ఇప్పుడు కూడా రాజకీయమైనా ? వీళ్లల్లో మార్పు రాదా ?

చేయాల్సిన సమయంలో రాజకీయాలు చేయాలి.ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు అందరూ ఏకమై రాష్ట్రానికి మేలు జరిగే విధంగా వ్యవహరించాలి.

 Ap All Political Parties Are Focusing On Elections Only-TeluguStop.com

ప్రస్తుతం రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలు అల్లాడుతున్నాయి.కరోనా వైరస్ వ్యాపించకుండా ఏం చర్యలు తీసుకోవాలి అనే దానిపైన తీవ్రంగా కసరత్తు జరుగుతోంది.

కేరళలో విపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా మీడియా సమావేశం నిర్వహించి మరీ ప్రజలను అప్రమత్తం చేశారు.ఈ సందర్భంగా రాజకీయాలు వేరు ప్రజల సంక్షేమం వేరు అన్నట్టుగా వారు మీడియా సమావేశం నిర్వహించి ఆదర్శంగా నిలిచారు.

ఇక పక్కనే ఉన్న తెలంగాణలోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూ, కఠిన నిర్ణయాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది.ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నిత్యం ఆసుపత్రులను సందర్శిస్తూ కరోనా వైరస్ లక్షణాలు ఉన్న పేషంట్ లను సైతం పరామర్శిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

Telugu Ap, Corona Ap, Indiannarendra, Jagan, Janasena Tdp, Janatha Curfew, Ycp A

మరి కొంతమందికి వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు.కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు టిడిపి, వైసిపి, బిజెపి జనసేన ఇలా అందరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సరికొత్త రాజకీయానికి తెర లేపుతున్నారు.

ముఖ్యంగా ఈ విషయంలో ఏపీ అధికార పార్టీ వైసీపీ తీవ్ర విమర్శలను మూటగట్టుకుంటోంది.సాక్షాత్తు రాజ్యాంగ బద్ధ సంస్థలైన ఎన్నికల కమిషన్ ను అపహాస్యం చేసేలా సీఎం జగన్, ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.

వీటన్నిటినీ పక్కన పెడితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తీవ్రస్థాయిలో ఏపీలో ఉండడంతో దీనిపైన మాత్రమే ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి.

Telugu Ap, Corona Ap, Indiannarendra, Jagan, Janasena Tdp, Janatha Curfew, Ycp A

ఈ సందర్భంగా మిగతా అన్ని విషయాలను పక్కన పెట్టేసి, దీనిపైన ఎక్కువగా దృష్టి పెట్టాయి.ఏపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.కనీసం ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటనలు కూడా ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు.

రేపు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు కర్ఫ్యూ విధిస్తున్నారు.కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోబోతున్నారు.

అంతే తప్ప ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుని రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఏ విధమైన కఠిన చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.

తమకు రాజకీయం, స్థానిక సంస్థల ఎన్నికలే ముఖ్యం తప్ప మిగతా ఏ విషయాల గురించి తాము పట్టించుకోము అన్నట్టుగా వ్యవహారం చేస్తున్నారు ఏపీలో రాజకీయ నాయకులు.

ఈ విషయంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే బేధం లేకుండా అందరూ ఇదేవిధంగా వ్యవహరిస్తూ సరికొత్త రాజకీయాలకు తెరలేపుతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube