ఈ పెన్నుల అవ్వ స్టోరీ తెలిస్తే ఎవ్వ‌రైనా ఫిదా అవ్వాల్సిందే

కొంద‌రి జీవితం ఎప్ప‌టికీ స్ఫూర్తి దాయ‌కంగానే ఉంటుంది.వారు వ‌య‌సుతో సంబంధం లేకుండా చేసే ప‌నులు అంద‌రికీ ఆద‌ర్శ‌మే.

 Anyone Who Knows The Grandmother Story Of These Pens Should Have Paid-TeluguStop.com

అలాంటి వారి జీవితాల గురించి చ‌రిత్ర ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది.చాల‌మంది ప‌నిచేయ‌డానికి బ‌ద్ధ‌కంగా ఫీల్ అవుతుంటారు.

అలాంటి వారంతా ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే అవ్వ గురించి తెలిస్తే మాత్రం క‌చ్చితంగా మారాల‌నుకుంటారేమో.కొంద‌రు వ‌య‌సులో ఉండి ఆరోగ్యంగా ఉన్నా కూడా ఏ మాత్రం ప‌నిచేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు.

 Anyone Who Knows The Grandmother Story Of These Pens Should Have Paid-ఈ పెన్నుల అవ్వ స్టోరీ తెలిస్తే ఎవ్వ‌రైనా ఫిదా అవ్వాల్సిందే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఈ అవ్వ మాత్రం త‌న వ‌య‌సుతో సంబంధం లేకుండా క‌ష్ట‌ప‌డుతోంది.

ప్ర‌స్తుతం సోషల్ మీడియా ఈమె గురించి విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

తన కాళ్ల మీద ఆధార‌ప‌డి బ్ర‌తుకుతున్న ఈ అవ్వ ఇప్పుడు ఎంద‌రికో స్ఫూర్తి దాయ‌కంగా నిలుస్తోంది.కాగా ఈమెకు సంబంధించిన స్టోరీని రీఅప్ స్టూడియో సంస్థ వ్యవస్థాపకురాలు అయిన‌టువంటి శిఖా రథి వెల్ల‌డించ‌గా అది కాస్తా ట్రెండింగ్ లోకి వ‌చ్చేసింది.

ఫూణె ప‌ట్ట‌ణంలోని ఎంజీ రోడ్డు వైపుగా శిఖా ఏదో ఒక ప‌నిమీద అక్క‌డ‌కు వెళ్లిందంట‌.అయితే అక్క‌డ చాలా పెద్ద వ‌య‌స్సులో ఉన్న ఓ అవ్వ క‌నిపించిందంట‌.

అయితే ఆమె చేతిలో ఓ అట్టపెట్టె ప‌ట్టుకుని ఉంది.

Telugu Grandmother Story, Inspired, Mg Road, Pen Grandmother Story, Pune, Ratan, Shikha Rathi, Story Of Pens Old Woman, Viral News-Latest News - Telugu

దాని మీద ఇలా రాసి ఉంది.అదేంటంటే తాను అడుక్కోవ డానికి ఇష్ట‌ప‌డ‌న‌ని, కానీ త‌న చేతిలో ఉన్న పెన్నుల‌ను ద‌య‌చేసి కొనుక్కుని ఒక్కొక్కటి రూ.10 చొప్పును చెల్లించి త‌న బ్ర‌తుకు దెరువుకు తోడ్ప‌డాలంటూ అందులో రాసి ఉంది.ఇది చ‌దివిన శిఖా వెంట‌నే ఎమోష‌న‌ల్ అయిపోయిందంట‌.వెంట‌నే ఆమె ద‌గ్గ‌రున్న ఆ పెన్నుల్ని మొత్తం కొనుక్కుని ఆమె ఆత్మ గౌర‌వాన్ని కాపాడిందంట‌.ఇంత‌కీ ఆ వృద్ధురాలి పేరు రతన్ అని ఆమె చెబుతోంది.ర‌త‌న్ త‌న జీవితంలో నిజ‌మైన‌ హీరో అంటూ శిఖా వెల్ల‌డించింది.

.

#Ratan #Story #Mg #Pune #Shikha Rathi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube