డబ్బింగ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల బ్రహ్మరథం.. చరిత్రలో మొదటిసారి!

తెలుగు రాష్ట్రంలో గత కొంత కాలంగా తెలుగు సినిమా గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే విషయం తెలిసిందే.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టికెట్ల విషయం లో అత్యంత దారుణమైన పరిస్థితి నెలకొన్న నేపథ్యం లో చాలా సినిమాలు కనీసం విడుదల కాకుండానే వదిలేశారు.

 Ap And Ts Give Special Permeations To Beast And Kgf 2 , Ap ,  Ts  , Beast ,  Kgf-TeluguStop.com

చాలా సినిమాలను ఏపీలో విడుదల చేయలేం అంటూ నిర్మాతలు చేతులెత్తేయడంతో డైరెక్టుగా డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా విడుదల చేయడం జరిగింది.ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు లకు సంబంధించిన మార్పు జరిగింది.

ఏపీలో టికెట్ల రేట్ల ను పెంచడం తో వరుసగా పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి.తెలుగు సినిమా లు ఏపీ లో ఐదు షో కి అనుమతించేందుకు ప్రభుత్వం మొదట నో చెప్పింది.

అయితే ఇటీవలే ఓకే చెప్పి పలు కండీషన్స్ పెట్టింది.

ఆ కండిషన్ లను ఫాలో అయితే 5వ షో కి అనుమతి లభిస్తుంది అని జగన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

కానీ ఆ కండిషన్ లు ఏమీ కూడా పాటించకుండానే.అమలు చేయకుండా నే తమిళ స్టార్ హీరో విజయ్‌ నటించిన సినిమా బీస్ట్‌ మరియు కన్నడ నటించిన కే జి ఎఫ్ 2 సినిమా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది, హైదరాబాద్ తో పాటు మొత్తం నైజాం ఏరియా ఇంకా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రెండు సినిమాలకు సంబంధించిన పర్మిషన్ వచ్చాయి.

దాంతో ఈ సినిమా కూడా భారీ ఎత్తున వసూళ్లు దక్కించుకునే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ రెండు సినిమాలకు అనూహ్యంగా పర్మిషన్ ఇవ్వడం చూసి మీడియా వర్గాలతో పాటు ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్య తెలుగు లో సినిమాలు విడుదలైన సమయంలో అనుమతించకుండా ఇబ్బంది పెట్టినా ఏపీ ప్రభుత్వం ఇప్పుడు డబ్బింగ్ సినిమాలను నెత్తిన పెట్టుకోవడం ఏంటో అర్థం కావటం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు డబ్బింగ్ సినిమాలపై ఆసక్తి ఉన్నట్లుగా దీన్నిబట్టి చూస్తే అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube