న్యూస్ రౌండప్ టాప్ 20 

భట్టి విక్రమార్క తో పొంగులేటి భేటీ

సీఎల్పీ నేత మల్లు భట్టు విక్రమార్కతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు2.

మేధా పరిశ్రమపై కెసిఆర్ ప్రశంసలుమేధా పరిశ్రమలు చూసి తాను గర్వపడుతున్నానని,  తెలంగాణ బిడ్డలు దేశానికే ఆదర్శం అని సీఎం కేసీఆర్ అన్నారు.3.కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

భారతదేశానికి దారి చూపే ఒక దీప స్థంబంగా తెలంగాణను నిలుపుతామని మంత్రి కేటీఆర్ అన్నారు.హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరిన అమరుల స్మారకం జ్వలించే దీపం సాక్షిగా త్యాగదనులను ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటామని కేటీఆర్ అన్నారు.4.కెసిఆర్ పై బండి సంజయ్ విమర్శలుకాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు తన వాళ్లే అని సీఎం కేసీఆర్ ఫీల్ అవుతూ ఉంటారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.5.శ్రీవాణి ట్రస్ట్ పై శ్వేత పత్రం విడుదల చేస్తాం : టీటీడీ

శ్రీవాణి ట్రస్ట్ పై శ్వేత పత్రం విడుదల చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తెలిపారు.6.అతిపెద్ద గృహ సముదాయాన్ని ప్రారంభించిన కేసీఆర్ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ , సామాజిక గృహ సముదాయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు .సంగారెడ్డి జిల్లా కొల్లూరులో   145 ఎకరాలు విస్తీర్ణంలో నిర్మించిన 15,660 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేసీఆర్ ప్రారంభించారు7.

Advertisement

తెలంగాణలోని వైద్య కళాశాలలో కొనసాగుతున్న ఈడి సాదాలుతెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలు మెడికల్ కళాశాలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి.8.రైతులే ఎన్నికల బరలోకి దిగాలి : కేసిఆర్

తాను స్వయంగా రైతును కాబట్టే దేశంలో తొలిసారి కిసాన్ సర్కార్ నినాదం వినిపిస్తోందని బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు రైmతులే స్వయంగా ఎన్నికల బరులోకి దిగాలని ఆయన పిలుపునిచ్చారు.9.రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలుతెలంగాణలో నవంబర్ చివరివారం లో లేదా డిసెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.10.పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా కామెంట్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలో వదిలి సినిమాలు చేసుకోవడం మంచిదని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.11.తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశంరానున్న మూడు రోజుల్లో తెలంగాణలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.12.కాంగ్రెస్ టిఆర్ఎస్పై కిషన్ రెడ్డి విమర్శలు

కాంగ్రెస్ కు, బీ ఆర్ ఎస్ కి తేడా లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.13.గోల్కొండ బోనాలు ప్రారంభంహైదరాబాదులో గోల్కొండ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.14.జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలదేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాలలో ఆరవ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.15.నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరు

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్టులపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు కాంగ్రెస్ నాయకుల అరెస్టులు అప్రకాస్వామ్యతమని నాయకులను అరెస్టు చేసి ఉద్యమాన్ని ఆపలేరని రేవంత్ అన్నారు.16.కాంగ్రెస్ మునిగిపోయే నావకాంగ్రెస్ మునిగిపోయే నావ అని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.17.జగన్ విజయవాడ పర్యటన

Advertisement

వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు విజయవాడలో పర్యటించమన్నారు.18.జగన్నాథ రథయాత్రవిజయవాడలో ఈనెల 24న జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రకటించింది.19.తెలంగాణకు కేంద్ర ఎన్నికల ప్రతినిధులుతెలంగాణకు కేంద్ర ఎన్నికల ప్రతినిధులు రానున్నారు నేటి నుంచి మూడు రోజులు హైదరాబాదులోనే వారు మకాం వేయనున్నారు.20.ముగియనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

నేటితో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ముగియనున్నాయి నేడు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని కెసిఆర్ ప్రారంభించనున్నారు.

తాజా వార్తలు