1.కేసిఆర్ పై విజయశాంతి కామెంట్స్

తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) జిల్లాల పర్యటనపై బీజేపీ నేత విజయశాంతి సెటైరికల్ కామెంట్స్ చేశారు.‘ తెలంగాణ బిడ్డలారా ముఖ్య మంత్రి కేసీఆర్ గారు మిమ్మల్ని చూస్తారట.ఏడాదికొకసారి వచ్చే ఉగాది లెక్క మల్ల ఎప్పుడు కన్పడతారో .లేదో ఈ గాలి మోటార్ల లో తిరిగే దొరగారు ? స్వాగతిస్తరో .లేదో ఓటు ద్వారా వచ్చే ఎన్నికలల్ల సెలవిస్తమని చెప్తరో మీ విజ్ఞత ” అంటూ ఆమె కామెంట్స్ చేశారు.
2.టీటీడీపీ కీలక సమావేశం
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. ఎన్టీఆర్ భవన్( NTR Bhawan ) లో రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు.
3.సిట్ విచారణకు రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) గురువారం ఉదయం సిట్ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరయ్యారు.
4.కెసిఆర్ పర్యటన
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈరోజు తెలంగాణ సీఎం కేటీఆర్ పర్యటించారు.మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం రెడ్డి కుంట తండా దుగ్గొండి మండలం అడవి రంగాపురంలో కెసిఆర్ పర్యటించారు.ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను కెసిఆర్ పరిశీలించారు.
5.రైతులను ఆదుకోండి : సిపిఐ

ఏపీలో కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్ కు లేఖ రాశారు.
6.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.శ్రీవారి దర్శనానికి భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.
7.ఢిల్లీ బీహార్ రాజస్థాన్ లకు బిజెపి కొత్త అధ్యక్షులు
దేశవ్యాప్తంగా బిజెపిని బలోపేతం చేయడానికి ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది.దీనిలో భాగంగానే ఢిల్లీ, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు బిజెపి కొత్త అధ్యక్షులు నియామకం చేస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( JP Nadda ) ఉత్తర్వులు జారీ చేశారు.
8.అమరవీరులకు పవన్ కళ్యాణ్ శ్రద్ధాంజలి

నేడు భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు.దేశం కోసం చనిపోయేవారు ఎల్లకాలం బతికే ఉంటారని పేర్కొంటూ భగత్ సింగ్ , శివరాం రాజ్ గురు, సుఖదేవ్ తాపర్ విషయంలో ఈ పలుకులు అక్షర సత్యం అనిపిస్తాయి అంటూ పవన్ అన్నారు.
9.రైతులకు కెసిఆర్ భరోసా
అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చి ధైర్యం చెప్పేందుకు సీఎం కేసీఆర్ ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పర్యటించారు.ఈ సందర్భంగా ఎకరానికి 10వేల నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కేసిఆర్ ప్రకటించారు.
10.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటలు దేశవ్యాప్తంగా కొత్తగా 1300 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
11.జర్నలిస్టుల రక్షణకు బిల్లు తెచ్చిన చత్తిస్ ఘడ్
జర్నలిస్టుల రక్షణ కోసం చత్తీస్ ఘడ్ ప్రభుత్వం ‘ చత్తీస్గడ్ మీడియా పర్సన్స్ ప్రొటెక్షన్ బిల్లు 2023 ‘ ను తీసుకువచ్చింది.
12. కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు.దీనిలో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విచారిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.
13.శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల
తిరుమల శ్రీవారి అజిత సేవా టిక్కెట్లను ఈరోజు ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేశారు.
14. టీఎస్పీఎస్సీ కేసు విచారణ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో సిట్ ఆరవ రోజు 9 మంది నిందితులను విచారిస్తుంది .
15.హరీష్ రావు పర్యటన
నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు.అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
16 .సిపిఎం జనచైతన్య యాత్ర

అదిలాబాద్ కేంద్రంలో సిపిఎం జనచైతన్య యాత్ర ప్రారంభమైంది .పట్టణం లో బైక్ ర్యాలీ , తర్వాత ఆర్ అండ్ బి ముందు బహిరంగ సభను ఏర్పాటు చేశారు .ఈ సభలో పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు హాజరుకానున్నారు.
17.తెలంగాణలో శుక్ర, శనివారాల్లో వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా శుక్ర , శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
18.ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి .ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న సభలో అనేక బిల్లులు, పలు శాఖల డిమాండ్లకు సభ్యులు ఆమోదం తెలపనున్నారు.
19.విశాఖలో కూలిన భవనం
కలెక్టరేట్ సమీపంలోని రామ జోగిపేటలో మూడంతస్తుల భవనం కుప్ప కూలింది.ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 54,800
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 59,780
.