veerraju, Gold, Top-Latest News - Telugu

కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్న చింతామణి నాటకాన్ని వెంటనే నిషేధించాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాయి.

14.పార్లమెంట్ లో కొనసాగుతున్న టీఆర్ఎస్ ఎంపీ ల ఆందోళన

ధాన్యం కొనుగోలు వ్యవహారం లో కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఆందోళన నిర్వహించారు.

15.తెలంగాణకు వర్ష సూచన

తెలంగాణలో రేపు ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్  వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

16.థియేటర్లలో ఆర్ఆర్ ఆర్ ట్రైలర్ రిలీజ్

Telugu Ap Telangana, Apgovernor, Jagan, Prabhas, Somu Veerraju, Gold, Top-Latest News - Telugu

ఈనెల 9వ తేదీన థియేటర్లలో ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.

17.ప్రభాస్ భారీ విరాళం

ఇటీవల సంభవించిన వరదలు,  వర్షాల కారణంగా భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించిన నేపథ్యంలో సినీ హీరో ప్రభాస్ కోటి రూపాయల సహాయాన్ని ఏపీ సీఎం సహాయ నిధికి ప్రకటించారు.

18.340 అంగన్వాడీ పోస్టుల భర్తీకి శ్రీకారం

Telugu Ap Telangana, Apgovernor, Jagan, Prabhas, Somu Veerraju, Gold, Top-Latest News - Telugu

అనంతపురం జిల్లాలో 340 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పిడి సుజన తెలిపారు.

19.తెలంగాణలో ఏఎన్ఎం శిక్షణకు దరఖాస్తులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమీషనర్ కార్యాలయం 2021-22 విద్యాసంవత్సరానికి గాను ఏ ఎన్ ఎం శిక్షణకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46, 820

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,820

.

#AP Telangana #Prabhas #Jagan #APGovernor #Gold

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube