న్యూస్ రౌండప్ టాప్ 20

1.‘ పెగాసస్ ‘ పై సుప్రీం లో 5 న విచారణ

‘పెగాసస్ ‘ పై సుప్రీం లో విచారణ ఈ నెల 5న విచారణ జరగనుంది.రాజకీయ నేతలు, జర్నలిస్టులతో పాటు అనేక మంది ప్రముఖుల ఫోన్ లు హ్యక్ అయ్యాయి అనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సుప్రీంలో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో దీనిపై విచారణ జరగనుంది.
 
2.ఈటెల రాజేందర్ కు పరామర్శలు

Telugu Ap And Telangana News Headlines, Ap Ecet, Basara, Breaking News, Chandrababu, Etela Rajendar, Kcr, Pegasus, Roundup, Tirumala Tirupathi Devasthanam, Today Gold Rate, Top20 News-Latest News - Telugu

  పాదయాత్ర చేస్తూ అస్వస్థతకు గురైన ఈటెల రాజేందర్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు రఘునందన్ రావు రాజాసింగ్ ఈటెల ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
 
3.జూరాల ప్రాజెక్టు 47 గేట్లు ఎత్తివేత

  జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది.దీంతో ప్రాజెక్టుకు 47 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేశారు.
 
4.17 వరకు ఇంటర్ ప్రవేశాల గడువు పెంపు

  ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువు ఆగస్టు 17 వరకు పొడిగిస్తూ బోర్డు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
 
5.8న సింగరేణిలో ఫిట్టర్ ఉద్యోగాలకు పరీక్ష

Telugu Ap And Telangana News Headlines, Ap Ecet, Basara, Breaking News, Chandrababu, Etela Rajendar, Kcr, Pegasus, Roundup, Tirumala Tirupathi Devasthanam, Today Gold Rate, Top20 News-Latest News - Telugu

  కరుణ కారణంగా సింగరేణిలో వాయిదా పడిన ట్విట్టర్ ఎక్స్టర్నల్ కేటగిరీ ఉద్యోగాల భర్తీ కోసం ఆగస్టు 8న పరీక్ష నిర్వహించనున్నారు.
 
6.3 నుంచి 1,2 తరగతులకు ఆన్లైన్ క్లాసులు

  ఆగస్ట్ 3 నుంచి 1,2 తరగతులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.
 
7.ఆన్లైన్ లో సహకార సంఘాల రిజిస్ట్రేషన్

  తెలంగాణలో సహకార సంఘాల రిజిస్ట్రేషన్ ఇక ఆన్లైన్ లో జరగనుంది.జిల్లా సహకార కార్యాలయాలకు వెళ్ళకుండానే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బైలాస్ ను దరఖాస్తుదారుడు ఆన్లైన్ ద్వారా పొందవచ్చు.
 
8.ఆర్జీయూకేటి నోటిఫికేషన్ విడుదల

Telugu Ap And Telangana News Headlines, Ap Ecet, Basara, Breaking News, Chandrababu, Etela Rajendar, Kcr, Pegasus, Roundup, Tirumala Tirupathi Devasthanam, Today Gold Rate, Top20 News-Latest News - Telugu

  తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర లోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.ఆగస్టు 2 నుంచి 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.ఆగస్ట్ 18 న ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటిస్తారు.
 
9.బిసి బంధు కావాలి

  ఆర్థిక సామాజిక రాజకీయ విద్యా రంగాలలో వెనుకబడి బీసీల సంక్షేమం కోసం బిసి బంధు పథకం ప్రవేశపెట్టాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలోని బృందం మంత్రి గంగుల కమలాకర్ కు వినతి పత్రం సమర్పించింది.
 
10.డీజీపీ కి చంద్రబాబు లేఖ

Telugu Ap And Telangana News Headlines, Ap Ecet, Basara, Breaking News, Chandrababu, Etela Rajendar, Kcr, Pegasus, Roundup, Tirumala Tirupathi Devasthanam, Today Gold Rate, Top20 News-Latest News - Telugu

  టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీ కి లేఖ రాశారు.కర్నూలు జిల్లా పెసర వాయి లో జంటహత్యల పై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆ లేఖలో కోరారు.
 
11.తిరుమల లో పులి సంచారం

  తిరుమలలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.తిరుమల, పాపవినాశనం దారిలోని గోగర్భం అటవీశాఖ గార్డెన్ వద్ద  చిరుత కనిపించడంతో అందరు భయాందోళనకు గురయ్యారు.
 
12.శ్రీశైలంలో భక్తుల రద్దీ

  శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు.శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడం, ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు భారీగా స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు.
 
13.తిరుమల సమాచారం

Telugu Ap And Telangana News Headlines, Ap Ecet, Basara, Breaking News, Chandrababu, Etela Rajendar, Kcr, Pegasus, Roundup, Tirumala Tirupathi Devasthanam, Today Gold Rate, Top20 News-Latest News - Telugu

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శనివారం తిరుమల శ్రీవారిని 20,453 మంది భక్తులు దర్శించుకున్నారు.
 
14.భారత్ లో కరోనా

  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 41,831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
15.పోలీసులు మావోయిస్ట్ ల మధ్య ఎదురు కాల్పులు

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందారు.
 
16.కావేరి లు స్నానాల పై నిషేధం

Telugu Ap And Telangana News Headlines, Ap Ecet, Basara, Breaking News, Chandrababu, Etela Rajendar, Kcr, Pegasus, Roundup, Tirumala Tirupathi Devasthanam, Today Gold Rate, Top20 News-Latest News - Telugu

ఆడి పెరుక్కు, ఆడి అమావాస్య పర్వదినాల్లో కావేరి పరివాహక ప్రాంతాల్లో స్నానాల పై నిషేధం విధించారు.
 
17.1,2 తరగతులకు ఆన్లైన్ క్లాసులు

  తెలంగాణలో ఆగస్టు 3 నుంచి ఒకటి రెండు తరగతులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.
 
18.ఏపీ ఈసెట్ ప్రవేశ పరీక్ష

  డిప్లమా కోర్సులు పూర్తి చేసి బీటెక్ ఏ సంవత్సరంలో అడ్మిషన్ పొందేందుకు నిర్వహిస్తున్న ఏపీ ఈసెట్ షెడ్యూల్ ఖరారైంది.జులై 12వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని, 1,000 జరిమానా తో 23వ తేదీ వరకు అవకాశం కల్పించామని, సెప్టెంబర్ 19న ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నామని కన్వీనర్లు రంగ జనార్ధన్ , శశిధర్ తెలిపారు.
 
19.మూడు రోజుల పాటు మోస్తారు వర్షాలు

Telugu Ap And Telangana News Headlines, Ap Ecet, Basara, Breaking News, Chandrababu, Etela Rajendar, Kcr, Pegasus, Roundup, Tirumala Tirupathi Devasthanam, Today Gold Rate, Top20 News-Latest News - Telugu

  తెలంగాణలో రాబోయే మూడు రోజులపాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
 
20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,380   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,380

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News 1 Aguest 2021 Today-TeluguStop.com
 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News 1 Aguest 2021 Today-న్యూస్ రౌండప్ టాప్ 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Pegasus #Ap Ecet #Today Gold Rate #Chandrababu #Roundup

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు