న్యూస్ రౌండర్ టాప్ 20

1.అమృత్ పాల్ సింగ్ అరెస్ట్

కలిస్తాన్ మద్దతు దారు, మత ప్రబోధకుడు అమృత్పాల్ సింగ్( Amritpal Singh ) పంజాబ్ లోని మోగా పోలీసులు ఎదుట లొంగిపోయాడు.

2.  తెలుగు రాష్ట్రాల మీదుగా మరో ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్ది నియంత్రణకు గాను మైసూరు -  గౌహతి మధ్య ఓ సింగల్ ట్రిప్ స్పెషల్ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

3.అంబేద్కర్ స్ఫూర్తిని కెసిఆర్ నిజం చేస్తున్నారు

తెలంగాణ సీఎం కేసీఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని నిజం చేస్తున్నారని బ్రిటన్ కు చెందిన  ఎంపీ వీరేంద్ర శర్మ పేర్కొన్నారు.

4.కానిస్టేబుల్ పోస్టులు తుది రాత పరీక్ష

ఈనెల 30వ తేదీన తెలంగాణలోని పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తుది రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీస్ నియామక బోర్డు తెలిపింది.

5.సమ్మె చేస్తే అదే రోజు తొలగింపు

విద్యుత్ శాఖలో ఉన్న ఆర్టిజెన్ లు ఈనెల 25 నుంచి సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.సమ్మె చేస్తే అదే రోజున ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

6.సిరిసిల్ల మెడికల్ కాలేజీకి ఎంఎంసీ అనుమతి

తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల మెడికల్ కాలేజీకి జాతీయ వైద్య కమిషన్ అనుమతులు మంజూరు చేసింది.

7.కెసిఆర్ పై షర్మిల కామెంట్స్

రాష్ట్రంలోని రైతులను మోసగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ 420 అంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు షర్మిల విమర్శించారు.

8.ఐకెపి వివోఏ ల సమస్యలు పరిష్కరించాలి

ఐకెపి వివోఏల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని,  వారు చేస్తున్న సమ్మెను ప్రభుత్వం విరమంపజేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

9.25 నుంచి ఆర్టిజన్ల సమ్మె

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్లు ఈనెల 25 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు.

10.రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్

భాగ్యలక్ష్మి టెంపుల్ కు ప్రతి ఒక్కరూ రావాలని తన కోరిక నెరవేరిందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.తన పదవి పోతుందేమో నన్ను భయంతోనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నాడని సంజయ్ సెటైర్లు వేశారు.

11.ఈటల రాజేందర్ విమర్శ

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ను ఉద్దేశించి హుజూరాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు చేశారు. వీరుడు ఎప్పుడు కన్నీరు పెట్టడు అంటూ రేవంత్ ను ఉద్దేశించి విమర్శించారు.

12.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,112 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

13.విద్యార్థి నిరుద్యోగ నిరసన ప్రదర్శన

రేపు టిపిసిసి ఆధ్వర్యంలో ఖమ్మంలో విద్యార్థి నిరుద్యోగ నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

14.బాలినేని శ్రీనివాస్ రెడ్డి సవాల్

మైత్రి మూవీస్ లో నేను పెట్టుబడులు పెట్టాను అనడం అవాస్తవమని,  పెట్టినట్లు నిరూపిస్తే నా ఆస్తి రాసిస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సవాల్ చేశారు.

15.సింహాచలం చందనోత్సవంలో భక్తుల ఆందోళన

సింహాచలం చందనోత్సవంలో భక్తులు ఆందోళనకు దిగారు.వి విఐపి టిక్కెట్లను కొనుగోలు చేసినా గంటలు తరబడి క్యూ లైన్ లో ఉండిపోవడంతో అసహనం వ్యక్తం చేస్తూ ఈవో కు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు.

16.కర్ణాటక పర్యటనకు రాహుల్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు కర్ణాటక క రాహుల్ గాంధీ వెళ్లారు.

17.నేడు హైదరాబాద్ కు అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ కు విచ్చేశారు .చేవెళ్ల నియోజకవర్గం వికారాబాద్ బిజెపి సభలో ఆయన పాల్గొననున్నారు.

18.రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు

నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

19.పిడుగులు పడే అవకాశం

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

నేడు తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 55,750 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 60,820 .

Advertisement

తాజా వార్తలు