న్యూస్ రౌండప్ ...టాప్ 20

1.ఎమ్మెల్సీ ఇంట్లో తుపాకీ కాల్పులు

ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాది పార్టీ షాజహాన్ పూర్ ఎమ్మెల్సీ అమిత్ యాదవ్ లక్నో లో నివసిస్తున్నారు.గత రాత్రి ఆయన నివాసంలో పుట్టినరోజు వేడుకలు జరిగాయి.ఆ సమయంలో రాకేష్ అనే వ్యక్తి తుపాకీని మరొకరికి ఇవ్వగా, దానిని తీసుకున్న వ్యక్తి రాకేష్ తలపై కాల్చడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.

 Ap And Telangana News Roundup Top-20, Ghmc Tcongres, Mukesh Goud Son, Tammineni-TeluguStop.com

2.ఎస్ ఈ సీ కి కాంగ్రెస్ ఫిర్యాదు

Telugu Allu Arha, Ap, Corona India, Corona Rashya, Ghmc Teachers, Mukesh Goud So

నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘి స్తూ తెలంగాణ ప్రభుత్వం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.ముఖ్యంగా ఎల్ అండ్ టి మెట్రో రైలు ప్రభుత్వ ప్రకటనలు ప్రచురించడంతో కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఫిర్యాదులో పేర్కొంది.

3.బీజేపీకి సిగ్గులేదు అంటూ…

బిజెపి నేతలకు సిగ్గు లేదు అని, అందుకే కాంగ్రెస్ నాయకులను బిజెపిలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

4.బీజేపీ లోకి ముఖేష్ గౌడ్ కుమారుడు

Telugu Allu Arha, Ap, Corona India, Corona Rashya, Ghmc Teachers, Mukesh Goud So

కాంగ్రెస్ మాజీ మంత్రి దివంగత ముఖేష్గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి బిజెపిలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఆయనకు బీజేపీలో గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ హామీ కూడా లభించినట్టు సమాచారం.

5.కామారెడ్డి సీఐ అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కామారెడ్డి జగదీష్ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

ఓ క్రికెట్ బెట్టింగ్ కేసులు జగదీష్ ఐదు లక్షలు డిమాండ్ చేయడంతో, ఇంటితోపాటు కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ సందర్భంగా కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

6.ఏపీ స్పీకర్ కు తప్పిన ప్రమాదం

Telugu Allu Arha, Ap, Corona India, Corona Rashya, Ghmc Teachers, Mukesh Goud So

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.శ్రీకాకుళం జిల్లా వంజంగి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోకి ఓ ఆటో వేగంగా దూసుకు రావడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

7.ఈరోజు బంగారం ధరలు

పది గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 51,240.22 క్యారెట్ల బంగారం ధర 46,900.వెండి ధర కిలో 66 ,500.

8.టీఆర్ఎస్ కు పోసాని మద్దతు

Telugu Allu Arha, Ap, Corona India, Corona Rashya, Ghmc Teachers, Mukesh Goud So

ప్రముఖ సినీ రచయిత నటుడు పోసాని కృష్ణ మురళి టిఆర్ఎస్ పార్టీ కి మద్దతు ప్రకటించారు.గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

9.వరద బాధితులకు 25 వేలు

గ్రేటర్ ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే వరద బాధిత కుటుంబాలకు 25 వేల చొప్పున సహాయం అందిస్తామని, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు.

10.రికార్డు స్థాయిలో కరోనా

Telugu Allu Arha, Ap, Corona India, Corona Rashya, Ghmc Teachers, Mukesh Goud So

రష్యాలో 24 గంటల్లోనే కొత్తగా 24,822 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవ్వడం వరుసగా ఇది మూడోసారి.

11.కేటీఆర్ తో యాంకర్ సుమ

తెలంగాణ మంత్రి కేటీఆర్ తో స్వయంగా మాట్లాడాలని ఎంతో సంతోషంగా ఉందని ప్రముఖ యాంకర్ సుమ అన్నారు.ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

12.అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్

Telugu Allu Arha, Ap, Corona India, Corona Rashya, Ghmc Teachers, Mukesh Goud So

అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ పుట్టినరోజు సందర్భంగా అరుదైన గిఫ్ట్ను ఆయన అందించారు.క్లాసిక్ మూవీ ” అంజలి ” సినిమాలో అంజలి అంజలి అనే పాటను రీ క్రియేట్ చేసి వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

13.పవన్ పనికి రాని వ్యక్తి అంటూ…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో రెండుసార్లు పోటీ చేసి, ఓటమి చెందారని, పక్క రాష్ట్రంలో దేనికీ పనికి రాని వ్యక్తి తో హైదరాబాదులో రాజకీయాలు ఏంటో బిజెపి నేతలకే తెలియాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు.

14.విశాఖ మన్యంలో భూప్రకంపనలు

Telugu Allu Arha, Ap, Corona India, Corona Rashya, Ghmc Teachers, Mukesh Goud So

విశాఖ మన్యం సీనియర్లు శనివారం ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు.ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో సీలేరు లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

15.ప్రముఖ కవి దేవిప్రియ కన్నుమూత

ప్రముఖ కవి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ శనివారం ఉదయం కన్ను మూశారు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు 7.10 గంటలకు తుది శ్వాస విడిచారు.

16.భారత్ లో కరోనా

Telugu Allu Arha, Ap, Corona India, Corona Rashya, Ghmc Teachers, Mukesh Goud So

భారత్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 40 6232 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 90,50,597 కి చేరింది.

17.తన సంతకం ఫోర్జరీ అయిందంటూ.

వరద సహాయం పై ఈసీకి తాను లేఖ రాయలేదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు .తన సంతకం ఎవరో ఫోర్జరీ చేశారని, తనపై అసత్య ఆరోపణలు టిఆర్ఎస్ నాయకులు చేస్తున్నారంటూ బండి క్లారిటీ ఇచ్చారు.

18.ఎన్నికల విధుల్లో వారికి మినహాయింపు

Telugu Allu Arha, Ap, Corona India, Corona Rashya, Ghmc Teachers, Mukesh Goud So

జిహెచ్ఎంసి ఎన్నికల విధుల కోసం ఉపాధ్యాయులను మినహాయించాలని, ఇతర అధికారులు సిబ్బంది జాబితా పంపించాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు.

19.ఫిషింగ్ హార్బర్ లకు జగన్ శంకుస్థాపన

మత్స్యకారుల సౌకర్యార్థం నెల్లూరు జిల్లా జువ్వలదిన్నే, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నాలుగు ఫిషింగ్ హార్బర్ లకు సీఎం జగన్ పర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు.

20.జనవరి 15న ఓటర్ల తుది జాబితా

Telugu Allu Arha, Ap, Corona India, Corona Rashya, Ghmc Teachers, Mukesh Goud So

రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను జనవరి 15వ తేదీన ప్రచురిస్తామని ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి విజయనంద్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube