న్యూస్ రౌండప్ టాప్ 20

1.తెలంగాణ లో కరోనా

గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 45,567 మంది కరోనా పాజిటివ్ ప్రభావానికి గురయ్యారు.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold Rate, Raghuramakrishnam Raju, Jagan, Chandrababu, Kcr, Lata Mangeshkar, Omi Cron, Minister Harish Rao-TeluguStop.com

2.కరోనా కిట్ల పై మంత్రి హరీష్ రావు కామెంట్స్

కోవిడ్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామని, పిల్లలు, పెద్దల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామని, అలాగే కోటి హోం కిట్లను కూడా సిద్ధం చేశామని వైద్య ఆరోగ్యశాఖ శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.

3.సంజయ్ ఫిర్యాదుపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ స్పందన

తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు పై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ స్పందించింది.తెలంగాణ సీఎస్ , హోం శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.

 AP And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold Rate, Raghuramakrishnam Raju, Jagan, Chandrababu, Kcr, Lata Mangeshkar, Omi Cron, Minister Harish Rao-న్యూస్ రౌండప్ టాప్ 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శుక్రవారం తిరుమల శ్రీవారిని 34,440 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

5.రేపటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు

తెలంగాణ లో రేపటి నుంచి మూడు రోజుల పాటు తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

6.స్టీల్ ప్లాంట్ కోసం సంతకాల సేకరణ

విశాఖ లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ కార్పొరేషన్ పాలకమండలి సభ్యులు  సంతకాల సేకరణ చేపట్టారు.

7.జగన్ కు ముద్రగడ లేఖ

జగన్ కు కాపు ఉద్యమ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు.ఓటీఎస్ పేరుతో డబ్బు కట్టించుకోవడం సబబు కాదని లేఖలో పేర్కొన్నారు.

8.విశాఖలో పొగ మంచు .అనేక విమానాలు రద్దు

విశాఖలో పొగ మంచు దట్టంగా అపుముకోడం తో అనేక విమానాల ను దారి మళ్లించారు.మరికొన్నింటిని రద్దు చేశారు.

9.ఉద్యోగుల పోరాటానికి సీపీఐ మద్దతు

ఏపీ లో ఉద్యోగులు చేపడుతున్న ఉద్యమానికి సీపీఐ మద్దతు ఉంటుందని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.

10.శ్రీశైలంలో ఏడు రోజులు హోమాలు

శ్రీశైలంలో ఈ నెల 23 నుంచి లోక కళ్యానార్థం ఏడు రోజుల పాటు హోమాలు నిర్వహిస్తున్నట్టు దేవస్థానం అధికారులు తెలిపారు.

11.ఏపీలో ఆర్టీసీ సమ్మె

ఏపీ లో ప్రభుత్వ ఉద్యోగులు ఫిబ్రవరి 7 నుంచి సమ్మె కు దిగనున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు వారికి మద్దతుగా సమ్మెకు దిగుతుండడంతో ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి.

12.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జగన్

నీతి అయోగ్ పై ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

13.ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్ట్ ల విధ్వంసం

ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్ట్ ల విధ్వంసం సృష్టించారు.బీజాపూర్ జిల్లా, చెరికంటి గ్రామంలో 12 వాహనాలకు నిప్పు పెట్టారు.

14.సిద్దిపేట లో ఇంటింటా ఫీవర్ సర్వే

తెలంగాణలో ఇంటింటా ఫీవర్ సర్వే కొనసాగుతోంది.మెదక్ జిల్లా సిద్దిపేట లో ఈ సర్వేలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.

15.  తెలంగాణ లో ఒమి క్రాన్ విజృంభణ

తెలంగాణ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి.అయితే బాధితులు ఆసుపత్రి కి రానవసరం లేదని, హోమ్ ఐసోలేషన్ లో ఉండి మందులు వాడితే సరిపోతుంది అని వైద్యులు సూచిస్తున్నారు.

16.ఏపీలో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 13,212 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

17.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,37,704 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

18.రామరామ కామెంట్స్

తన ఫోటో వేస్తేనే సాక్షి మీడియాకు టీఆర్పీ వస్తుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

19.నిలకడగా లతా మంగేష్కర్ ఆరోగ్యం

ప్రముఖ గాయని లతా మాంగేష్కర్ ఆరోగ్యం పై వస్తున్న వార్తలపై ఆమె అధికార ప్రతినిధి ప్రకటన చేశారు.ప్రస్తుతం ఆమె ముంబై లోని బీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు అని, ఆమె ఆరోగ్యం పై వస్తున్న వదంతుల్లో నిజం లేదని ప్రకటించారు.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -47,530

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49,530

.

Video : AP And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold Rate, Raghuramakrishnam Raju, Jagan, Chandrababu, Kcr, Lata Mangeshkar, Omi Cron, Minister Harish Rao

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube