1.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,85,914 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
2.టీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షుల నియామకం
టీఆర్ఎస్ పార్టీ జిల్లా ల అధ్యక్షుల నియామకం చేపట్టారు.మొత్తం 33 జిల్లాల అధ్యక్షులను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియమించారు.
3.ఏపీ ప్రభుత్వం పై ఉద్యోగ సంఘాల నేత సంచలన వ్యాఖ్యలు

ఏపీ ప్రభుత్వం పై ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.చదువుకున్నారా గాడిదలు కాశారా అంటూ ప్రభుత్వం పై సంచలన విమర్శలు చేశారు.
4.ప్రపంచవ్యాప్తంగా కరోనా
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది.కొత్తగా 33,20,485 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
5.ఎన్నికల అఫిడవిట్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్
ఎన్నికల అఫిడవిట్ మార్చాలంటూ తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు.ఎన్నికల సమయం నుంచి తనపై రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తూనే ఉన్నారని మంత్రి కామెంట్ చేశారు.
6.నాని పై నారాయణ కామెంట్స్
పద్మశ్రీ అవార్డుల్లో ఏపీ బూతుల మంత్రులను కూడా చేర్చింది అంటూ మంత్రి కొడాలి నాని ని ఉద్దేశించి సిపిఐ నారాయణ కామెంట్ చేశారు.
7.రైలుకు నిప్పు పెట్టిన ఆర్ఆర్ బీ అభ్యర్థులు

బీహార్ లో ఆర్ ఆర్ బి ఎన్.టి.పీసీ ఫలితాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.తాజాగా గయా లో రైలుకి ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
8.డ్రగ్స్ కేసులో పై కెసిఆర్ కామెంట్స్
డ్రగ్స్ కేసులో ఎంతటివారినైనా వదిలిపెట్టేదే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
9.కెసిఆర్ తప్పు చేశారు అంటూ రాజేందర్ కామెంట్స్

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు వెళ్లకుండా తప్పు చేశారంటూ హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు.
10.ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి బిజెపి ఎంపీ సవాల్
టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్ విసిరారు.రాబోయే ఎన్నికల్లో నిన్ను 50 వేల మెజార్టీ తో ఒడిస్తాను అంటూ అరవింద్ సవాల్ చేశారు.
11.చిరంజీవి అభినందనలు

పద్మశ్రీ అవార్డు గ్రహీత లకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు.
12.కేసిఆర్ కు విజయశాంతి వార్నింగ్
టిఆర్ఎస్ ప్రభుత్వం పై బిజెపి నాయకురాలు విజయశాంతి కామెంట్స్ చేశారు.
బిజెపి ఎంపీ అరవింద్ టిఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడడాన్ని విజయశాంతి తప్పుపట్టారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు విజయశాంతి వార్నింగ్ ఇచ్చారు.
13.ఏపీలో స్కూల్ కి సెలవు ఇవ్వాలి : లోకేష్

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తగ్గేవరకు స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
14.నేను రాజకీయాల్లోకి వస్తున్నా : నిర్మాత నట్టి కుమార్

తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, వైసీపీ అధినేత జగన్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడనుంచి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని నిర్మాత నట్టికుమార్ ప్రకటించారు.
15.దేశంలో 163.58 కోట్ల వ్యాక్సిన్ ల పంపిణీ
దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చురుగ్గా సాగుతోంది బుధవారం నాటికి 163.58 కోట్ల వాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
16.ప్రకాశం పంతులు మనవడికి అవమానం
టంగుటూరి ప్రకాశం పంతులు మనవడికి అవమానం జరిగింది.
ప్రతి సంవత్సరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రకాశం పంతులు మనోడు గోపాలకృష్ణ కు సన్మానం జరిగేది.అయితే ఈ సారి మాత్రం జరగకపోవడం పై ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
17.రివర్స్ లో జగన్ పాలన
జగన్ ఆధ్వర్యంలో ఏపీలో రివర్స్ పాలన జరుగుతోందని ఏపీ బిజెపి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
18.రేపటి నుంచి ఇంటర్ సర్టిఫికెట్లు

ఏపీలో రేపటి నుంచి ఇంటర్ సర్టిఫికెట్లు అందుబాటులోకి రానున్నాయి.గురువారం నుంచి ఇంటర్ సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరిబాబు తెలిపారు.
19.తిరుమల సమాచారం
తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.మంగళవారం తిరుమల శ్రీవారిని 28,745 మంది భక్తులు దర్శించుకున్నారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,900 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49,830