ఈ కలర్ ఫుల్ సిటీని చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే.. దీని ప్రత్యేకత ఏంటంటే..!?

Anyone Who Wants To See This Colorful City Should Pay A Visit

మీకొక వింత అయిన ఇళ్ల గురించి చెప్పాలి.ఈ ఇళ్ల నిర్మాణం గురించి మీకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి.

 Anyone Who Wants To See This Colorful City Should Pay A Visit-TeluguStop.com

ఈ ఇళ్ళు చూడడానికి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తాయి.ఒక విధముగా చెప్పాలంటే అచ్చం ఈ ఇళ్ళు చూడడానికి చిన్న పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బొమ్మలులాగానే ఉంటాయి.

మరి అలాంటి ఇళ్ల నిర్మాణాలను మీరు చూడాలనుకుంటే ఉక్రెయన్ వెళ్లాల్సిందే.ఉక్రేయిన్ లోని కీవ్ నగరంలోకలర్ఫుల్ కట్టడాలు మనకి కనిపిస్తాయి.

 Anyone Who Wants To See This Colorful City Should Pay A Visit-ఈ కలర్ ఫుల్ సిటీని చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే.. దీని ప్రత్యేకత ఏంటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ పట్టణాన్ని ‘కంఫర్ట్ టౌన్‘ అని పిలుస్తారు.అలాగే ఈ పట్టణ నిర్మాణం 2019లో పూర్తిచేశారు.

ప్రస్తుతం ఈ భవనాలకు సంబందించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌ గా మారుతున్నాయి.

ఈ పట్టణంలోని ప్రతి బిల్డింగ్ చూడడానికి రకరకాల రంగులతో ఉంటాయి.

ఎక్కువగా పింక్, ఆరెంజ్, గ్రీన్, పసుపు వంటి రంగులతో చాలా కలర్ఫుల్‌ గా కనిపిస్తాయి.ఎత్తైన ప్రదేశం నుంచి ఈ భవనాలను చూస్తే చిన్న పిల్లలు ఆడుకొనే లెగో బ్రిక్స్ రూపంలో కనిపిస్తాయి.

అందుకే వీటిని లెగో బిల్డింగ్స్ అని అక్కడ ప్రజలు పిలుస్తున్నారు.ప్రముఖ డిజైనర్లు డిమిట్రో వాసిలీవ్, అలెగ్జాండర్ పోపోవ్, ఓల్గా అల్ఫియోరోవాలు ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు పదకొండేళ్లు కష్టపడ్డారు.

Telugu Latest, Ukrain-Latest News - Telugu

ఈ పట్టణం సుమారు మొత్తం 115 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు.అలాగే ఇక్కడ 8,500 ఫ్లాట్లను నిర్మించారు.ఈ రంగుల ఇళ్ల గురించి తెలియగానే అక్కడ ఫ్లాట్లు కొనుక్కునే అందుకు ప్రజలు ఎగబడ్డారు.ఫిబ్రవరి 2020లో ఆ దేశంలోనే అత్యధికంగా నెలకు 200 కంటే ఎక్కువ ఇళ్లు హాట్ కేకుల్లాగా అమ్ముడయ్యాయంటే డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో మీరే ఊహించుకోండి.

ప్రస్తుతం ఈ కంఫర్ట్ టౌన్‌లో 20,000 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు.

#Ukrain

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube