న్యూస్ రౌండప్ టాప్ 20

Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News 27 11 2021 Today

1.కరోనా ఉధృతి పై  అధికారులతో ప్రధాని చర్చ

కరోనా వైరస్ ఉద్ధృతి , వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహించారు. 

2.జగన్ పై ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్స్

  ఏపీ సీఎం గన్ పరిపాలన చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. 

3.ఆర్ఎస్ఎస్ పై నారాయణ సంచలన కామెంట్స్

Telugu Ap Telangana, Cpi Yana, Primenarendra, Seniormurali, Tirupati, Gold, Top, Undavalliarun-Latest News - Telugu

  ఆర్ఎస్ఎస్ కుటుంబ పాలన దేశానికి ప్రమాదం అని సిపిఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. 

4.అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం జీతాలు పెంపు

  తెలంగాణలో అవుట్ సోర్సింగ్ పై పనిచేస్తున్న ఉద్యోగులకు 30 శాతం జీతాలు పెంచుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 

5.ఫ్రీ మెట్రిక్ 50 శాతం మెరిట్ నిబంధన రద్దు

  భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విద్యార్థులకు అందించే ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్  కు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి 50 శాతం  మార్కుల నిబంధన రద్దు చేసింది. 

6.తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి : బండి సంజయ్

Telugu Ap Telangana, Cpi Yana, Primenarendra, Seniormurali, Tirupati, Gold, Top, Undavalliarun-Latest News - Telugu

  తెలంగాణ త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని , ఓ జ్యోతిష్యుడు తనకు చెప్పాడని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 

7.కాంగ్రెస్ వరి దీక్ష ప్రారంభం

  తెలంగాణలో రైతులు పడుతున్న ఇబ్బందులు,  ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలనే డిమాండ్లతో కాంగ్రెస్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్ష ప్రారంభించింది. 

8.తెలంగాణలో కరోనా పై హరీష్ రావు సమీక్ష

Telugu Ap Telangana, Cpi Yana, Primenarendra, Seniormurali, Tirupati, Gold, Top, Undavalliarun-Latest News - Telugu

  తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతుండడం పై అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. 

9.కెసిఆర్ పై షర్మిల కామెంట్స్

  తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల విమర్శ చేశారు.కెసిఆర్ బిడ్డ ఒక సారి ఎన్నికల్లో ఓడిపోతే కేసీఆర్ గుండె తల్లడిల్లిందని, పెట్టకు రెండుసార్లు ఎమ్మెల్సీ ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అంటూ విమర్శించారు. 

10.రెండో రజు బీజేపీ కార్యవర్గ సమావేశం

Telugu Ap Telangana, Cpi Yana, Primenarendra, Seniormurali, Tirupati, Gold, Top, Undavalliarun-Latest News - Telugu

  తెలంగాణలో రెండో రోజు బీజేపీ కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో జరుగుతోంది. 

11.సీనియర్ నటుడు మురళీ శర్మ కు డాక్టరేట్

  టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ శర్మ తాజాగా గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు.న్యూ లైఫ్ థియో లాజికల్  యూనివర్సిటీ మురళీశర్మ కు డాక్టరేట్ ను  ప్రధానం చేసింది. 

12.27వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర

Telugu Ap Telangana, Cpi Yana, Primenarendra, Seniormurali, Tirupati, Gold, Top, Undavalliarun-Latest News - Telugu

  27వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. 

13.నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

  నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన సమావేశంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించబోతున్నారు. 

14.నేడు తెలంగాణలో కాంగ్రెస్ వరి దీక్ష

Telugu Ap Telangana, Cpi Yana, Primenarendra, Seniormurali, Tirupati, Gold, Top, Undavalliarun-Latest News - Telugu

  ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరి దీక్ష చేపట్టారు. 

15.హైదరాబాద్ సౌత్ జోన్ పోలీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా

  హైదరాబాద్ సౌత్ జోన్ పోలీస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా ను నిర్వహించారు. 

16.తిరుపతి నెల్లూరుకు వాన గండం

Telugu Ap Telangana, Cpi Yana, Primenarendra, Seniormurali, Tirupati, Gold, Top, Undavalliarun-Latest News - Telugu

  అల్పపీడనం ప్రభావంతో తిరుపతి నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 

17.తెలుగు అకాడమీ కేసు ఏసీబీకి బదిలీ

  తెలుగు అకాడమీ భారీ స్కాంలో బ్యాంక్ సిబ్బంది పాత్ర ఉందని, అధికారులు గుర్తించారు.దీంతో ఈ కేసును సిసిఎస్ పరిధి నుంచి ఏసీబీ కి బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

18.వ్యవసాయం పై కేంద్రం కమిటీ

Telugu Ap Telangana, Cpi Yana, Primenarendra, Seniormurali, Tirupati, Gold, Top, Undavalliarun-Latest News - Telugu

  వ్యవసాయం పై ప్రధాని నరేంద్ర మోడీ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. 

19.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శుక్రవారం తిరుమల శ్రీవారిని 24, 379 మంది భక్తులు దర్శించుకున్నారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,310   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర –  48, 310      

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News 27 11 2021 Today-TeluguStop.com
 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News 27 11 2021 Today-న్యూస్ రౌండప్ టాప్ 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Tirupati #Gold #PrimeNarendra #SeniorMurali #CPI Yana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube